AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్ స్టైల్‌తో పల్సర్ 125 నియాన్..

Bajaj Pulsar 125 Neon: పల్సర్ అంటేనే క్రేజ్.. ఆ బ్రాండ్ అంటేనే పవర్.. అయితే పల్సర్ కొనాలంటే లక్షలు ఖర్చు చేయనక్కర్లేదు. కేవలం సామాన్యుల కోసం, కాలేజీ స్టూడెంట్స్ స్టైల్ కోసం బజాజ్ ఒక అదిరిపోయే ఆప్షన్ తీసుకొచ్చింది. అదే బజాజ్ పల్సర్ 125 నియాన్. తక్కువ ధరలో స్పోర్టీ లుక్, అదిరిపోయే మైలేజ్ ఇచ్చే ఈ బైక్‌కు సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్ స్టైల్‌తో పల్సర్ 125 నియాన్..
Bajaj Pulsar 125 Neon
Krishna S
|

Updated on: Jan 17, 2026 | 3:22 PM

Share

నేటి కాలంలో బైక్ అనేది కేవలం అవసరం మాత్రమే కాదు.. యువతకు అదొక స్టైల్ స్టేట్‌మెంట్. ముఖ్యంగా పల్సర్ బ్రాండ్ అంటే భారతీయ కుర్రాళ్లలో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే పల్సర్ సిరీస్ బైక్‌లు కొనాలంటే భారీగా ఖర్చు చేయాలని చాలామంది భావిస్తారు. అలాంటి వారి కోసమే బజాజ్ పల్సర్ 125 నియాన్ సింగిల్ సీట్ మోడల్‌ను అందుబాటులోకి తెచ్చింది. తక్కువ బడ్జెట్, అదిరిపోయే మైలేజీతో ఈ బైక్ మార్కెట్లో హాట్ కేకులా అమ్ముడవుతోంది.

ధర – బడ్జెట్

పల్సర్ 125 నియాన్ యొక్క అతిపెద్ద ప్లస్ పాయింట్ దాని ధర. ఎక్స్-షోరూమ్ ధర: సుమారు రూ. 79,048 నుంచి ప్రారంభమవుతుంది. ఆన్-రోడ్ ధర మీ నగరాన్ని బట్టి సుమారు రూ. 85,633 నుంచి రూ. 92,414 మధ్య ఉంటుంది. లక్ష రూపాయల లోపు బడ్జెట్‌లో ప్రీమియం స్పోర్టీ లుక్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

ఇంజన్ సామర్థ్యం – పెర్ఫార్మెన్స్

ఈ బైక్‌లో బజాజ్ తన సిగ్నేచర్ టెక్నాలజీని ఉపయోగించింది. 124.4 cc ఎయిర్-కూల్డ్ DTS-i ఇంజన్, 11.8 PS పవర్, 10.8 Nm టార్క్‌ను అందిస్తుంది. గంటకు గరిష్టంగా 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. సిటీ ట్రాఫిక్‌లో సులభంగా దూసుకుపోవడానికి హైవేలపై స్మూత్ రైడింగ్ కోసం ఇది పర్ఫెక్ట్‌గా ఉంటుంది.

మైలేజీ: పెట్రోల్ ఖర్చుకు చెక్

సాధారణంగా స్పోర్ట్స్ లుక్ బైక్‌లు మైలేజీ తక్కువ ఇస్తాయనే భయం ఉంటుంది. కానీ ఈ పల్సర్ 125 లీటరుకు 50 నుండి 57 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. దీని 11.5 లీటర్ల ట్యాంక్‌ను ఒకసారి ఫుల్ చేస్తే, సుమారు 550 నుండి 600 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. అంటే ఆఫీసుకి వెళ్లేవారికి పెట్రోల్ భారం తగ్గించుకోవాలనుకునే వారికి ఇది సరైన తోడు.

హై-టెక్ ఫీచర్లు – సేఫ్టీ

తక్కువ ధర అయినప్పటికీ, ఫీచర్ల విషయంలో బజాజ్ ఎక్కడా రాజీ పడలేదు. సెమీ డిజిటల్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, ముందు భాగంలో 240 mm డిస్క్ బ్రేక్, యాంటీ-స్కిడ్ టెక్నాలజీతో కూడిన సేఫ్టీ సిస్టమ్, గుంతల రోడ్లపై కూడా కుదుపులు తెలియకుండా నైట్రోక్స్ షాక్ అబ్జార్బర్స్ అమర్చారు. సురక్షిత ప్రయాణం కోసం ట్యూబ్‌లెస్ టైర్లు ఉన్నాయి.

ఎవరికి సూట్ అవుతుంది?

మీరు ఒక కాలేజీ స్టూడెంట్ అయినా లేదా రోజువారీ ఆఫీస్ పనుల కోసం సిటీలో తిరిగే ఉద్యోగి అయినా.. తక్కువ మెయింటెనెన్స్, అద్భుతమైన రీసేల్ వాల్యూ ఇచ్చే ఈ బైక్ మీకు బెస్ట్ ఛాయిస్. పల్సర్ బ్రాండ్ వాల్యూతో పాటు పాకెట్ ఫ్రెండ్లీ ధరలో ఈ బైక్ ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది. స్టైల్, పవర్, మైలేజ్.. ఈ మూడు కలగలిసిన ప్యాకేజీనే బజాజ్ పల్సర్ 125 నియాన్. లక్షలోపు బడ్జెట్‌లో బైక్ కొనాలనుకునే వారు కచ్చితంగా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్
మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్