AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hot Air Balloon Festival 2026: హైదరాబాద్‌లో హాట్ ఎయిర్ బెలూన్స్ రైడ్‌.. మీరూ ఇలా బుక్‌ చేసుకోండి!

హైదరాబాద్‌ మహానగరం గగనతలంపై హాట్ ఎయిర్ బెలూన్స్ సందడి చేశాయి. గోల్కొండ గోల్ఫ్‌ క్లబ్‌లో శుక్రవారం హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ షో ప్రారంభమవడంతో తెల్లవారుజామున మేఘాలను దాటుతూ గాల్లోకి హాట్ ఎయిర్ బ్యాలన్స్ ఎగిరాయి. హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ నుంచి నగరం నలువైపులకు గాల్లోకి ఎగిరిన సుమారు పదికి పైగా హాట్ ఎయిర్ బెలూన్స్ చూపరులకు కనువిందు చేశాయి..

Hot Air Balloon Festival 2026: హైదరాబాద్‌లో హాట్ ఎయిర్ బెలూన్స్ రైడ్‌.. మీరూ ఇలా బుక్‌ చేసుకోండి!
Hyderabad Hot Air Balloon Festival 2026
Srilakshmi C
|

Updated on: Jan 17, 2026 | 1:35 PM

Share

హైదరాబాద్, జనవరి 17: సంక్రాంతి పండగ సందర్భంగా తెలంగాణ పర్యాటకశాఖ ‘సెలబ్రేట్‌ ద స్కై’ పేరిట హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ షో మొదలైంది. ఇందులో భాగంగా పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ ప్రదర్శనను ప్రారంభించారు. సుమారు గంటన్నర పాటు టూరిజం మినిస్టర్ జూపల్లి హాట్ ఎయిర్ బెలూన్ రైడ్లో 13 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ గొప్ప అనుభూతిని ఇచ్చిందని మంత్రి జూపల్లి అన్నారు.

శనివారం సాయంత్రం నాలుగు గంటల వరకు పరేడ్ గ్రౌండ్స్ లో హాట్ ఎయిర్ బెలూన్ షో జరుగుతుంది. టికెట్ ద్వారా హాట్ ఎయిర్ బెలూన్ లో నగరవాసులు రైడ్ చేసే అవకాశం ఉంటుందని నిర్వహకులు తెలిపారు. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా భవిష్యత్తులో హార్ట్ ఎయిర్ బెలూన్ ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం ఈ షోను నిర్వహిస్తుంది. విదేశాల నుంచి రప్పించిన 18 ఎయిర్‌ బెలూన్లను ఇక్కడ ఎగురవేశారు. ఢిల్లీకి చెందిన స్కై వరల్డ్‌ బెలూన్‌ సఫారీ నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. యూకే, స్పెయిన్, ఫ్రాన్స్, బెల్జియం దేశస్థులు బెలూన్ల పైలెట్లు, సహాయకులుగా వ్యవహరించారు. పర్యాటకశాఖ బుక్‌ మై షో ద్వారా ఇదివరకే టికెట్లు విక్రయించింది.

ఇవి కూడా చదవండి

హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ 2026 టికెట్లు ఎలా బుక్‌ చేసుకవాలి?

హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించాలనుకునే వారు రైడ్‌లను బుక్ చేసుకోవచ్చు. ఉదయం బెలూన్ రైడ్‌ల ధర ఒక్కొక్కరికి రూ. 2,000 ఉంటుంది. 30-40 నిమిషాలపాటు 4,500 అడుగుల వరకు 8 నుండి 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. అదే సమయంలో సాయంత్రం టెథర్డ్ రైడ్‌లు, నైట్ గ్లో షోలు నామమాత్రపు రుసుములతో టికెట్లు అందిస్తారు. ప్రేక్షకులకు ఎంట్రీ ఫీజు రూ. 15 మాత్రమే .

  • వేదిక: పరేడ్ గ్రౌండ్, సికింద్రాబాద్
  • వయోపరిమితి: 5 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ
  • సమయం : ఉదయం 5:00 గంటల నుండి
  • ఉదయం సెషన్: ఉదయం 5:30 నుండి 9:00 వరకు (టేకాఫ్: గోల్కొండ గోల్ఫ్ క్లబ్)
  • సాయంత్రం సెషన్: సాయంత్రం 4:00 నుంచి రాత్రి 9:00 వరకు (నైట్ గ్లో: పరేడ్ గ్రౌండ్స్)

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

హైదరాబాద్‌లో హాట్ ఎయిర్ బెలూన్స్ రైడ్‌.. ఇలా బుక్‌ చేసుకోండి!
హైదరాబాద్‌లో హాట్ ఎయిర్ బెలూన్స్ రైడ్‌.. ఇలా బుక్‌ చేసుకోండి!
ధనుష్- మృణాళ్ పెళ్లి రూమర్లు.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?
ధనుష్- మృణాళ్ పెళ్లి రూమర్లు.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?
దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచిన తెలంగాణ..!
దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచిన తెలంగాణ..!
సూరీడు గుర్తున్నాడా..? ఆయన గురించి చాలామందికి తెలియని నిజం..
సూరీడు గుర్తున్నాడా..? ఆయన గురించి చాలామందికి తెలియని నిజం..
ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ ఇచ్చారు.. కానీ మిస్ అయ్యింది
ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ ఇచ్చారు.. కానీ మిస్ అయ్యింది
ఇది కదా అసలైన పండుగంటే.. ఆ ఊరిలో గోమాత అలంకరణ పోటీలు!
ఇది కదా అసలైన పండుగంటే.. ఆ ఊరిలో గోమాత అలంకరణ పోటీలు!
మీరు మౌని అమావాస్య నాడు ఉపవాసం ఉంటున్నారా..? ఈ విషయాలు..
మీరు మౌని అమావాస్య నాడు ఉపవాసం ఉంటున్నారా..? ఈ విషయాలు..
సంక్రాంతి పేరుతో గ్రాండ్ గిఫ్ట్ .. క్లిక్ చేస్తే ఖేల్ ఖతం!
సంక్రాంతి పేరుతో గ్రాండ్ గిఫ్ట్ .. క్లిక్ చేస్తే ఖేల్ ఖతం!
బౌలరును వెక్కిరించబోయి వికెట్ పారేసుకున్న పాక్ క్రికెటర్
బౌలరును వెక్కిరించబోయి వికెట్ పారేసుకున్న పాక్ క్రికెటర్
‘మన శంకర వరప్రసాద్’కి నెగెటివ్ రివ్యూ ఇచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ
‘మన శంకర వరప్రసాద్’కి నెగెటివ్ రివ్యూ ఇచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ