Model Murder: ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం ఇంటికెళ్లిన సోదరుడు.. నగ్నంగా రక్తపు మడుగులో ప్రముఖ మోడల్..!

Model Murder: పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ మోడల్ నయాబ్ నదీమ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. లాహోర్‌ డిఫెన్స్ బి..

Model Murder: ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం ఇంటికెళ్లిన సోదరుడు.. నగ్నంగా రక్తపు మడుగులో ప్రముఖ మోడల్..!
Pakistani Model Nayab Nadee
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 12, 2021 | 10:23 PM

Model Murder: పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ మోడల్ నయాబ్ నదీమ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. లాహోర్‌ డిఫెన్స్ బి ప్రాంతంలోని తన నివాసంలో నగ్నంగా రక్తపు మడుగులో విగత జీవిగా పడి ఉన్నారు. పాకిస్తాన్ మీడియా కథనం ప్రకారం.. వృత్తిరీత్యా మోడల్‌ అయిన నయాబ్ నదీమ్(29)ను గుర్తుతెలియని దుండగులు గొంతు కోసి చంపేశారు. మోడల్ మృతిపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని నదీమ్ మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె గొంతు కోసి ఉన్నట్లు గుర్తించారు. కాగా, ఆమె సవతి సోదరుడు మహ్మద్ అలీ నాసిర్ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

నదీమ్ సోదరుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నయాబ్ నదీమ్‌కు ఇంకా వివాహ కాలేదు. తానొక్కతే ప్రత్యేక ప్లాట్‌లో నివాసం ఉంటోంది. అయితే, నదీమ్ చనిపోవడానికి ముందు రోజు నాసిర్‌తో కలిసి సరదాగా బయటకు వెళ్లింది. ఐస్‌క్రీమ్ తినడం కోసం ఇద్దరూ కలిసి గుల్బర్గ్ వెళ్లారు. ఆ తరువాత నాసిర్.. నదీమ్‌‌ను తన ఇంటి వద్ద దింపేసి వెళ్లిపోయాడు. మరుసటి రోజు నాసిర్ తన అక్క నదీమ్‌కు ఫోన్ చేయగా ఎంతకీ లిఫ్ట్ చేయలేదు. దాంతో అతను.. నేరుగా ఇంటికి వచ్చాడు. డోర్ కొట్టినా స్పందన రాకపోవడంతో అనుమానం వచ్చి కిటికీ నుంచి చూశాడు. కిటికీ గ్రిల్స్‌ని తొలగించి ఉండటాన్ని చూసి ఏదో జరిగిందని అనుమానించాడు. ఆ కిటికీ నుంచే లోపలికి వెళ్లాడు నాసిర్. టీవీ లాంజ్‌లో నదీమ్ నగ్నంగా, విగత జీవిగా పడి ఉండటం చూసి షాక్ అయ్యాడు. నదీమ్ శరీరంపై, మెడపై తీవ్రమైన గాయాలు ఉన్నాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. నాసిర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపడుతున్నారు.

Also read:

Kitex Garments: కైటెక్స్ పెట్టుబడులపై కేంద్ర మంత్రి ట్వీట్.. తీవ్రంగా స్పందించిన టీకాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్..

Viral Video: అమ్మో బొమ్మ.. సడెన్‌గా చూస్తే గుండె ఆగిపోవడం ఖాయం.. ఇదేం క్రియేటీవీటీ రా బాబూ..!

INDW vs ENGW: రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన భారత యువ సంచలనం.. 18 ఏళ్లు నిండకుండానే నెంబర్ వన్..! ఎందులోనో తెలుసా?