AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Olive Oil: ఆలివ్ ఆయిల్‌తో జుట్టును పొడుగ్గా పెంచేయండిలా..

మనం ఎక్కువగా ఉపయోగించే నూనెల్లో ఆలివ్ ఆయిల్ కూడా ఒకటి. ఆలివ్‌ ఆయిల్‌తో ఆరోగ్య సమస్యలే కాకుండా.. అందాన్ని కూడా పెంచుకోవచ్చు. ఈ నూనెలో శరీరానికి ఉపయోగ పడే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. చాలా మంది ఆలివ్ ఆయిల్‌ని సలాడ్స్ తయారు చేయడానికి, వంటల్లో ఉపయోగిస్తారు. ఆలివ్ ఆయిల్‌తో చర్మ సమస్యలు కూడా తగ్గించుకోవచ్చు. కేవలం చర్మ సమస్యలే కాకుండా జుట్టుకు సంబంధించిన సమస్యల్ని..

Olive Oil: ఆలివ్ ఆయిల్‌తో జుట్టును పొడుగ్గా పెంచేయండిలా..
Olive Oil
Chinni Enni
|

Updated on: Aug 08, 2024 | 2:38 PM

Share

మనం ఎక్కువగా ఉపయోగించే నూనెల్లో ఆలివ్ ఆయిల్ కూడా ఒకటి. ఆలివ్‌ ఆయిల్‌తో ఆరోగ్య సమస్యలే కాకుండా.. అందాన్ని కూడా పెంచుకోవచ్చు. ఈ నూనెలో శరీరానికి ఉపయోగ పడే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. చాలా మంది ఆలివ్ ఆయిల్‌ని సలాడ్స్ తయారు చేయడానికి, వంటల్లో ఉపయోగిస్తారు. ఆలివ్ ఆయిల్‌తో చర్మ సమస్యలు కూడా తగ్గించుకోవచ్చు. కేవలం చర్మ సమస్యలే కాకుండా జుట్టుకు సంబంధించిన సమస్యల్ని కూడా తగ్గించుకోవచ్చు. జుట్టు రాలి పోవడం, బలహీనంగా ఉండటం, పొడిగా మారడం, మధ్యలో కట్ అయిపోవడం, జుట్టు చిట్లి పోవడం వంటి సమస్యల్ని ఆలివ్ ఆయిల్‌తో తగ్గించుకోవచ్చు. ఆలీవ్ ఆయిల్ జుట్టుకు ఉపయోగించడం వల్ల బలంగా, దృఢంగా మారతుంది. మరి ఆలివ్ ఆయిల్‌ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా చాలా మంది తలకు కొబ్బరి నూనెను ఎక్కువగా రాస్తారు. కానీ కొబ్బరి నూనెకు బదులుగా ఆలివ్ ఆయిల్ ‌ రాయడం వల్ల జుట్టు మరింత బలంగా ఉంటుంది. ఇందులో జుట్టు విటమిన్ ఈ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ విటమిన్ జుట్టు సమస్యలను తగ్గించడంలో చక్కగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా యంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి.

ఆలివ్ ఆయిల్ – విటమిన్ ఈ క్యాప్సూల్:

ఆలివ్ ఆయిల్‌లో విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సూల్ కూడా కలిపి రాయడం వల్ల మంచి పోషణ అందుతుంది. అంతే కాకుండా జుట్టు పెరగడానికి కూడా చక్కగా సహా పడుతుంది.

ఇవి కూడా చదవండి

ఆలివ్ ఆయిల్ – కోడిగుడ్డు:

కోడి గుడ్డు కూడా జుట్టుకు రాయడం చాలా మంచిది. ఇందులో ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి తలకు పట్టించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. జుట్టు వేగంగా, ఒత్తుగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి.

ఆలివ్ ఆయిల్ – అరటి పండు:

ఆలివ్ ఆయిల్‌లో అరటి పండు కూడా మిక్స్ చేసి జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు బలంగా, స్మూత్‌గా పట్టుకుచ్చులా తయారవుతుంది. జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయి. జుట్టుకు మంచి కండిషనింగ్ అందిస్తుంది.

ఆలివ్ ఆయిల్ – కలబంద:

కలబందను కూడా జుట్టుకు అప్లై చేస్తూ ఉంటారు. ఇందులో అనేక రకాలైన పోషకాలు ఉంటాయి. కలబందను నేరుగా అప్లై చేయడం కంటే.. ఆలివ్ ఆయిల్‌లో కలిపి తలకు పట్టించడం వల్ల మంచి ఉపయోగాలు ఉంటాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..