AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mosquitoes: చిమ్మచీకట్లోనూ దోమలు మనల్ని ఎలా గుర్తిస్తాయి? వాటికి చీకట్లోనూ కళ్లు కనిపిస్తాయా..

దోమల బెడద దాదాపు ప్రతి ఇంట్లో ఉంటుంది. కానీ గది పూర్తిగా చీకటిగా ఉన్నప్పుడు లేదా మనం దుప్పటి కప్పి నిద్రపోతున్నప్పుడు కూడా దోమలు చెవుల వద్ద ఝుమ్మని శబ్దం చేస్తుంటాయి. వాటికి చిమ్మచీకట్లోనూ చూపు ఉంటుందా? అనే సందేహం మనలో చాలా మందికి ఉంటుంది.

Mosquitoes: చిమ్మచీకట్లోనూ దోమలు మనల్ని ఎలా గుర్తిస్తాయి? వాటికి చీకట్లోనూ కళ్లు కనిపిస్తాయా..
Mosquito 5
Srilakshmi C
|

Updated on: Apr 08, 2026 | 8:03 PM

Share

పరిశోధకుల ప్రకారం.. దీని వెనుక ఎలాంటి మాయాజాలం లేదు. కేవలం శాస్త్రీయ కారణాలే ఉన్నాయి. దోమలు మనల్ని చూడటానికి వాటి కళ్ళను ఉపయోగించవు. బదులుగా శరీరం నుండి వెలువడే నిర్దిష్ట సంకేతాలను ఉపయోగించుకుంటాయి. ఆ విధంగానే అవి మన వద్దకు చేరుకుంటాయి. దోమలు మనుషుల వైపు ఆకర్షించబడటానికి ప్రధాన కారణం మనం ముక్కు ద్వారా వదిలే కార్బన్ డయాక్సైడ్ (CO2) వాయువు. దోమల యాంటెన్నాలపై చాలా సున్నితమైన సెన్సార్లు ఉంటాయి. ఇవి సుమారు 30 నుండి 50 అడుగుల దూరం నుంచి కార్బన్ డయాక్సైడ్ వాసనను పసిగట్టగలవు. మనం చీకటిలో శ్వాస తీసుకున్నప్పుడు ఆ వాయువు దోమలకు జీపీఎస్ లాగా పనిచేసి, అవి నేరుగా మన వైపుకే ఎగిరి వస్తాయి. శ్వాస మాత్రమే కాదు మానవ శరీరంలోని సహజ వేడి కూడా దోమలను ఆకర్షిస్తుంది.

దోమలకు సహజమైన ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్లు ఉంటాయి. ఈ సెన్సార్లు చీకటిలో వెచ్చని రక్తం గల జంతువులను లేదా మనుషులను గుర్తించడానికి వాటికి సహాయపడతాయి. నిద్రపోతున్నప్పుడు శరీరం నుండి వెలువడే వేడి తరంగాలు దోమలకు మన ఉనికిని తెలియజేస్తాయి. ప్రతి వ్యక్తి శరీర దుర్వాసన భిన్నంగా ఉంటుంది. మన చర్మం నుంచి వెలువడే చెమట, దానిలోని లాక్టిక్ ఆమ్లం, అమ్మోనియా, యూరిక్ ఆమ్లం వంటి అంశాలతో కలిసి దోమలను ఆకర్షించే అయస్కాంతంలా పనిచేస్తుంది.

శరీరంలో ఎక్కువ లాక్టిక్ ఆమ్లం ఉత్పత్తి అయ్యే వ్యక్తులను ఇతరులు కంటే దోమలు ఎక్కువగా కుట్టే అవకాశం ఉంది. అందుకే ఒకే గదిలో నిద్రించే ఇద్దరిలో, ఒక వ్యక్తిని దోమలు ఎక్కువగా ఇబ్బంది పెడితే, మరొకరిని తక్కువగా ఇబ్బంది పెడతాయి. దోమ కాటు కేవలం చికాకు కలిగించడమే కాకుండా మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా, జికా వైరస్ వంటి ప్రాణాంతక వ్యాధులకు కూడా దారితీస్తాయి. అందువల్ల దోమల నుంచి రక్షణ పొందడం చాలా అవసరం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
పార్టీలు, క్రికెట్ మ్యాచ్‌ల జోష్‌లో ఆ డ్రింక్స్‌ తాగుతున్నారా?
పార్టీలు, క్రికెట్ మ్యాచ్‌ల జోష్‌లో ఆ డ్రింక్స్‌ తాగుతున్నారా?
జబర్దస్త్ దీవెన ఇప్పుడెలా మారిపోయిందో చూశారా? ఏం చేస్తుందంటే?
జబర్దస్త్ దీవెన ఇప్పుడెలా మారిపోయిందో చూశారా? ఏం చేస్తుందంటే?
నీ సేవలకి చాలు.. సారథికి షాకిచ్చేందుకు సిద్ధమైన చెన్నై..?
నీ సేవలకి చాలు.. సారథికి షాకిచ్చేందుకు సిద్ధమైన చెన్నై..?
బరువు తగ్గాలన్నా,గ్లాసీ స్కిన్ కావాలన్నా, రోజుకో దానిమ్మ తింటే
బరువు తగ్గాలన్నా,గ్లాసీ స్కిన్ కావాలన్నా, రోజుకో దానిమ్మ తింటే
ఇదెక్కడి వింత.. కోపంతో రూ.4.80 కోట్ల విరాళం!
ఇదెక్కడి వింత.. కోపంతో రూ.4.80 కోట్ల విరాళం!
ఆకలిని కంట్రోల్ చేసుకోకండి.. ఈ స్మార్ట్ చిట్కాలతో వెయిట్ లాస్
ఆకలిని కంట్రోల్ చేసుకోకండి.. ఈ స్మార్ట్ చిట్కాలతో వెయిట్ లాస్
నెట్టింట డీఫ్ ఫేక్ వీడియోల కలకలం.. స్టార్ హీరోయిన్ సంచలన నిర్ణయం
నెట్టింట డీఫ్ ఫేక్ వీడియోల కలకలం.. స్టార్ హీరోయిన్ సంచలన నిర్ణయం
కావ్య మారన్, అనిరుధ్ పెళ్లి.. వీరిద్దరి ఆస్తుల విలువ తెలుసా?
కావ్య మారన్, అనిరుధ్ పెళ్లి.. వీరిద్దరి ఆస్తుల విలువ తెలుసా?
వాషింగ్ మెషీన్‌ సామర్థ్యం కేజీలలో ఎలా లెక్కిస్తారు?
వాషింగ్ మెషీన్‌ సామర్థ్యం కేజీలలో ఎలా లెక్కిస్తారు?
‘సేవ్ ది టైగర్స్ సీజన్ 3' వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
‘సేవ్ ది టైగర్స్ సీజన్ 3' వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?