AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indonesia: ఇండోనేషియాలో పెను ప్రమాదం.. కూలిన ఇస్లామిక్ పాఠశాల.. శిథిలాల కింద పిల్లల

ఇండోనేషియాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తూర్పు జావా ప్రావిన్స్‌లో ఇస్లామిక్ పాఠశాల భవనం కుప్ప కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా.. 80 మంది గాయపడ్డారు. రెస్క్యూ సిబ్బంది 102 మందిని రక్షించగా, మరో 65 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు పాఠశాలలో మరమ్మతు పనులు జరుగుతున్నాయి. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Indonesia: ఇండోనేషియాలో పెను ప్రమాదం.. కూలిన ఇస్లామిక్ పాఠశాల.. శిథిలాల కింద పిల్లల
Indonesia School Building Collapse
Surya Kala
|

Updated on: Sep 30, 2025 | 11:49 AM

Share

ఇండోనేషియాలో ఒక పాఠశాల భవనం అకస్మాత్తుగా కూలిపోయి ఒక విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. శిథిలాలలో ముప్పై ఎనిమిది మంది చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. రెస్క్యూ బృందాలు 102 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ దుర్ఘటన ఆ ప్రాంతంలో భయాందోళనలకు గురిచేసింది. తూర్పు జావా ప్రావిన్స్‌లోని అల్ ఖోజిని ఇస్లామిక్ స్కూల్‌లో మధ్యాహ్నం ప్రార్థనల కోసం భారీ సంఖ్యలో స్టూడెంట్స్, ప్రజలు చేరుకున్న సమయంలో పాఠశాల భవనం అకస్మాత్తుగా కూలిపోయింది. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి 102 మందిని రక్షించాయి. ఇంకా 65 మంది శిధిలాల కింద చిక్కుకుని ఉన్నారని భావిస్తున్నారు.

ప్రమాదం ఎలా జరిగింది?

పాఠశాల భవనం పునరుద్ధరణ పనులు జరుగుతుండగా ప్రమాదం జరిగినట్లు రెస్క్యూ ఏజెన్సీ తెలిపింది. భవనంలోని ఒక భాగం అకస్మాత్తుగా కూలిపోవడంతో భారీ సంఖ్యలో విద్యార్థులు, కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు.

ఇవి కూడా చదవండి

80 మందికి గాయలు.. ఆసుపత్రిలో చికిత్స

ఈ ఘటనలో ఒకరు మరణించగా, 80 మంది గాయపడ్డారు. గాయపడిన వారందరినీ ఆసుపత్రికి తరలించారు. 65 మంది శిథిలాలలో చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. వారిని రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

కూలిపోయిన ఎనిమిది గంటల తర్వాత రాత్రంతా తవ్వకాలు జరిపిన సహాయక సిబ్బంది, పోలీసులు, సైనికులు బలహీనమైన, గాయపడిన ఎనిమిది మంది విద్యార్థులను బయటకు తీశారు. మరిన్ని మృతదేహాలు కనిపించడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

విద్యార్థుల కుటుంబాలు ఆసుపత్రుల వద్ద, కూలిపోయిన భవనం సమీపంలో గుమిగూడి.. తమ పిల్లల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి. శిధిలాల కింద ఉన్న గాయపడిన విద్యార్థిని బయటకు తీస్తున్న దృశ్యాలను చూస్తూ బంధువులు విలపిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..