AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్షం వద్దు.. కిడ్నీలు ప్రమాదంలో పడే అవకాశం

మన పిడికిలి పరిమాణంలో ఉండే మూత్రపిండాలు విరామం లేకుండా పనిచేస్తూ రక్తాన్ని శుభ్ర పరుస్తాయి. మారిన జీవన శైలితో కిడ్నీల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. అయితే మూత్రపిండాలు దెబ్బతినే సమయంలో అనేక ప్రారంభ సంకేతాలు మన శరీరంలో కనిపిస్తాయి. అయితే అవి చాలా తక్కువగా ఉంటాయి కనుక పెద్దగా శ్రద్ధ పెట్టరు. దీంతో ముత్రపిండాల వ్యాధి మరింతగా వ్యాపిస్తుంది. వ్యాధి తీవ్రమైతే డయాలసిస్ లేదా మూత్రపిండ మార్పిడి వంటి చికిత్సలు అవసరం కావచ్చు. అందువల్ల మూత్రపిండాలు దెబ్బతినే లక్షణాలను సకాలంలో గుర్తించడం చాలా ముఖ్యం. అవి ఏమిటంటే..

Health Tips: ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్షం వద్దు.. కిడ్నీలు ప్రమాదంలో పడే అవకాశం
Kidney Health Tips
Surya Kala
|

Updated on: Sep 30, 2025 | 12:26 PM

Share

మూత్రపిండాలు మన శరీరంలో వ్యర్థ పదార్థాలను తొలగించడం, శరీర ద్రవ సమతుల్యతను కాపాడడం, రక్తాన్ని ఫిల్టర్ చేయడం వంటి అనేక ముఖ్యమైన విధులను నిర్వహిస్తాయి. అందువల్ల ఆరోగ్యకరమైన మూత్రపిండాలను నిర్వహించడం చాలా ముఖ్యం. అయితే మారిన జీవనశైలి, ఆహారం కారణంగా మనకు తెలియకుండానే మూత్రపిండాలకు హాని కలుగుతుంది. నిజానికి, మూత్రపిండాలలో నెఫ్రాన్లు అనే చిన్న వడపోత యూనిట్లు ఉంటాయి. ఇవి దెబ్బతిన్నప్పుడు.. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయలేవు. దీనిని నెఫ్రోసిస్ అంటారు. ఇది ఒక వ్యాధి కాదు.. మూత్రపిండాల నష్టాన్ని వివరించడానికి ఉపయోగించే పదం. దీనిని సకాలంలో గుర్తించకపోతే.. అప్పుడు తీవ్రమైన సమస్యగా మారవచ్చు. మూత్రపిండాల నష్టాన్ని గుర్తించడంలో సహాయపడే లక్షణాల గురించి తెలుసుకుందాం.

నెఫ్రోసిస్ లక్షణాలు ఏమిటి?

మూత్రంలో అధిక ప్రోటీన్: ఇది నెఫ్రోసిస్ అతి ముఖ్యమైన లక్షణం. మూత్రంలో ప్రోటీన్ పరిమాణం సాధారణ స్థాయిని మించిపోయినప్పుడు.. దానిని ప్రోటీన్యూరియా అంటారు. దీనివల్ల మూత్రం నురుగుగా కనిపిస్తుంది.

రక్తంలో ప్రోటీన్ తగ్గడం: మూత్రంలో ప్రోటీన్ విసర్జించబడుతున్నందున.. రక్తంలో ప్రోటీన్ స్థాయి తగ్గుతుంది. ముఖ్యంగా రక్తంలో అల్బుమిన్ స్థాయిలు తగ్గడానికి దారితీస్తుంది.

ఇవి కూడా చదవండి

శరీర వాపు – రక్తంలో ప్రోటీన్ లేకపోవడం వల్ల.. కణాల మధ్య ఖాళీలలోకి ద్రవం లీక్ అవుతుంది. దీని వలన శరీరంలో కొన్ని అవయవాల్లో వాపు వస్తుంది. ఈ వాపు సాధారణంగా కాళ్ళు, చీలమండలు, అరికాళ్ళలో ప్రారంభమవుతుంది. తరువాత ముఖంపై, ముఖ్యంగా కళ్ళు, చేతులు, ఉదరం చుట్టూ కనిపించవచ్చు.

రక్తంలో కొవ్వు పెరగడం: మూత్రపిండాలు దెబ్బతినడం వల్ల కాలేయంలో కొలెస్ట్రాల్, ఇతర కొవ్వు ఉత్పత్తుల ఉత్పత్తి పెరుగుతుంది. దీని వలన రక్తంలో కొలెస్ట్రాల్ , ట్రైగ్లిజరైడ్లు అధిక స్థాయిలో ఉంటాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.

బరువు పెరగడం: శరీరంలో అదనపు ద్రవం, నీరు చేరడం వల్ల ఒక వ్యక్తి బరువు అకస్మాత్తుగా పెరగవచ్చు.

అలసట, బలహీనత: శరీరంలో ప్రోటీన్ , శక్తి లేకపోవడం వల్ల ఒక వ్యక్తి నిరంతరం అలసిపోయినట్లు, నీరసంగా, బలహీనంగా ఉంటాడు.

ఆకలి లేకపోవడం: ఆకలి లేకపోవడం లేదా త్వరగా కడుపు నిండినట్లు అనిపించడం కూడా ఒక సాధారణ లక్షణం.

ఇతర లక్షణాలు.. మూత్ర విసర్జన తగ్గడం, అధిక రక్తపోటు , ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరగడం , కొన్ని సందర్భాల్లో మూత్రంలో రక్తం పోవడం వంటివి ఉంటాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)