Kadaknath Poultry : కడప జిల్లాలో కడక్‌నాథ్ కోళ్ల పెంపకం.. ఉత్పత్తికి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్
Kadak Nath Poultry : కడక్‌నాథ్ చికెన్‌కి మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా విపరీతమైన డిమాండ్ ఉంది. అందుకే ఏపీ ప్రభుత్వం కడక్
Kadaknath Poultry : కడక్నాథ్ చికెన్‌కి మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా విపరీతమైన డిమాండ్ ఉంది. అందుకే ఏపీ ప్రభుత్వం కడక్‌నాథ్ కోళ్ల పెంపకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కడప జిల్లాలోని ఊటుకూరు కోళ్లఫాం పునరుద్దరణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వై.ఎస్ హయాంలో 2007 సంవత్సరం లో శంకుస్థాపన తో ప్రారంభం అయ్యి 2 కోట్ల రూపాయల వ్యయంతో ఊటుకూరు సమీపంలో రాష్ట్ర స్థాయి కోళ్లఫామ్ ఏర్పాటు చేశారు. కానీ నిధులు, కార్మికులు లేక 2018 లో మధ్యలోనే నిలివేశారు. అనంతరం ప్రభుత్వం నుంచి మళ్ళీ గ్రీన్ సిగ్నల్ రావడంతో ఊటుకూరు కోళ్ల పామ్ మళ్ళీ సిద్ధం కానుంది. ఈ సారి అన్ని రకాల కోళ్లతో పాటు, కడక్‌నాథ్ కోళ్ల ఉత్పత్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అసలు కడక్‌నాథ్ కోళ్ల ప్రత్యేకత ఏంటి? తెలుసుకుందాం.
అప్పటి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో కడపలో 2007లో ఊటుకోరు లో కోళ్ల పామ్ ఏర్పాటు చేసేందుకు అప్పట్లోనే శంకుస్థాపన చేశారు..అనంతరం 2013 సంవత్సరం లో 2 కోట్ల రూపాయల తో సిద్ధం అయ్యింది. దీనితో 2103 నుంచి 2108 వరకు నిరంత రాయంగా ఏటా 80 వేల కోడి పిల్లల చొప్పున ఉత్పత్తి చేసి పాడి రైతులకు విక్రయించారు. 2014 అనంతరం ఉత్పాదక వ్యయం రెట్టింపు కావడం , సిబ్బంది కొరత తతెత్తడంతో కోడిపిల్లల ఉత్పాదకత భారంగా మారడంతో మధ్యలోనే నిలిపివేశారు. దీనితో అక్కడి అధికారులు బయటి కోళ్ల పామ్ తో ఒప్పందం ప్రకారం తీసుకొని రైతులకు అందజేసే వారు. అందువల్ల మరింత భారం పడి, నిధులు లేక ఉత్పత్తి ని నిలిపివేయడం తో పూర్తిగా ఉటుకూరు కోళ్ల పామ్ మరుగున పడిపోయింది. మళ్ళీ పశువంశర్ధక శాఖ ప్రతిపాదనలు పంపడం తో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సారి అన్ని రకాల కోళ్ల పెంపకం, ఉత్పత్తి తో పాటు ఉత్తర రాష్ట్రాల కడక్‌నాథ్ కోళ్ల ను కూడా ఉత్పత్తి చేసేందుకు రంగం సిద్ధం చేశారు.
కడక్‌నాథ్ కోళ్ల ప్రత్యేకత.. వ్యవసాయ అనుబంధ రంగాల్లో పెరటికోళ్ళ పెంపకం అత్యంత లాభదాయకంగా తయారవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం నాటుకోడి మాంసానికి అధిక డిమాండ్ ఉంది. ఈ నాటుకోడికి ప్రత్యామ్నాయంగా కడక్‌నాథ్ కోడి కొత్తగా అందుబాటులోకి వచ్చింది. ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో పెంచే ఈ జాతి కోళ్లకు వాతావరణం పరిస్థితులు ఉంటాయని శాస్రవేత్తలు సూచిస్తున్నారు. ఎన్నో పోషక విలువలుండి, వేసవిలో సుమారు వంద గుడ్ల వరకు పెట్టే ఈ జాతి కోడితో ప్రయోజనాల చాలా ఉన్నాయి..
కడక్ నాథ్ ప్రాచుర్యం.. అత్యంత విలువైన పెరటి జాతి నాటు కోడి. అత్యంత పోషక విలువలు, రోగ నిరోధక శక్తి కలిగిన భారతీయ జాతి కోళ్లలో కడక్ నాథ్ ఒకటి. ఈ కోడి అత్యంత ప్రాచుర్యం పొందుతోంది. కడక్‌నాథ్ అనేది మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే దొరికే అనువైన జాతికి చెందిన నాటుకోడి. ఆయా రాష్ట్రాల్లో నివసించే గిరిజనులు ఈ కోడిని ఎక్కువగా పెంచుతారు. అంతరించి పోతున్న నాటు కోడికి ప్రత్యామ్నాయంగా ఈ కోళ్ళను పెంచవచ్చంటున్నారు. దీని మాంసంలో పోషకాలు అధికమని శాస్రవేత్తలు సూచించడంతో పవిత్ర మైన జాతిగా గుర్తించి, దీపావళి పండుగలో దేవునికి నైవేద్యంగా పెడుతున్నారు.
కడక్‌నాథ్ జాతి ప్రత్యేకతలు.. ముదురు నలుపు, ముదురు నీలం రంగుల్లో ఉండే కడక్‌నాథ్ కోళ్లలో వెంట్రుకలు, చర్మం, మాంసంతో పాటు రక్తం కూడా ఉంటుంది. ఈ కోళ్ళను కాలామాళి అని కూడా పిలుస్తారు. అరుదుగా కొన్ని పుంజులు నలుపుతో పాటు బంగారు రంగు ఈకలు కలిగి ఉంటాయి. కోడి పిల్ల నీలం రంగు నుంచి నలుపు వరకు ఉండి, వీపు మీద ముదురు రంగు గీతలు ఉంటాయి. ఈ జాతి మాంసం నల్లగా ఉన్నా దీనికి చాలా ఔషధ విలువలతో పాటు కడక్‌నాథ్ మాంసం కిలో 700 నుంచి 800 వరకు ధర ఉంటుంది.. అంతేకాకుండా కొన్ని శరీర సామర్థ్యాన్ని పెంచుతుందని నమ్ముతారు. ఆదివాసులు దీని రక్తాన్ని చాలా దీర్ఘకాల జబ్బులకు ఉపయోగిస్తారు.అంతేగాక కడక్నాథ్ కోడి మాంసం, గుడ్లకు మంచి డిమాండ్ ఉంది. గిరిజనుల మూలికా వైద్యంలో సైతం ఈ కోళ్ళ రకాన్ని వాడతారు. కడక్‌నాథ్ కోళ్ళకు రోగనిరోధక శక్తి ఎక్కువ. ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకోగలవని పలువురు సూచించారు..
అధిక డిమాండ్ కలిగిన కడక్‌నాథ్ రకపు కోడి పిల్లలను పెంచడానికి ఆమోదం లభించడం తో కోళ్లఫామ్ పునరుద్దరణలో భాగంగా మొదటి విడత కింద నాటు కోళ్లు, ఇతర రకాల కోళ్లు, కడకనాధ్ రకపు కోళ్ల పెంపకానికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నారని హెచరి ఏడి రమణయ్య అన్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న రెండు షెడ్లకు అదనంగా మరో షెడ్ ఏర్పాటుకు, హేచర్ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, వాచ్మెన్ తదితర నియామకాలకు ఆమోదించారని, దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రారంభించామని అన్నారు.. మరో రెండు నెలల వ్యవధిలో ఊటుకూరు కోళ్లఫామ్ లో వాణిజ్యపరమైన డిమాండ్ కలిగి కడకనాధ్ కోడి పిల్లల ఉత్పత్తి కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాక ఉటుకూరు కోళ్ల పామ్ నుంచి కడక్ నాధ్ రకపు కోడి పిల్లలను తెచ్చి పెంచి, హేచరీస్ గుడ్లు పొదిగించి కోడి గుడ్లను ఉత్పత్తి చేసి పాడి రైతులకు అందజేస్తామని అధికారి ఏడి రమణ అన్నారు.
(సేరి సురేష్, టీవీ9 తెలుగు, కడప జిల్లా)