AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gupta Nidhulu: నిర్మల్‌ జిల్లాలో గుప్తనిధుల కలకలం.. కన్నం వేసేందుకు కన్నింగ్‌ ఫెల్లో ప్లాన్.. ఏమైందో తెలుసా..

మూఢనమ్మకమే పెట్టుబడిగా భూమికి కన్నం వేస్తున్న కన్నింగ్‌ ఫెల్లోలు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. ఒకవైపు ప్రపంచం అంతా భవిష్యత్‌కి కాలానికి బాటలు వేసుకుంటుంటే...

Gupta Nidhulu: నిర్మల్‌ జిల్లాలో గుప్తనిధుల కలకలం.. కన్నం వేసేందుకు కన్నింగ్‌ ఫెల్లో ప్లాన్.. ఏమైందో తెలుసా..
Gupta Nidhulu
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 13, 2021 | 8:25 AM

స్పేస్‌ టూరిజంతో ఆకాశానికి నిచ్చెన వేస్తున్న వేళ మనిషి పాతాళంలోకీ తొంగి చూస్తున్నాడా ? అంటే.. అవుననే చెప్పాలి.. పెరుగుతున్న గుప్తనిధుల తవ్వకాలు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. మూఢనమ్మకమే పెట్టుబడిగా భూమికి కన్నం వేస్తున్న కన్నింగ్‌ ఫెల్లోలు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. ఒకవైపు ప్రపంచం అంతా భవిష్యత్‌కి కాలానికి బాటలు వేసుకుంటుంటే, ఇటు నిర్మల్‌ జిల్లాలో ఓ ప్రబుద్ధుడు మాత్రం గుప్తనిధుల పేరుతో భూతకాలంనాటి ఆనవాళ్ళు వెతుక్కుంటున్నాడు. నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణంలోని కోర్బగల్లీలోని ఓ ఇంట్లో రోజూ గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయినేది స్థానికుల ఆరోపణ. అంతేకాదు ఈ గుప్తనిధుల కోసం నిత్యం తాంత్రికులతో పూజలు చేయిస్తున్నాడంట ఆ ఇంటి యజమాని.

కష్టపడి పనిచేసే ఓపిక లేక ఇలా అడ్డదారుల్లో కోటీశ్వరులైపోదామనే దొంగల సంఖ్య ఈమధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోతోంది. ఎవరో కూసే పిచ్చి.. పిచ్చి కూతలు నమ్మి పనులన్నీ మానుకొని ఇల్లు, ఒళ్ళు గుళ్ళు గుల్లచేసుకుంటున్నారు. భైంసా పట్టణంలో ఇతని పిచ్చిచేష్ఠలు, వింత ప్రవర్తన భరించలేని చుట్టుపక్కల ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేసారు. స్థానికులిచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగప్రవేశం చేసారు.

అయితే ఇంటి ఓనర్‌ వాదన మరోల ఉంది. గతంలో ఇదే ఇంట్లో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారని, దీంతో ఇప్పుడు శాంతి పూజలు చేయిస్తున్నాని, వాస్తు బాగోలేకపోవడంతో కొన్ని మార్పులు చేయిస్తున్నాని వివరణ ఇచ్చాడు. ప్రస్తుతం నిజానిజాల్ని వెలికితీసే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు.

ఇవి కూడా చదవండి: Red sandalwood: పోలీసులకు కౌంటర్ ప్లాన్‌.. ఏపీ-తమిళనాడు సరిహద్దుల్లో రూటు మార్చిన ఎర్రచందనం స్మగ్లర్లు..

‘కొంగు నాడు’ వివాదం.. తమిళనాడును విభజించే ప్రసక్తి లేదు.. బీజేపీ హైకమాండ్ క్లారిటీ