AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పండ్ల రారాజు మామిడి.. ఖాళీ కడుపుతో తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే…

మామిడిలో విటమిన్లు ఎ, ఇ, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మానికి మేలు చేస్తాయి. కానీ మామిడికాయ స్వభావం వేడిగా ఉంటుంది. కాబట్టి తినడానికి ముందు నీటిలో నానబెట్టాలి. తద్వారా చర్మ సంబంధిత సమస్యలు ఉండవు. మామిడిలో కేలరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి. ఇది బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. దీని తొక్కలో ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఇవి కొవ్వును కరిగించేవిగా పనిచేస్తాయి.

పండ్ల రారాజు మామిడి.. ఖాళీ కడుపుతో తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే...
మరోపద్ధతి ఒక గిన్నెలో నీళ్లు నింపి, కొంచెం బేకింగ్ సోడా వేసి అందులో మామిడికాయను ఒక నిమిషంపాటు ఉంచాలి. తరువాత మామిడికాయలను శుభ్రంగా కడగాలి. అవి రంగు మారితే మామిడిని రసాయనాలతో పండించారని అర్థం.
Jyothi Gadda
|

Updated on: Mar 04, 2025 | 11:02 AM

Share

వేసవి కాలం అంటే మామిడి పండ్ల సీజన్. మామిడి పండ్ల గురించి చెప్పాలంటే.. ముందుగా పచ్చి మామిడి కాయను గుర్తు చేసుకోవాలి.. పచ్చి మామిడి కాయ ముక్కలను ఎర్ర కారం, నల్ల ఉప్పుతో కలిపి తింటే కలిగే మజానే వేరు. ఇప్పటికీ నోటిలో నీళ్ళు ఊరేలా చేస్తుంది. అయితే, పచ్చి మామిడి, పండ్లు కూడా తినడానికి రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. అందుకే పండ్లలో రా రాజు ‘మామిడి’ అని పిలుస్తారు. ఇది చాలా మందికి ఇష్టమైన పండు. మామిడి పండు రుచికరంగా ఉండటమే కాకుండా పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. మామిడి పండ్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఇక్కడ మనం తెలుసుకుందాం.

మామిడిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. పచ్చి మామిడి తినడం వల్ల మంట, అజీర్ణం, విరేచనాలు వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మామిడిలో పొటాషియం ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. శరీరంలోని ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేస్తుంది. మామిడిలో విటమిన్ సి ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.

మామిడి పండ్లలో క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడే ఇతర ఫైటోకెమికల్స్ ఉంటాయి. మామిడిలో బీటా కెరోటిన్ ఉంటుంది, ఇది శరీరంలో విటమిన్ ఎగా మారుతుంది. కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మామిడిలో విటమిన్లు ఎ, ఇ, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మానికి మేలు చేస్తాయి. కానీ మామిడికాయ స్వభావం వేడిగా ఉంటుంది. కాబట్టి తినడానికి ముందు నీటిలో నానబెట్టాలి. తద్వారా చర్మ సంబంధిత సమస్యలు ఉండవు. మామిడిలో కేలరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి. ఇది బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. దీని తొక్కలో ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఇవి కొవ్వును కరిగించేవిగా పనిచేస్తాయి.

ఇవి కూడా చదవండి

మామిడి పండ్లు తినడానికి సరైన సమయం మధ్యాహ్నం అంటున్నారు నిపుణులు. మామిడికాయకు వేడి స్వభావం ఉంటుంది. రాత్రిపూట మామిడి తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీనివల్ల కడుపులో వేడి, ముఖంపై మొటిమల ప్రమాదం పెరుగుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!