AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Water Bottle Cap: వాటర్‌ బాటిల్స్‌ మూతలు రకరకాల రంగుల్లో ఎందుకు ఉంటాయో తెలుసా? వీటి అర్ధం ఏంటంటే

వేసవి కాలం వచ్చేసింది. బానుడి ప్రతాపం అప్పుడే ప్రారంభమైంది. బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా వాటర్ బాటిల్ ఒకటి బ్యాగ్ లో వేసుకుని వెళ్తుంటారు చాలా మంది. అయితే మీరు వాటర్ బాటిల్స్ మూతలు ఎప్పుడైనా గమనించారా? రంగురంగుల్లో కనిపిస్తుంటాయి.. వీటి అర్ధాలు మీకు తెలుసా? ఇలా ఉండటం వెనుకున్న కారణాలు తెలుసుకోవాలంటే ఈ కింది విషయాలు మీరు చదవాల్సిందే..

Water Bottle Cap: వాటర్‌ బాటిల్స్‌ మూతలు రకరకాల రంగుల్లో ఎందుకు ఉంటాయో తెలుసా? వీటి అర్ధం ఏంటంటే
Water Bottle Cap
Srilakshmi C
|

Updated on: Mar 04, 2025 | 2:20 PM

Share

ఏదో ఒక పని నిమిత్తం తరచూ ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు లేదా వాకింగ్‌కు వెళ్లినప్పుడు వాటర్ బాటిల్ మనతో తీసుకెళ్తాం. నీరు లేకుండా గంటల పాటు పరుగెత్తడం కష్టంగా ఉంటుంది. పైగా ఎక్కువ నీరు తాగడం మంచిదని నిపుణులు కూడా సలహా ఇస్తుంటారు. చాలా మంది బయట వాటర్ బాటిల్స్ కొంటుంటారు. కానీ ఒక్కో వాటర్ బాటిల్ మూతలు వేర్వేరు రంగుల్లో ఉంటాయి. ఇలా ఎందుకు అని మీకెప్పుడైనా అనుమానం వచ్చిందా? వాస్తవానికి, ఈ రంగులు బాటిల్‌లో ఎలాంటి నీరు నింపబడిందో సూచిస్తాయి. ఈ రంగుల ద్వారా మీరు నీటి రకాన్ని ఎలా గుర్తించవచ్చో ఇక్కడ తెలుసుకుందాం..

నీలిరంగు మూత

రైలులోనో, బస్సులోనో ప్రయాణిస్తున్నప్పుడు తరచూ వాటర్ బాటిల్ కొంటుంటాం. ఈ బాటిళ్లలో చాలా వరకు బ్లూ కలర్ క్యాప్స్ ఉంటాయి. దీని వెనుక ప్రత్యేక కారణం ఏంటో తెలుసా?. బాటిల్‌కి బ్లూ క్యాప్ ఉంటే అది మినరల్ వాటర్ అని అర్థం. జర్నల్ ఆఫ్ ఫుడ్ కెమిస్ట్రీలో ప్రచురించబడిన 2023 అధ్యయనంలో నీలిరంగు క్యాప్‌ ఉన్న నీటిలో సాధారణ నీటి కంటే 10% ఎక్కువ కాల్షియం ఉంటుందని కనుగొన్నారు. ఇందులో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నట్లు గుర్తించారు. జియాంగ్జీ యూనివర్శిటీ ఆఫ్ ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ ప్రొఫెసర్ డా. జియాంగ్ యున్ ఈ పరిశోధనలో పాల్గొన్నారు.

తెలుపు రంగు మూత

ఈ విథమైన వాటర్ బాటిల్ క్యాప్స్ రంగులు వాటి స్వంత ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. తెల్లటి రంగు క్యాప్ అంటే ఈ నీరు సాధారణ తాగునీరు అని అర్థం.

ఇవి కూడా చదవండి

ఆకుపచ్చ మూత

ఆకుపచ్చ రంగు రుచిగల నీటిని సూచిస్తుంది. అంతేకాకుండా కొన్ని బ్రాండ్‌లు తమ బ్రాండ్ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని మూత రంగులను ఎంచుకుంటాయి. అయితే ఒక్కో బాటిల్ పై నీటికి సంబంధించిన పూర్తి సమాచారం రాసి ఉంటుంది. అలాగే ఎరుపు మూత.. ఎరుపు మూత కార్బోనేటేడ్ నీటిని సూచిస్తుంది. పసుపు మూత విటమిన్లు, ఎలెక్ట్రోలైట్స్‌తో కూడిన నీటిని సూచిస్తుంది.

నలుపు రంగు మూత

నలుపు రంగు మూత ప్రీమియం లేదా ఆల్కలీన్ వాటర్ బాటిళ్లలో కనిపిస్తుంది. ఈ బ్లాక్ క్యాప్ వాటర్ బాటిళ్లు చాలా అరుదు. ఈ రంగు క్యాప్‌ ఉన్న వాటర్‌ బాటిళ్లు ప్రీమియం నీటి ఉత్పత్తులకు మాత్రమే ఉపయోగించబడతాయి. చాలా మంది సెలబ్రిటీలు ఈ నీటిని తాగుతారు.

పింక్ మూత

పింక్ కలర్ క్యాప్స్ ఉన్న వాటర్ బాటిల్స్ గురించి చెప్పాలంటే… ఇది నీటి గురించి కాదు. చాలా స్వచ్ఛంద సంస్థలు రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహన పెంచడానికి ఈ రంగు క్యాప్‌లను ఉపయోగిస్తుంటాయి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.