- Telugu News Photo Gallery People who have these conditions, Must Avoid Drinking Coffee Daily according to experts
Health Tips: ఈ వ్యాధులకు మందులు వాడేవారు.. కాఫీ జోలికి అస్సలు వెళ్లవద్దట.. ఎందుకంటే?
చాలా మందికి ఉదయం నిద్రలేచిన వెంటనే కాఫీ తాగే అలవాటు ఉంటుంది. మరికొందరికి బ్రేక్‌పాస్ట్ చేసిన తర్వాత లేదా భోజనానికి ముందు, సాయంత్రం లేదా రాత్రి ఇలా ఏదో ఒక టైంలో కాఫీని తాగుతారు. కాఫీ వల్ల ఎలాంటి సమస్యలు రావని.. ఇది ఆరోగ్యానికి మంచిదని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది అందరికి ప్రయోజనకరంగా ఉండదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు అసలు కాఫీ జోలికే వెళ్లొదని చెబుతున్నారు. ఎందుకో తెలుసుకుందాం పదండి.
Updated on: Sep 30, 2025 | 12:22 PM

జలుబు ఫ్లూ మందులు: నిపుణుల అభిప్రాయం ప్రకారం, జలుబు, ఫ్లూ వంటి వ్యాధులకు మందుల వాడే వారు కాఫీ దూరంగా ఉండాలని చెబుతున్నారు. ఎందుకంటే ఈ మందుల్లో సూడోఎఫెడ్రిన్ ఉంటుంది, ఇది ఉద్దీపనగా కూడా పనిచేస్తుంది. కాబట్టి మీరు కాఫీ, సూడోఎఫెడ్రిన్ ఉన్న మందులను కలిపి తీసుకున్నప్పుడు దాని ప్రభావాలు పెరగవచ్చు. దీని కారణంగా మీకు విశ్రాంతి లేకపోవడం, తలనొప్పి, హార్ట్‌బీట్ పెరగడం వంటి సమస్యలు రావచ్చు

ఆస్తమా: కొన్ని అధ్యయనాల ప్రకారం, సూడోఎఫెడ్రిన్‌తో పాటు కెఫిన్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర, శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అలాగే, మీకు ఆస్తమా ఉంటే, మీరు కాఫీతో థియోఫిలిన్ వంటి మందులను ఎప్పుడూ తీసుకోకూడదు.

గుండె సంబంధిత మందులు: గుండె సంబంధత వ్యాధులకు మందులు వాడేవారు కూడా కాఫీ తాగడం మానుకోవాలని ఆరోగ్య నిపణులు చెబుతున్నారు. సాధారణంగానే కెఫిన్ మన రక్తపోటు, హృదయ స్పందన రేటును పెంచుతుంది. కాబట్టి రక్తపోటు మందులు తీసుకునే వారు కాఫీ తాగడం వల్ల అది మీ మందులు అందించే ప్రభావాలకు ఆటంకం కలిగిస్తుంది. అంటే వాటిపై కాఫీ ప్రభావం పడి వాటి ప్రభావం తగ్గుతుంది

థైరాయిడ్ మందులు: థైరాయిడ్ మందులు వాడే వారు కూడా కాఫీకి దూరంగా ఉండడం మంచింది. ఎందుకంటే లెవోథైరాక్సిన్ తీసుకునే ముందు కాఫీ తాగడం వల్ల దాని శోషణ 50% కంటే ఎక్కువ తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మందుకు వేసుకునే ముందు లేదా తర్వాత మీరు కాఫీ తాగడం వల్ల అది మీ శరీరం గ్రహించే మందుల పరిమాణాన్ని తగ్గిస్తుంది. దీని వల్ల మీరు మందులు వేసుకొని కూడా ప్రయోజనం ఉండదు.

యాంటిడిప్రెసెంట్స్: యాంటిడిప్రెసెంట్స్ తీసుకునే వారికి కాఫీ తాగడం ప్రమాదకరం. ఎందుకంటే కెఫిన్ ఆందోళన, నిద్రలేమి వంటి దుష్ప్రభావాలను పెంచుతుంది. ఇలాంటి సమయంలో మానసిక ఆరోగ్య సమస్యల కోసం మీరు ఉపయోగించే సెలెక్టివ్ సెరోటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్లను తీసుకుంటే దాని వాటి ప్రభావం మరింత పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి మందులు వాడే ముందు మీరు కచ్చితంగా వైద్యులను సంప్రదించండి.




