- Telugu News Latest Telugu News Coffee for Weight loss: How black coffee will help you lose weight, Know here
Coffee for Weight loss: రోజూ ఇలా తాగారంటే.. కాఫీతోనూ బరువు తగ్గొచ్చు?
నేటి కాలంలో ప్రతి ఒక్కరూ ఉబకాయంతో బాధపడుతున్నారు. అధిక బరువు ఆరోగ్యానికి మంచిది కాదు. బరువు అదుపులో ఉండాలంటే ఆహారం నియంత్రణలో ఉండాలి. అలాగే ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తుండాలి. చాలా మంది బరువు తగ్గేందుకు రకరకాల ట్రిక్స్ ప్రయత్నిస్తుంటారు. వాస్తవానికి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. సమయానికి ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం ద్వారా ఫిట్‌గా..
Updated on: Aug 08, 2024 | 1:28 PM

మూడు వారాల పాటు కాఫీ, టీ తాగని వారి బరువులో కూడా మార్పును గమనిస్తారని, వెయిట్ లాస్ అవుతారని ఆరోగ్య నిపుణులంటున్నారు. వీటిలో ఉండే చక్కెర బరువు పెరిగేలా చేస్తుందని చెబుతున్నారు. కాబట్టి, బరువు తగ్గాలనుకునే వారు కాఫీ, టీలను తక్కువగా తీసుకోవటం మంచిదని సూచిస్తున్నారు.

కాఫీ ఆరోగ్యానికి మంచిదా చెడ్డదా అనే విషయంలో చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే, దీనిని సరైన క్రమంలో తీసుకుంటే బరువు తగ్గడం సాధ్యమవుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్, క్యాన్సర్ వ్యాధులను కూడా నివారించడం సాధ్యమవుతుందట.

బోస్టన్‌లోని 'హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్' అధ్యయనం ప్రకారం.. చక్కెర లేకుండా బ్లాక్ కాఫీ తీసుకుంటే బరువు పెరగరు. కాఫీలో పంచదార, పాలు, మీగడ, పంచదార వంటివి కలిపితే అంతగా ప్రయోజనం ఉండదు. ఇవేమీ లేకుండా బ్లాక్ కాఫీ తాగితే బోండం లాంటి పొట్ట కరిగిపోతుంది.

కాఫీలో కెఫిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది సహజ ఉద్దీపనలా పని చేస్తుంది. జీవక్రియ రేటును పెంచడంలోనూ సహాయపడుతుంది. ఈ సమ్మేళనం శరీరం అధిక మొత్తంలో అడ్రినలిన్ హార్మోన్ ఉత్పత్తికి సహాయం చేస్తుంది. ఈ అడ్రినలిన్ హార్మోన్ ఎక్కువ పని చేసే శక్తిని ఇస్తుంది. ఈ హార్మోన్ శరీరంలో కొవ్వును విచ్ఛిన్నం చేయడానికి కూడా సహాయపడుతుంది. వ్యాయామ సమయంలో ఇది ఇంధనంగా పనిచేస్తుంది. కాఫీ ఇన్సులిన్ హార్మోన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి కాఫీ తాగొచ్చు. కాఫీ తాగడం ద్వారా బరువు పెరగరు. జీవక్రియ రేటును పెంచడంలోనూ కాఫీ కూడా ప్రత్యేక పాత్ర పోషిస్తుంది.

బరువు తగ్గడానికి రోజుకు 3-4 కప్పుల కాఫీ తాగవచ్చు. అయితే దీనికి తీపి కలపకూడదు. పాలు, క్రీమ్ వంటివి కూడా జోడించవద్దు. ఈ నియమాన్ని పాటిస్తే కాఫీ తాగడం ద్వారా బరువు సులువుగా తగ్గవచ్చు.




