‘కొంగు నాడు’ వివాదం.. తమిళనాడును విభజించే ప్రసక్తి లేదు.. బీజేపీ హైకమాండ్ క్లారిటీ

తమిళనాడును రెండు రాష్ట్రాలుగా విభజించే ప్రసక్తి లేదని బీజేపీ హైకమాండ్ స్పష్టం చేసింది. కొంగు నాడు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడుతుందంటూ వచ్చిన ఊహాగానాల నేపథ్యంలో బీజేపీ ఈ క్లారిటీ ఇస్తూ...

'కొంగు నాడు' వివాదం.. తమిళనాడును విభజించే ప్రసక్తి లేదు.. బీజేపీ హైకమాండ్ క్లారిటీ
Cm Stalin
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Jul 12, 2021 | 8:21 PM

తమిళనాడును రెండు రాష్ట్రాలుగా విభజించే ప్రసక్తి లేదని బీజేపీ హైకమాండ్ స్పష్టం చేసింది. కొంగు నాడు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడుతుందంటూ వచ్చిన ఊహాగానాల నేపథ్యంలో బీజేపీ ఈ క్లారిటీ ఇస్తూ..తమిళనాడును రెండుగా విభజించే యోచనే లేదని తెలిపింది. తమిళనాడు బీజేపీ శాఖకు చెందిన పలువురు నాయకులు ఈ మేరకు అభిప్రాయాలను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఉత్తర కోయంబత్తూరు బీజేపీ శాఖకు చెందిన కార్యకర్తలను పార్టీ నాయకత్వం తీవ్రంగా మందలించింది. కొంగు నాడు డిమాండును అన్నా డీఎంకే తీవ్రంగా వ్యతిరేకించింది. కొంగునాడుకు చెందిన బీజేపీ ఎంపీ ఎల్.మురుగన్ కేంద్రంలో సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రిగా నియమితులు కావడంతో ఇక రాష్ట్ర విభజన జరుగుతుందేమోనన్న ఊహాగానాలు మొదలయ్యాయి. పైగా తమిళ డైలీ ఒకటి ప్రత్యేక రాష్ట్రం అంటూ ఓ వార్తను ప్రచురించింది. దీంతో సీపీఐ, సీపీఎం, ఎండీఎంకె అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దీనిపై బీజేపీ నాయకత్వం క్లారిటీ ఇవ్వాలని కోరాయి.

ధారాపురం, తిరుచెంగోడు, ఈరోడ్, పళని, సేలం, ధర్మపురి, నీలగిరి, సత్యమంగళం, పొలాచ్చి, కోయంబత్తూరు, మరో మూడు, నాలుగు జిల్లాలు కొంగునాడు పరిధిలోకి వస్తాయి. ఈ పశ్చిమ ప్రాంతంలో ఏఐఏడీఎంకె పట్టు ఎక్కువగా ఉంది.. అయితే ప్రత్యేక రాష్ట్రం డిమాండును మాత్రం పలు పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఏమైనా ఈ వివాదం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ ఈ రాష్ట్రాన్ని విభజించాలని చూస్తోందని డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు దుయ్యబట్టాయి. కలలో కూడా ఆ యోచన రాకూడదని డీఎంకే నేత కనిమొళి వ్యాఖ్యానించారు. చివరకు ఇది పెద్ద వివాదం కావడంతో బీజేపీ సోమవారం ఈ వివరణను, క్లారిటీని ఇచ్చింది.

మరిన్ని ఇక్కడ చూడండి: ‘నాపై నిఘా పెడుతున్నారు.’ శివసేన, ఎన్సీపీ లపై .మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోల్ సంచలన ఆరోపణ

India tour of Sri Lanka: ఇట్స్ అఫీషియల్.. ఐదు రోజులు ఆలస్యంగా సిరీస్ రీ-స్టార్ట్.. షెడ్యూల్ ఇదే.!