రోజూ ఒక అరటిపండు తింటే చాలు.. ఆ ఆరోగ్య సమస్యలన్నీ మాయం
Krishna
22 may 2026
అరటిపండ్లలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ వంటి సహజ చక్కెరలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అందుకే క్రీడాకారులు, అధిక శారీరక శ్రమ చేసేవారు వీటిని ఎక్కువగా తింటారు.
తక్షణ శక్తి
ఇందులో ఉండే పీచుపదార్థం జీర్ణవ్యవస్థను చురుగ్గా ఉంచుతుంది. ముఖ్యంగా మలబద్ధకం సమస్యతో బాధపడేవారికి ఇది ఒక మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఉదయాన్నే తింటే రోజంతా యాక్టివ్‌గా ఉంటుంది.
జీర్ణక్రియ
బాగా పండిన అరటిపండును తేనె, పాలతో కలిపి తీసుకోవడం వల్ల అల్సర్లు లేదా కడుపులో పుండ్ల సమస్య తగ్గుముఖం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. కడుపు సమస్యలు ఉన్నవారు దీనిని మితంగా తీసుకోవడం మంచిది.
కడుపులో పుండ్లు
అరటిపండులో ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. తద్వారా అధిక రక్తపోటు సమస్య తగ్గి, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అందుకే ప్రతిరోజూ ఒక అరటిపండు తినాలి.
గుండె ఆరోగ్యం
ఇందులో ఉండే ఐరన్ శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి ఎంతగానో తోడ్పడుతుంది. దీనివల్ల రక్తహీనత సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది.
రక్తహీనతకు చెక్
గర్భధారణ సమయంలో వచ్చే శరీర బలహీనతను తగ్గించి, అవసరమైన శక్తిని ఇవ్వడంలో అరటిపండు సహాయపడుతుంది. అంతేకాకుండా గర్భిణీలలో సాధారణంగా కనిపించే వికారం వంటి సమస్యలను ఇది తగ్గిస్తుంది.
గర్భిణీ స్త్రీలు
అరటిపండులో ఉండే విటమిన్లు, ఖనిజాలు కంటి చూపును మెరుగుపరచడంతో పాటు చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా ఉంచుతాయి. అందుకే చాలామంది దీనిని ఫేస్ ప్యాక్‌గా కూడా వాడుతుంటారు.
చర్మం, కంటి ఆరోగ్యం
పచ్చి అరటిపండ్లలో రెసిస్టెంట్ స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీర బరువును తగ్గించడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. షుగర్ ఉన్నవారు వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి.