Red sandalwood: పోలీసులకు కౌంటర్ ప్లాన్.. ఏపీ-తమిళనాడు సరిహద్దుల్లో రూటు మార్చిన ఎర్రచందనం స్మగ్లర్లు..
మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం.. స్మగ్లర్లను పోలీసులు ఈజీగా పట్టుకుంటారు. అది రీల్ లైఫ్. కానీ రియల్ లైఫ్‌లో అక్కడి స్మగ్లర్లు చాలా టఫ్. మమ్మల్ని పట్టుకోవడం అంతా ఈజీ కాదు అంటున్నారా స్మగ్లర్లు. ఎవరా స్మగ్లర్లు..?
మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం.. స్మగ్లర్లను పోలీసులు ఈజీగా పట్టుకుంటారు. అది రీల్ లైఫ్. కానీ రియల్ లైఫ్‌లో మాత్రం స్మగ్లర్లను పట్టుకోవడం పోలీసులకు చాలా కష్టంగా మారుతోంది. తమని పట్టుకోవడం అంతా ఈజీ కాదంటూ పోలీసులకు ఛాలెంజ్ విసురుతున్నారు. ఎవరా స్మగ్లర్లు..? వారిని పట్టుకోవడానికి పోలీసులు, పారెస్ట్ ఆఫీసర్స్ ఎంత ట్రై చేసినా… వర్కవుట్ కావట్లేదు. పోలీసులు ఏ ప్లాన్ వేసినా… దానికి కౌంటర్ ప్లాన్‌తో స్మగ్లర్లు తమ పని తాము ఈజీగా కానిచ్చేస్తున్నారు. వారిని చూస్తేనే.. భయపడేలా చేస్తున్నారు. ఏపీ-తమిళనాడు సరిహద్దు జిల్లాల్లో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు.
తాజాగా తమిళనాడులో భారీగా ఎర్రచందనం పట్టుబడింది. క్రిష్ణగిరి జిల్లాలో హోసూర్‌లో ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. చిత్తూర్ జిల్లా మదనపల్లిలో దొరికిన వ్యక్తులను ఇంటరాగేట్ చేయగా… అసలు విషయం బయటపడింది. వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌తో కోట్ల విలువైన దుంగలు స్వాధీనం చేసుకున్నారు.
హోసూర్‌లో గోడౌన్‌లో పట్టుబడ్డ ఎర్రచందనం విలువ 6.2 కోట్లు ఉంటుందని సమాచారం. ఇవే కాకుండా క్రిష్ణగిరి-బొమ్మనహళ్లి సమీపంలో 8.2 టన్నుల 238 ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. బెంగుళూరుకి చెందిన ఇమ్రాన్ ఖాన్ గ్యాంగ్ శేషాచలం నుంచి ఎర్రచందనం దుంగలను ఢిల్లీకి తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.