‘నాపై నిఘా పెడుతున్నారు.’ శివసేన, ఎన్సీపీ లపై .మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోల్ సంచలన ఆరోపణ

మహారాష్ట్ర లోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో మెల్లగా లుకలుకలు తీవ్రమవుతున్నాయి. తన పైన, తన పార్టీవారిపైనా ప్రభుత్వ పెద్దలు నిఘా పెడుతున్నారని, గూఢచర్యం నెరపుతున్నారని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోల్ ఆరోపించారు.

'నాపై నిఘా పెడుతున్నారు.' శివసేన, ఎన్సీపీ లపై .మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోల్ సంచలన ఆరోపణ
Nana Patole
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Jul 12, 2021 | 8:16 PM

మహారాష్ట్ర లోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో మెల్లగా లుకలుకలు తీవ్రమవుతున్నాయి. తన పైన, తన పార్టీవారిపైనా ప్రభుత్వ పెద్దలు నిఘా పెడుతున్నారని, గూఢచర్యం నెరపుతున్నారని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోల్ ఆరోపించారు. లోనావాలాలో సోమవారం తన మద్దతుదారులతో మాట్లాడిన ఆయన.. శివసేన, ఎన్సీపీ తనపైన. పార్టీ కార్యకర్తలపైనా నిఘా పెట్టారని, వాచ్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రతి రోజూ ఉదయం 9 గంటలకు సీఎం ఉద్ధవ్ థాక్రే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్, హోమ్ మంత్రి దిలీప్ వాల్సే పాటిల్ సమావేశమై ..రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు సంబంధించిన రిపోర్టును తెప్పించుకుంటున్నారని చెప్పారు. మధ్యాహ్నం 3 గంటలకు తాను ఓ మీటింగ్ కి హాజరు కావలసి ఉంటే దాని గురించి ముందుగా ఎవరికీ సమాచారం తెలియకపోయినా శివసేన, ఎన్సీపీ దాన్ని మీడియాకు లీక్ చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. తమ కాళ్ళ కింద భూమి జారిపోతోందని ఆ పార్టీ నాయకులకు తెలిసి[పోతోందన్నారు.

తన ఫోన్ ను ట్యాప్ చేస్తున్నారని, తాను ఎక్కడికి వెళ్లినా, ఏం మాట్లాడినా దానికి సంబంధించిన రిపోర్టు ఆ ముగ్గురికీ వెళ్తోందని నానా పటోల్ తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడం కొందరికి ఇష్టం లేదన్నారు. 2016-17 మధ్య నాటి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వ హయాంలో కూడా తన ఫోన్ ట్యాప్ అయిందని, ఎవరో డ్రగ్గిస్ట్ అంజాద్ ఖాన్ అనే వ్యక్తికి చెందినదిగా చెబుతూ తన ఫోన్ ను ట్యాప్ చేశారని అయన చెప్పారు. అసలు ఈ వార్తలపై కూలంకషంగా దర్యాప్తు జరగాలని ఆయన డిమాండ్ చేశారు. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందంటూ ఈయన మొదట చేసిన వ్యాఖ్యలతో దుమారం మొదలైంది.

మరిన్ని ఇక్కడ చూడండి: Health Tips: మీ నాలుకపై ఈ లక్షణాలు ఉన్నాయా..? అయితే కాస్త జాగ్రత్త పడండి !

అమెరికా యుద్ధ నౌకను ‘తరిమేశాం’..సౌత్ సీ మాదే..చైనా.. తిప్పికొట్టిన అగ్ర రాజ్యం ..సముద్ర జలాల హక్కులపై రగడ

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే