AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pregnant Women Food: కాబోయే అమ్మలు.. ఆహారం విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి. వీటిని అస్సలు టచ్‌ చేయకండి.

Pregnant Women Food: తల్లిగా మారడం ప్రతీ మహిళ జీవితానికి పరిపూర్ణత తీసుకొస్తుంది. ఈ సృష్టి ముందుకు సాగాలంటే తల్లి బిడ్డకు జన్మనివ్వాల్సిందే. ఇలా జీవితంలో కీలకమైన ఈ దశను మహిళలు సంతోషంగా...

Pregnant Women Food: కాబోయే అమ్మలు.. ఆహారం విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి. వీటిని అస్సలు టచ్‌ చేయకండి.
Pregnant Women Food
Narender Vaitla
|

Updated on: Jul 13, 2021 | 8:59 AM

Share

Pregnant Women Food: తల్లిగా మారడం ప్రతీ మహిళ జీవితానికి పరిపూర్ణత తీసుకొస్తుంది. ఈ సృష్టి ముందుకు సాగాలంటే తల్లి బిడ్డకు జన్మనివ్వాల్సిందే. ఇలా జీవితంలో కీలకమైన ఈ దశను మహిళలు సంతోషంగా ఆహ్వానిస్తారు. బిడ్డకు జన్మనిచ్చే క్రమంలో ఎంతో ఇబ్బంది ఎదురయినప్పటికీ తమ ప్రతీరూపాన్ని చూసుకోవడానికి సంతోషంగా భరిస్తారు. ఈ క్రమంలోనే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచన అందరికీ ఉంటుంది. గర్భంలో ఉన్న బిడ్డకు అవసరమైన పోషకాలు తల్లి తీసుకునే ఆహారం ద్వారానే అందుతాయని మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తల్లి తీసుకునే కొన్ని ఆహార పదార్థాలు గర్భంలోని బిడ్డపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంటుంది. కాబోయే తల్లులు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు, ఆహారం తీసుకునే క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లాంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..

* గర్భంతో ఉన్న మహిళలు బొప్పాయిని తీసుకోకూడదని చెబుతుంటారు. బొప్పాయి వల్ల శరీరంలో వేడి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా కొన్ని సందర్భాల్లో గర్భస్రావం అయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి గర్భిణీలు ఎట్టి పరిస్థితుల్లో బొప్పాయిని తీసుకోకపోవడమే మంచిది. * ఇక పండ్లు, కూరగాయలు తల్లితో పాటు గర్భంలోని చిన్నారికి కూడా మేలు చేస్తాయని మనందరికీ తెలిసిందే. అయితే వీటిని తీసుకునే ముందు చాలా శుభ్రంగా కడగాలి. ముఖ్యంగా వర్షా కాలం సమయంలో ఆకు కూరల్లో క్రిములు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకటి రెండు సార్లు శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక రసాయనాలు వాడి పండించే పండ్లకు దూరంగా ఉండడమే మంచిది. * గర్భిణీలు షుగర్‌ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. దీనివల్ల గర్భంలోని చిన్నారిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలున్నట్లు నిపుణులు సూచిస్తున్నారు. * మహిళలు గర్భంతో ఉన్న సమయంలో పచ్చి మాంసం, పచ్చి గుడ్లను తీసుకోకపోవడమే మేలు. సరిగ్గా ఉడకని మాంసం వల్ల చెడు ప్రభావం పడే ఛాన్సెస్‌ ఉంటాయి. అంతేకాకుండా కాబోయే తల్లుల జీర్ణ క్రియ రేటును కూడా ఇవి తగ్గిస్తాయి. * ఇక గర్భంతో ఉన్న సమయంలో ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. కొంచెం కొంచెంగా ఎక్కువసార్లు ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. * గర్భిణీలు ధూమపానం, మద్యాపానానికి పూర్తిగా దూరంగా ఉండాలి. గర్భం దాల్చేందుకు మూడు నెలల నుంచే ఇలాంటి అలవాట్లను మాన్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు కొన్ని అధ్యయనాల ప్రకారం ప్రెగ్నన్సీకి ప్లాన్‌ చేసే మూడు నెలల ముందు నుంచి మగవారు కూడా ధూమపానానికి దూరంగా ఉండాలని చెబుతున్నారు.

Also Read: Health Tips: మీ నాలుకపై ఈ లక్షణాలు ఉన్నాయా..? అయితే కాస్త జాగ్రత్త పడండి !

Food Poisoning: నిల్వ ఉన్న ఆహారం తింటే పుడ్ పాయిజన్ అయ్యి వాంతులు అవుతుంటే ఈ సింపుల్ చిట్కాలు మీ కోసమే

Yoga Pose-Kati Chakrasana: పొట్ట దగ్గర అధిక కొవ్వు తగ్గాలా.. ఈ యోగాసనాన్ని ట్రై చేయండి