Zodiac Signs: మకర రాశిలోకి పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్ జాక్‌పాట్
మూడు గ్రహాలు మకరరాశిలోకి ప్రవేశిస్తుండటంతో డబుల్ రాజయోగం ఏర్పడుతోంది. సూర్యుడు, శుక్రుడు ఇప్పటికే మకరరాశిలో ఉన్నారు. ఇప్పుడు కుజుడు కూడా మకరరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మూడు గ్రహాల ప్రవేశంతో త్రిగ్రాహి యోగం మకరరాశిలో ఏర్పడుతుంది. త్రిగ్రాహి యోగం చాలా శుభప్రదమైన యోగంగా పరిగణించబడుతుంది. అదే సమయంలో కుజుడు ఉచ్ఛ రాశిలో ఉన్నందున రుచక రాజయోగం ఏర్పడుతుంది. ఒకేసారి మకరరాశిలో రెండు రాజయోగాలు ఏర్పడటం శుభప్రదంగా పరిగణించబడుతుంది.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో తన రాశిని మారుస్తుంది. గ్రహాల మార్పుతో 12 రాశులు ఏదో ఒక రకంగా ప్రభావితానికి గురవుతాయి. గ్రహాల సంచారాల కారణంగా రాజయోగాలు కూడా ఏర్పడతాయి. ఇప్పుడు మకరరాశిలో డబుల్ రాజయోగాలు ఏర్పడుతున్నాయి. ఇది కొన్ని రాశులవారికి సానుకూల శక్తిని ఇస్తుంది. అంటే కుజుడిని గ్రహాలకు అధిపతిగా పరిగణిస్తారు. ఈ కుజుడు ఒక రాశిలో 45 రోజులు వరకు ఉంటాడు. అయితే, సూర్యుడు, శుక్రుడు ఇప్పటికే మకరరాశిలో ఉన్నారు. ఇప్పుడు కుజుడు కూడా మకరరాశిలోకి ప్రవేశిస్తున్నాడు.
మూడు గ్రహాల ప్రవేశంతో త్రిగ్రాహి యోగం మకరరాశిలో ఏర్పడుతుంది. త్రిగ్రాహి యోగం చాలా శుభప్రదమైన యోగంగా పరిగణించబడుతుంది. అదే సమయంలో కుజుడు ఉచ్ఛ రాశిలో ఉన్నందున రుచక రాజయోగం ఏర్పడుతుంది. ఒకేసారి మకరరాశిలో రెండు రాజయోగాలు ఏర్పడటం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ ప్రత్యేక సంఘటన కారణంగా కొన్ని రాశులవారు అదృష్టవంతులు కానున్నారు. మకరరాశిలో రెండు రాజయోగాలతో ఏయే రాశులకు అదృష్టం కలుగుతుందో తెలుసుకుందాం.
మేష రాశి
మేష రాశిలోని 10వ ఇంట్లో రెండు రాజయోగాలు ఏర్పడతాయి. దీని కారణంగా మేష రాశివారి జీవితంలో ఊహించని మలుపులు సంభవిస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆదాయంలో పెరుగుదల ఉండవచ్చు. ఆకస్మిక ఆర్థిక లాభాలు ఉంటాయి. మీరు ఇచ్చిన అప్పులు తిరిగి వస్తాయి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. వివాహం కోసం ఎదురుచూస్తున్నవారికి మంచి సంబంధం దొరుకుతుంది. ఉద్యోగం లేదా విద్య కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఈ రాశివారికి అన్నీ సానుకూలంగా జరుగుతాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి 7వ ఇంట్లో రెండు రాజయోగాలు ఏర్పడతాయి. దీని వల్ల కర్కాటక రాశి వారి వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో సంబంధం మెరుగుపడుతుంది. వ్యాపారులకు మంచి లాభాలుంటాయి. ఊహించని ప్రయోజనాలు పొందుతారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. పోటీ పరీక్షలో విజయం సాధించి ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం ఉంది. కుటుంబం నుంచి సమస్యలు పరిష్కారమవుతాయి. ఇంట్లో సంపద పెరుగుతుంది. లావాదేవీల సమస్య నుంచి బయటపడతారు. మీరు అనుకున్న పనులను ప్రణాళిక ప్రకారం పూర్తి చేస్తారు.
కన్యా రాశి
కన్యా రాశిలో 5వ ఇంట్లో రెండు రాజయోగాలు ఏర్పడుతున్నాయి. దీని కారణంగా ఈ రాశివారికి ఊహించని ప్రయోజనాలు పొందుతారు. వృత్తిలో పోటీ తగ్గవచ్చు. వృత్తి నుంచి తలెత్తే సమస్యలు తగ్గుతాయి. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా పురోగతిని చూస్తారు. మీ ప్రేమ జీవితంలో పురోగతి, ఆనందం ఉంటుంది. ప్రేమ వివాహాలు తదుపరి దశకు వెళ్లే అవకాశం ఉంది. మీరు పెట్టుబడుల నుంచి మంచి రాబడిని అందుకుంటారు. మీ పాత అప్పులను తీర్చేస్తారు. ఆస్తి సంబంధిత విషయాలలో మీకు అనుకూలమైన తీర్పు వస్తుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశిలోని మూడవ ఇంట్లో రెండు రాజయోగాలు ఏర్పడుతున్నాయి. దీని వల్ల వృశ్చిక రాశి వారికి ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. మీ సోదరులు, సోదరీమణుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. పనికి సంబంధించిన ప్రయాణాల నుంచి మీకు ఆర్థిక లాభాలు ఉంటాయి. మీకు అనేక వనరుల నుంచి డబ్బు వస్తుంది. ఉద్యోగం ఉన్నవారికి ఆదాయం పెరుగుతుంది. మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
(Declaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్యం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని TV9 తెలుగు ధృవీకరించదు.)
