Viral Video: కిచెన్‌లో వింత శబ్దాలు.. ఏంటని చూడగా.. షాకైన భార్యాభర్తలు.. వీడియో వైరల్.!

ఈ మధ్యకాలంలో పాములు జనావాసాల్లోకి వచ్చిన సందర్భాల్లో కోకొల్లలు. అరణ్యాలలో ఉండాల్సిన విషసర్పాలు.. జనాల మధ్యకు..

Viral Video: కిచెన్‌లో వింత శబ్దాలు.. ఏంటని చూడగా.. షాకైన భార్యాభర్తలు.. వీడియో వైరల్.!
Snake In Kitchen
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 13, 2021 | 1:20 PM

ఈ మధ్యకాలంలో పాములు జనావాసాల్లోకి వచ్చిన సందర్భాల్లో కోకొల్లలు. అరణ్యాలలో ఉండాల్సిన విషసర్పాలు.. జనాల మధ్యకు వచ్చి తరచూ భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఆమడదూరంలో పామును చూస్తేనే మనుషులు పారిపోతారు.. అలాంటిది ఆ విషసర్పం ఇంట్లో తిష్టవేస్తే ఇంకేమైనా ఉందా.! గుండె ఆగిపోయినట్లే.! తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి విశాఖపట్నంలో చోటు చేసుకుంది. ఓ నాగుపాము కిచెన్‌లోకి దూరి అక్కడున్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. దానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

విశాఖలోని నేవల్ క్వార్టర్స్‌లో ఓ నాగుపాము కలకలం రేపింది. యారడలోని డాల్ఫిన్స్ హిల్స్ కొండపై నేవీ ఉద్యోగులు నివసిస్తున్నారన్న విషయం తెలిసిందే. ఆ ప్రాంతంలోని ఒకరి ఇంటి కిచెన్‌లో నాగుపాము(కింగ్ కోబ్రా) తిష్ట వేసుకుని కూర్చుంది. ఆ ఇంటిలో నివసిస్తున్నవారు కిచెన్ నుంచి వింత శబ్దాలు వస్తున్నాయని వెళ్లి చూడగా.. గట్టి షాక్ తిన్నారు. అక్కడ ఓ షెల్ఫ్‌లో పొడవైన నాగుపాము బుసలు కొడుతూ కనిపించింది.

దీనితో ఆ ఇంటివారు ఇరుగుపొరుగు వారిని సహాయానికి పిలిచారు. వారిలో ఒకరు స్నేక్ క్యాచర్ నాగరాజుకు సమాచారం అందించారు. అతడు అక్కడికి చేరుకొని చాకచక్యంగా పామును పట్టుకున్నాడు. దీనితో అందరూ హమ్మయ్య.! అంటూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, గతంలోనూ విశాఖలో పాములు హల్చల్ చేశాయి. సింధియా కూడలిలోని నేవల్ క్వార్టర్స్ వద్ద సుమారు 10 అడుగుల పొడువు ఉన్న బంగారు వర్ణంలోని త్రాచుపామును స్నేక్ క్యాచర్‌ పట్టుకుని బంధించాడు.

Also Read:

ఈ ఫోటోలో చిరుత నక్కింది.. గుర్తించండి చూద్దాం.. చాలామంది ఫెయిల్ అయ్యారు!

కోళ్ల వెంటబడ్డ పాము.. గోరింక మెరుపు దాడి.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!

10 పరుగులిచ్చి 10 వికెట్లు.. అందులో ఓ హ్యాట్రిక్.. టెస్టుల్లో అరుదైన రికార్డు.. ఆ బౌలర్ ఎవరంటే.!

కళ్లను మాయ చేసే ఫోటో.. బల్లిని గుర్తించండి చూద్దాం.. అస్సలు ఫెయిల్ కాకూడదు.!

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!