Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాడుబడ్డ బావి నిండా పాములు.. 54 గంటల పాటు మహిళ ఒంటరి పోరాటం.. చివరకు..

సినిమాల్లో హీరో, హీరోయిన్లు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా మరణాన్ని జయించి ఈజీగా బయటపడుతుంటారు. కానీ, నిజంగా జరిగిన ఒక షాకింగ్‌ ఘటన సినిమా కథను మించిపోయింది. ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటనలో ఒక మహిళ 54 గంటల పాటు లోతైన, నిర్మానుష్యమైన బావిలో చిక్కుకుంది. కటిక చీకటి, దోమల దాడులు నీటిలో ఈత కొట్టే పాములు వంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఆమె ధైర్యంగా ఉంది. మరణం ఆమెకు చాలా దగ్గరగా కనిపించింది,

పాడుబడ్డ బావి నిండా పాములు.. 54 గంటల పాటు మహిళ ఒంటరి పోరాటం.. చివరకు..
Quanzhou Snake Attack Survi
Jyothi Gadda
|

Updated on: Sep 30, 2025 | 2:00 PM

Share

సినిమాల్లో హీరో, హీరోయిన్లు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా మరణాన్ని జయించి ఈజీగా బయటపడుతుంటారు. కానీ, నిజంగా జరిగిన ఒక షాకింగ్‌ ఘటన సినిమా కథను మించిపోయిన నిజమైన కథ. చైనాలో జరిగిన ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటనలో ఒక మహిళ 54 గంటల పాటు లోతైన, నిర్మానుష్యమైన బావిలో చిక్కుకుంది. కటిక చీకటి, దోమల దాడులు నీటిలో ఈత కొట్టే పాములు వంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఆమె ధైర్యంగా ఉంది. మరణం ఆమెకు చాలా దగ్గరగా కనిపించింది, కానీ ఆమె ధైర్యంగా ఉండి చివరరకు అద్భుతంగా తప్పించుకుని బయటపడింది. సదరు మహిళకు ఏం జరిగిందో వివరంగా తెలుసుకుందాం.

చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్‌లోని క్వాన్‌జౌ నగరానికి చెందిన క్విన్ అనే 48 ఏళ్ల మహిళ ఒక రోజు అడవి గుండా వాకింగ్‌ కోసం వెళ్లింది. అలా నడుస్తుండగా అకస్మాత్తుగా కలుపు మొక్కలతో కప్పబడిన పాత పాడుబడిన బావిలో పడిపోయింది. బావి చాలా లోతుగా ఉంది. బయటి నుండి ఏమీ కనిపించటం లేదు.. సాయంత్రం వరకు ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో, ఆమె కుటుంబం ఆందోళన చెందింది. వారు చుట్టూ వెతికారు. కానీ ఆమె కనిపించలేదు. మరుసటి రోజు వారు పోలీసులకు సమాచారం అందించారు.

ఆ మహిళ కుమారుడు రెస్క్యూ టీం సహాయం కోరాడు. దాదాపు 10 మంది సభ్యుల బృందం వచ్చి థర్మల్ ఇమేజింగ్ డ్రోన్‌తో ఆ ప్రాంతాన్ని వెతకడం ప్రారంభించింది. మధ్యాహ్నం, బావి చుట్టూ ఉన్న పొదల నుండి ఒక స్వరం వినిపించిందని టీం కెప్టెన్ డు జియావోహాంగ్ చెప్పారు. వారు పొదలను తొలగించినప్పుడు ఆ మహిళ నీటిలో మునిగిపోయి, ప్రాణాల కోసం చేతికి అందిన గోడను ఆధారంగా గట్టిగా పట్టుకుని ఉండటం వారు చూశారు. బావి లోపల దృశ్యం భయంకరంగా ఉందని ఆ మహిళ తరువాత చెప్పింది. అంతా చీకటిగా ఉంది. దోమల గుంపులు ఆమెను నిరంతరం కుడుతున్నాయి. కొన్ని పాములు కూడా నీటిలో ఈదుతున్నాయి. ఒకానొక సమయంలో ఒక నీటి పాము ఆమె చేతిని కరిచింది. అదృష్టవశాత్తూ అది విషపూరితమైనది కాదు, లేకుంటే ఆమె పరిస్థితి మరింత దిగజారి ఉండేదని చెప్పింది.

ఇవి కూడా చదవండి

ఆమె ఎలా బయటపడింది?

తాను దాదాపుగా చనిపోయానని అనుకుందట. ఇక ప్రాణాలతో బయటపడలేనని భావించింది. కానీ, ఆమె ఆశలు వదులుకోలేదని చెప్పింది. కిందకు పడిపోతానని భయపడిన ప్రతిసారి ఆమె తన కుటుంబాన్ని గుర్తుచేసుకున్నానని చెప్పింది. ఆమె 70 ఏళ్ల తల్లి, 80 ఏళ్ల తండ్రి, కాలేజీకి వెళ్లే కూతురు. వారి గురించి ఆలోచిస్తూ ఆమె ధైర్యం కూడగట్టుకుని బతకాలని నిశ్చయించుకుంది. ఆమెకు ఈత కూడా రావటంతో నీటి నుండి తనను తాను కాపాడుకోవడానికి బావి గోడలో ఇరుక్కున్న రాయిని పట్టుకుంది. ఆమె మరో మూడు రాళ్లను తవ్వి, వాటిని మెట్లుగా ఉపయోగించి, నీటి నుండి బయటపడటానికి ప్రయత్నించింది. ఈ విధంగా, ఆమె 54 గంటలు బావిలోనే ఉండిపోయింది.

ఎట్టకేలకు రెస్క్యూ బృందాలు ఆమెను గుర్తించి పొదలను తొలగించి బావిలోంచి ఆమెను బయటకు తీశారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమెకు రెండు పక్కటెముకలు విరిగినట్టుగా గుర్తించారు. ఊపిరితిత్తులు కూడా కాస్త దెబ్బతిన్నాయని చెప్పారు. గంటల తరబడి గోడను పట్టుకోవడం వల్ల ఆమె చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం, ఆమె పరిస్థితి స్థిరంగా ఉందని డాక్టర్స్‌ చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…