AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Marigold: బంతి పూలతో పూజలే కాదు.. కాంతివంతమైన చర్మం మీ సొంతం..

బంతి పూల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వీటి గురించి చాలా మందికి తెలుసు. ఇంతకు ముందు ఇంటి ముందే పెద్ద తోటలా బంతి పూలు పూసేవి. కానీ ఇప్పుడు వీటిపై ఎవరూ ఎక్కువగా ఆసక్తి చూపించడం లేదు. కానీ ఇంట్లో పూజలు చేస్తున్నారు అంటే.. ముందుగా గుర్తొచ్చేవి బంతి పూలే. బంతి పూలతో చేసే అలంకరణే వేరు. ఇంట్లో ఫంక్షన్లు, పెళ్లిళ్లు ఉన్నాయంటే బంతి పూలతో చేసే డెకరేషన్..

Marigold: బంతి పూలతో పూజలే కాదు.. కాంతివంతమైన చర్మం మీ సొంతం..
Marigold Flowers
Chinni Enni
|

Updated on: Aug 08, 2024 | 1:44 PM

Share

బంతి పూల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వీటి గురించి చాలా మందికి తెలుసు. ఇంతకు ముందు ఇంటి ముందే పెద్ద తోటలా బంతి పూలు పూసేవి. కానీ ఇప్పుడు వీటిపై ఎవరూ ఎక్కువగా ఆసక్తి చూపించడం లేదు. కానీ ఇంట్లో పూజలు చేస్తున్నారు అంటే.. ముందుగా గుర్తొచ్చేవి బంతి పూలే. బంతి పూలతో చేసే అలంకరణే వేరు. ఇంట్లో ఫంక్షన్లు, పెళ్లిళ్లు ఉన్నాయంటే బంతి పూలతో చేసే డెకరేషన్.. ఇంటికే ప్రత్యేకమైన గుర్తును ఇస్తుంది. అయితే బంతి పూలతో ఇంటి అలంకరణ.. పూజలు మాత్రమే కాదు.. ఆరోగ్యాన్ని కూడా పెంచుకోవచ్చు. ముఖ్యంగా చర్మ సమస్యల్ని దూరం చేసుకోవచ్చని పలు పరిశోధనలు చెబుతున్నాయి. బంతి పూలను చర్మానికి ఉపయోగించడం వల్ల చర్మం ఎంతో కాంతివంతంగా తయారవుతుంది. మరి బంతి పూలతో ఎలాంటి చర్మ సమస్యలు నయం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

మొటిమలను..

సీజన్ ఏదైనా సరే.. చాలా మది మొటిమలకు సంబంధించిన సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వారు ప్రతి రోజూ మూడు నుంచి 4 బంతి పూలను తీసుకుని శుభ్రంగా కడిగి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టుకు కొద్దిగా పెరుగు కలిపి.. ముఖంపై రాయండి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే.. మొటిమలు తగ్గుతాయి.

బంతి పువ్వు టోనర్:

ఫేస్‌ని టోన్ చేయడానికి చాలా మంది బయట మార్కెట్లో‌ లభ్యమయ్యే టోనర్స్ ఉపయోగిస్తూ ఉంటారు. అలా కాకుండా మనం బంతి పూలతో కూడా టోనర్ తయారు చేసుకోవచ్చు. బంతి పూలలో కొద్దిగా నీరు పోసి.. ఓ పావు గంటసేపు మరిగించాలి. ఆ తర్వాత ఈ నీటిని చల్లార్చి.. అందులో అలోవెరా జెల్ కలపాలి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి.. ముఖానికి టోనర్‌లా ఉపయోగించవచ్చు.

ఇవి కూడా చదవండి

బంతి పువ్వు ఆయిల్:

బంతి పూలతో ఆయిల్‌ కూడా తయారు చేస్తారు. ఆ నూనెను ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసి పడుకోండి. ఉదయం గోరు వెచ్చటి నీటితో ముఖం శుభ్రం చేయండి. ఇలా కొద్ది రోజులు చేయడం వల్ల మీ ముఖం మెరుస్తుంది.

మెరిసే ముఖం కోసం..

కొద్దిగా బంతి పూల పేస్ట్, పాల మీగడ, తేనె, శనగ పిండి.. వీటిని కొద్దిగా తీసుకుని అన్నీ మిక్స్ చేయాలి. ఈ పేస్టును ముఖానికి అప్లై చేసి పావు గంట తర్వాత రుద్దుతూ కడిగేయండి. ఇలా చేయడం వల్ల.. మీ చర్మంతో గ్లోని ఖచ్చితంగా చూస్తారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..