Vankaya Pickle Recipe: వంకాయలతో టేస్టీ రెసిపీ.. ఊరగాయ చేసే ఈజీ రెసిపీ..
vankaya pickle: రోజూ దొరికే కూరలు అనేక రకాలు.. వేటికవే ప్రాముఖ్యతను కలిగినవి.. అయితే తాజా కూరగాయల్లో రాజా ఎవరంటే వంకాయని అంటారు ఎవరైనా.. ఇక తెలుగు రాష్ట్రాల్లో..
vankaya pickle: రోజూ దొరికే కూరలు అనేక రకాలు.. వేటికవే ప్రాముఖ్యతను కలిగినవి.. అయితే తాజా కూరగాయల్లో రాజా ఎవరంటే వంకాయని అంటారు ఎవరైనా.. ఇక తెలుగు రాష్ట్రాల్లో వంకాయ ప్రముఖ కూరగాయ. ఈ వంకాయల్లో చాలా రకాలున్నాయి. అలాగే వంకాయతో రకరకాల కూరలు కూడా చేస్తారు.. ఈరోజు డిఫరెంట్ గా ఈజీగా టేస్టీగా వంకాయలతో ఊరగాయ తయారీ రెసిపీ మీకోసం
కావలసిన పదార్ధాలు:
కొంచెం ముదిరిన వంకాయలు- 1/2 కేజీ పసుపు – ఒక టీ స్పూన్ చింతపండు- 50 గ్రాములు ఉప్పు – రుచికి సరిపడా కారం – పచ్చడికి టెస్ట్ ను బట్టి మెంతిపిండి – 2 టేబుల్ స్పూనులు. నూనె పోపుకు కావాల్సినవి ఇంగువ వెల్లుల్లి
తయారీ విధానం :
ముందుగా వంకాయలను శుభ్రంగా తుడుచుకోవాలి.. పురుగులు లేకుండా చూసుకుని వంకాయలు పొడుడుగుగా నాలుగు ముక్కలుగా తరుగుకోవాలి. తర్వాత వంకాయల ముక్కల్లో తగినంత ఉప్పూ,పసుపూ వేసి బాగా కలుపుకోవాలి. అనంతరం ఆ ముక్కలను జాడీలో గానీ ,గాజుపాత్రలోగానీ పెట్టుకుని.. అందుకోలేని తగినంత చింతపండు వేయాలి. మూడు రోజులు ఆ ముక్కలని అలా నిల్వ ఉంచి తర్వాత అందుకొని చింతపండుని తీస్కుని మెత్తగా రుబ్బుకోవాలి. వంకాయ ముక్కలలో కారం, వేయించిన మెంతులపిండీ. రుబ్బుకున్న చింతపండు కలిపాలి. తర్వాత స్టౌ మీద కడాయి పెట్టి.. నూనె వేసి.. అందులో శనగపప్పు ,మినప్పప్పు ,ఆవాలు ,ఎండుమిర్చి ,ఇంగువ వేసుకుని పోపు పెట్టుకోవాలి. ఇష్టమైన వారు పచ్చడిలో పచ్చి వెల్లుల్లి వేసుకోవచ్చు. ఊరగాయ తయారయిన తర్వాత…మూడురోజుల తర్వాత బాగుంటుంది. వంకాయ ముక్క ఊరి, పచ్చివాసన పోయి రుచిగా వుంటుంది.
Also Read: Sonu Sood: ముంబైకి వచ్చే ముందు ఫిల్మ్ ఫేర్ పుస్తకం కొన్నా.. 20 ఏళ్ల తర్వాత కల నెరవేరింది అంటున్న సోనూ సూద్