Crime News : కొడుకు జీతం కోసం ఏటీఎంకు వెళ్లిన తండ్రిని ట్రాప్ చేశారు..! సాయం పేరుతో 40 వేలు దోచేశారు..

Crime News : ఆర్మీలో ఉద్యోగం సంపాదించిన కొడుకు శిక్షణ పూర్తయ్యాక తన తొలి జీతాన్ని ప్రేమతో ఊరులో ఉన్న తండ్రికి పంపించాడు.

Crime News : కొడుకు జీతం కోసం ఏటీఎంకు వెళ్లిన తండ్రిని ట్రాప్ చేశారు..! సాయం పేరుతో 40 వేలు దోచేశారు..
Robbed
Follow us
uppula Raju

|

Updated on: Jul 13, 2021 | 2:33 PM

Crime News : ఆర్మీలో ఉద్యోగం సంపాదించిన కొడుకు శిక్షణ పూర్తయ్యాక తన తొలి జీతాన్ని ప్రేమతో ఊరులో ఉన్న తండ్రికి పంపించాడు. ఎంతో ఆశగా డబ్బులు తీసుకువద్దామని ఏటీఎంకు వెళ్లిన తండ్రికి నిరాశ ఎదురైంది. ఇద్దరు కేటుగాళ్లు అతడిని ట్రాప్ చేసి రూ.40 వేలు దోచేశారు. విషయం తెలుసుకున్న తండ్రి తీవ్ర ఆవేదన చెందుతున్నాడు. విశాఖజిల్లాలో జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

విశాఖపట్నం జిల్లా మాడుగుల మడలం వీరవల్లి అగ్రహారంలో రైతుకూలీ సన్యాసిరావు కొడుకు దేశ సేవకోసం సైన్యంలో చేర్చాడు. శిక్షణ పూర్తయ్యాక విధుల్లో చేరాడు. తొలిజీతాన్ని తండ్రి ఖాతాలో వేశాడు. ఇది తెలుసుకుని ఆనందంతో పొంగిపోయిన తండ్రి డబ్బుల కోసం బ్యాంకుకు వెళ్ళాడు. బ్యాంకు అధికారులు ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవాలని సలహా ఇవ్వడంతో బుచ్చయ్యపేట మండలం వడ్డాదిలోని ఎస్బీఐ ఏటీఎంకు వెళ్ళాడు. అక్కడ విత్ డ్రా చేయడం తెలియక ఇబ్బందిపడుతున్న సన్యాసిరావును అవకాశం కోసం ఎదురు చూస్తున్న కేటుగాళ్లు ట్రాప్ చేశారు.

సహాయం చేస్తామని నమ్మించి తొలుత 2 వేలు తీసి ఇచ్చారు. ఆ తరువాత ఏటీఎం కార్డును మార్చేసి డబ్బులు డ్రా అవడం లేదని చెప్పి వెళ్ళిపోయారు. కార్డుతో ఇంటికి వెళ్ళిన సన్యాసిరావు తన కూతురికి చూపించాడు. తమ కార్డు కాదని గుర్తించి బ్యాంకుకు వెళ్ళారు. అయితే అప్పటికే 40 వేలను ఖాతా నుంచి లాగేశారు ఆ కేటుగాళ్ళు. పోలీసులకు ఫిర్యాదు చేయమని బ్యాంకు అధికారులు సూచించడంతో సన్యాసరావు పోలీస్ స్టేషన్ వెళ్లి తనకు జరిగిన మోసాన్ని వివరించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. బ్యాంకు అధికారుల వద్దకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు.

Kadaknath Poultry : కడప జిల్లాలో కడక్‌నాథ్ కోళ్ల పెంపకం.. ఉత్పత్తికి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్

Viral Video: కిచెన్‌లో వింత శబ్దాలు.. ఏంటని చూడగా.. షాకైన భార్యాభర్తలు.. వీడియో వైరల్.!

Virgin Galactic-Jeff Bezos: రోదసీ యాత్రపై కొత్త వివాదం.. అంతసీన్ లేదంటున్న అమెజాన్ అధిపతి