AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virgin Galactic-Jeff Bezos: రోదసీ యాత్రపై కొత్త వివాదం.. అంతసీన్ లేదంటున్న అమెజాన్ అధిపతి

వర్జిన్ గెలాక్టిక్ సంస్థ రెండురోజుల క్రితం నిర్వహించిన స్పేస్ టూర్‌ విజయవంతం అయ్యిందా? అయ్యిందన్నది ఆ సంస్థ మాట. కానీ అంతసీన్ లేదంటున్నారు అమెజాన్ అధిపతి బెజోస్‌. ఇంతకీ రిచర్డ్ వెళ్లొచ్చిన ట్రిప్‌పై...

Virgin Galactic-Jeff Bezos: రోదసీ యాత్రపై కొత్త వివాదం.. అంతసీన్ లేదంటున్న అమెజాన్ అధిపతి
Virgin Galactic Jeff Bezos
Sanjay Kasula
|

Updated on: Jul 13, 2021 | 1:20 PM

Share

వర్జిన్ గెలాక్టిక్ సంస్థ రెండురోజుల క్రితం నిర్వహించిన స్పేస్ టూర్‌ విజయవంతం అయ్యిందా? అయ్యిందన్నది ఆ సంస్థ మాట. కానీ అంతసీన్ లేదంటున్నారు అమెజాన్ అధిపతి బెజోస్‌. ఇంతకీ రిచర్డ్ వెళ్లొచ్చిన ట్రిప్‌పై బెజోస్‌కి ఎందుకిన్ని కామెంట్స్‌ చేస్తున్నారు..? ఇది స్పేస్‌ జలసీనా? లేదంటే నిజంగా రిచర్డ్ టూర్‌ రికార్డ్‌కి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఆగిపోయిందా? ఈ సరిహద్దు గొడవ ఏంటి..? అంతరిక్ష యుద్ధమేనా..? అవును.. స్పేస్‌లోకి వెళ్లిన వర్జిన్‌ గెలాక్టిక్‌ రోదసీ యాత్ర వివాదాస్పదమవుతోంది. బ్రిటిష్ బిజినెస్ మెన్ రిచర్డ్‌ బ్రాన్సన్‌ టీమ్‌ స్పేస్‌ టూర్‌పై ఎన్నో అనుమానాలు మొదలయ్యాయి. అసలు యూనిటీ 22-స్పేస్‌లోకి వెళ్లలేదంటోంది జెఫ్‌ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజన్‌ సంస్థ.

బ్లూ ఆరిజన్‌ చెబుతున్నట్లుగా యూనిటీ 22-స్పేస్‌ క్రాఫ్ట్‌ రోదసీకి వెళ్లలేదా? రిచర్డ్‌ టీమ్‌ అంతరిక్ష యాత్ర విజయవంతమైందని చెబుతున్న నాసా ప్రకటనలు కూడా అబద్ధమేనా..? అనే అనుమానాలు వక్తమవుతున్నాయి. రెండ్రోజుల క్రితం ఆరుగురితో కూడిన రిచర్డ్‌ బృందం రోదసీ యాత్ర విజయవంతమైనట్లు ప్రకటించింది. ఇటు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కూడా రిచర్డ్‌ బృందం యాత్రను అభినందిస్తూ ట్వీట్‌ చేసింది. కానీ అసలు వీరు రోదసీకే వెళ్లలేదంటూ అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజన్ సంస్థ..కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చింది. కర్మన్‌ రేఖ దాటితేనే రోదసీలోకి వెళ్లినట్లంటోంది బ్లూ ఆరిజన్‌.

రిచర్డ్‌ బృందం భూమి నుంచి 89కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్లింది. అక్కడి జీరో గ్రావిటీ ఎక్స్‌పీరియన్స్‌ పొందిన వీడియోలను కూడా ప్రసారం చేశారు. కానీ 100కిలోమీటర్ల దగ్గర కర్మన్‌ రేఖ మొదలవుతుందంటోంది బ్లూ ఆరిజన్‌. ఆ రేఖను దాటితేనే రోదసీలోకి వెళ్లినట్లు చెబుతోంది. కర్మన్ లైన్ అంటే భూమి నుంచి 100 కిలోమీటర్ల వద్ద ఉండే లైన్. ఇదే రోదసీ అని నిర్ణయించారు. దాదాపు 96 శాతం దేశాలు దీన్నే ప్రామాణికంగా తీసుకుంటున్నాయి.

ఈ లెక్కన 89కిలోమీటర్లు మాత్రమే ప్రయాణం చేసిన రిచర్డ్ బ్రాన్సన్ రోదసీ యాత్ర సక్సెస్ అయినట్లు ఎలా అవుతుందని బ్లూ ఆరిజన్ ప్రశ్నిస్తోంది. వర్జిన్ గెలాక్టిక్‌కు చెందిన యూనిటీ-22 ఎక్కువ ఎత్తులో ఎగరగలిగే విమానం మాత్రమేనని..ఇందులో యాత్ర చేసిన వారు కేవలం భూఉపరితల కక్షలోనే ఉన్నారనేది అరిజోన్ వాదన.

అయితే ప్రపంచంలో ఎక్కువ దేశాలు కర్మన్ లైన్‌నే ప్రామాణికంగా తీసుకుంటే నాసా లెక్క మాత్రం వేరేగా ఉంది. భూమి నుంచి 80 కిలోమీటర్లు దాటితే రోదసీలోకి వెళ్లినట్లేనని చెబుతోంది. నాసా, అమెరికా సైన్యం కూడా 80 కిలోమీటర్లకే రోదసీ మొదలవుతుందంటున్నాయి. అందుకే శిరీష బృందం యాత్రను నాసా సక్సెస్ అయినట్లు గుర్తించింది. 1960 నుంచి అమెరికా 80 కిలోమీటర్ల దూరాన్ని అంతరిక్ష సరిహద్దుగా చెబుతోంది.

ఈ నేపథ్యంలో అసలు భూమికి ఎంత దూరంలో రోదసీ మొదలవుతుందనే అంశంపై వివాదం నెలకొంది. మరోవైపు ఈ నెల 20నే జెఫ్‌ బెజోస్ బృందం కూడా రోదసీ యాత్ర చేయబోతోంది. ఈ నేపథ్యంలో తమ కంటే ముందే వెళ్లొచ్చిన తమపై విమర్శలు కురిపిస్తున్నారంటోంది వర్జిన్‌ గెలాక్టిక్‌. బ్లూ ఆరిజోన్ సంస్థ చేస్తున్న ఆరోపణలను ఖండించింది. బెజోస్‌ సంస్థ చేస్తోన్న వాదనల్లో నిజం లేదని..అవన్నీ అవాస్తవాలంటోంది.

ఇవి కూడా చదవండి : Gupta Nidhulu: నిర్మల్‌ జిల్లాలో గుప్తనిధుల కలకలం.. కన్నం వేసేందుకు కన్నింగ్‌ ఫెల్లో ప్లాన్.. ఏమైందో తెలుసా..

Free Condoms: ఐదో తరగతి ఆపై విద్యార్థులకు కండోమ్స్‌ తప్పనిసరి.. సంచలన నిర్ణయం తీసుకున్న పబ్లిక్​ స్కూల్స్ ఎడ్యుకేషన్. ఎక్కడో తెలుసా?