ఉదయాన్నే ఖాళీ కడుపుతో  ఈ 3 తీసుకుంటే చాలు.. షుగర్, BP జీవితంలో రాదు

samatha

23 may 2026

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అందుకే ఆరోగ్యం విషయంలో తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.

ఆరోగ్యం

కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది చిన్న వయసులోనే బీపీ, షుగర్ వంటి సమస్యల బారిన పడి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

బీపీ, షుగర్

అయితే జీవితంలో షుగర్, బీపీ, రాకుండా ఉండాలి అంటే తప్పకుండా ప్రతి రోజూ  ఉదయం క్రమం తప్పకుండా ఈ మూడు తీసుకోవాలంట. అవి ఏవో ఇప్పుడు చూసేద్దాం.

బీపీ, షుగర్ రాకూడదంటే?

మెంతులు ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే రాత్రి నానబెట్టిన మెంతుల నీటిని ఉదయాన్నే తీసుకోవడం వలన బీపీ కంట్రోల్ అవుతుంది.

మెంతి నీరు

అలాగే ప్రతి రోజూ ఒక ఉసిరికాయ జ్యూస్ లేదా పచ్చి ఉసిరికాయ తినడం చాలా మంచిది. ఇది శరీరంలో విటమిన్ సిని పెంచి బీపీ, షుగర్ రాకుండా చూస్తుంది. కొలెస్ట్రాల్ బ్యాలెన్స్ చేస్తుంది.

ఉసిరి జ్యూస్

అంతే కాకుండా ఉసిరి చర్మ ఆరోగ్యానికి, జుట్టు పెరుగుదలకు, రోగనిరోధక శక్తి పెంచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

ఉసిరి

అలాగే దాల్చిన చెక్క నీరు ఉదయాన్నే పొడి చేసుకొని గోరు వెచ్చటి నీటిలో చిటికెడు వేసుకొని తాగడం చాలా మంచిది. ఇది బీపీ, షుగర్ లాంటి వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. అలాగే ఇన్సులిన్ సెన్సివిటీని కూడా పెంచడానికి ఉపయోగపడుతుంది.

దాల్చిన చెక్క నీరు

 ఈ మూడింటిని  ప్రతి రోజూ మూడు తీసుకోకుండా, రోజుకు ఒకటి చొప్పున తీసుకోవడం మంచిది.అలాగే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారు, గర్భిణీలు, ఇప్పటికే మందులు వాడే వారు తప్పకుండా వైద్యుడిని సంప్రదించిన తర్వాత వీటిని మీ డైట్‌లో చేర్చుకోవడం ఉత్తమం.

ముఖ్య గమనిక