AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ప్రాజెక్టుల నిర్లక్ష్యం.. ఎవరి పాపం… ఎవరి లోపం?

బాస్ ఈజ్ బ్యాక్.. ఈ డైలాగే వినిపిస్తోంది బీఆర్ఎస్ క్యాడర్ నిండా. 'సమయం లేదు మిత్రమా.. సమరం కోసం సిద్ధం' అంటూ ఏ చర్చకైనా సై అంటోంది కాంగ్రెస్. మొత్తంగా ఐదు అంశాలపై 'నువ్వా-నేనా' అని మాటల యుద్ధం చేస్తున్నాయి కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్. ఒకటి డీపీఆర్ మ్యాటర్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎవరి హయాంలో కేంద్రం నుంచి వాపస్ వచ్చిందనేది మొదటి అంశం. ఇక రెండోది.. ఏపీతో అంటకాగి నీళ్లను అప్పగించారనే వాదన. జగన్‌తో వాటాలు పంచుకున్నది కేసీఆరే కదా అని కాంగ్రెస్... చంద్రబాబుతో కలిసి నీళ్లను ఆంధ్రాకు వదులుతున్నారని బీఆర్ఎస్ వాదించుకుంటున్నాయి. ఇక మూడో అంశం.. ఆయకట్టుకు ఎవరెన్ని నీళ్లిచ్చారని. కాళేశ్వరంతో ఎకరం కూడా తడవలేదని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే.. 17 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చిన విషయం నిరూపిస్తామంటోంది బీఆర్ఎస్. ఇక నాలుగో అంశం.. ఎవరి హయాంలో ఎక్కువ పంట పండింది? ధాన్యం ఉత్పత్తిలో రికార్డులు సృష్టించిందే కాంగ్రెస్ హయాంలో అని అధికార పార్టీ అంటుంటే.. అసలు దానికి ఆజ్యం పోసిందే కేసీఆర్ హయాంలో అని ప్రతిపక్షం కౌంటర్ ఇస్తోంది. ఇక ఐదోది.. తెలంగాణకు బీజేపీ అన్యాయం చేస్తోందన్న అంశం. కేసీఆర్ ప్రెస్‌మీట్ గానీ.. కౌంటర్‌గా సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్, అటు బీజేపీ నాయకులు ఇచ్చిన సమాధానాలు గానీ ఈ ఐదు అంశాల చుట్టూనే తిరిగాయి. ఇంతకీ.. నీటి వాటాల లెక్కల్లో వాస్తవాలేంటి? ఎవరి హయాంలో ప్రాజెక్టులపై నిర్లక్ష్యం జరిగింది? ప్రతిపక్షం ఆరోపణలేంటి, అధికార పార్టీ సమాధానమేంటి?

Telangana: ప్రాజెక్టుల నిర్లక్ష్యం..  ఎవరి పాపం... ఎవరి లోపం?
Telangana Water Dispute
Ram Naramaneni
|

Updated on: Dec 22, 2025 | 9:00 PM

Share

రెండు రాష్ట్రాల మధ్య జలజగడం విభజన నాటిదే. కొత్తదేం కాదు. అసలు.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నినాదంలో మొదటి అంశమే.. నీళ్లు. రెండుగా విడిపోయినా.. అవే నీళ్లు, అవే నిప్పులు. విభజన జరిగి పదకొండున్నరేళ్లైనా అదే పంతం, అదే జగడం. కాకపోతే.. రెండు రాష్ట్రాల మధ్య కంటే కూడా రెండు పార్టీల మధ్యే ఎక్కువ కొట్లాట జరుగుతోంది. మీరే తప్పు చేశారని ఒకరు. అంతా మీరే చేసిందే కదా అని మరొకరు. విభజన నాటి నుంచి నీళ్ల విషయంలో ఏం జరిగిందో మళ్లీ తవ్వకుంటున్నారు. ఓ నాలుగు రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిపక్షాన్ని ఉద్దేశించి, ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రతిసారి అడ్డుపడకుండా.. సహకరించాలన్నారు. నీళ్ల విషయమే గానీ, మరేదైనా అంశమే గానీ అసెంబ్లీలో చర్చించడానికి సిద్ధం అన్నారు సీఎం రేవంత్. అదే విషయం కేసీఆర్ ప్రెస్‌మీట్ తరువాత కూడా రిపీట్ చేశారు. ఒక విధంగా కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి విసిరిన ఛాలెంజ్ అనే అనాలేమో దాన్ని. ఛాలెంజ్ స్వీకరించారో.. లేక సరిగ్గా రెండేళ్ల సమయం ఇచ్చాం ఇక చాలు అనుకున్నారో.. మాజీ సీఎం కేసీఆర్ ఫుల్ ప్రిపరేషన్‌తో మీడియా ముందుకొచ్చారు. నిన్నటి దాకా ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటూ ప్రభుత్వంపై విరుచుకుపడడమే అజెండాగా జనంలోకి వస్తామన్నారు. గులాబీ దళపతి కేసీఆర్ పాయింట్ ఔట్...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి