Health Tips: మీ నాలుకపై ఈ లక్షణాలు ఉన్నాయా..? అయితే కాస్త జాగ్రత్త పడండి !
సాధారణంగా జబ్బు చేసి డాక్టర్ దగ్గరకు వెళితే నాలుక చాపమని.. అటు ఇటూ చూస్తారు. అంతే వెంటనే మనకు ఏమైందో చెప్పేస్తాడు. అయితే నాలుక చూస్తే ఏం తెలుస్తుంది అనుకుంటారు చాలా మంది.
సాధారణంగా జబ్బు చేసి డాక్టర్ దగ్గరకు వెళితే నాలుక చాపమని.. అటు ఇటూ చూస్తారు. అంతే వెంటనే మనకు ఏమైందో చెప్పేస్తాడు. అయితే నాలుక చూస్తే ఏం తెలుస్తుంది అనుకుంటారు చాలా మంది. అదే మనిషి ఆరోగ్యాన్ని అంచనా వేసే చిట్కా. నాలుకను బట్టి మనిషి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడమనేది డాక్టర్లకు చాలా సులువు. అయితే ఇప్పుడు నాలుకను చూసి మీ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవచ్చు. నాలుక రంగులను బట్టి మీ ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయవచ్చు. ఉదహారణకు మీ నాలుక గులాబీ రంగులో కనిపిస్తే అది తేమగా.. మృదువుగా ఉన్నట్లు అర్థం. అలాగే.. కాస్తా తేడాగా ఉన్నా.. ఒత్తిడి లేదా నొప్పి ఉంటే కోన్ని ఆరోగ్య సమస్యలను చూపిస్తుంది. అదేలాగో తెలుసుకుందాం.
* తెల్ల నాలుక.. తెల్లటి పూత లేదా పాచెస్ ఉంటే.. ఓరల్ కాన్టిడియాసిస్ కాండిడా అల్భికాన్స్ అనే ఫంగస్ పెరగడం వలన నోటి త్రష్ లేదా ఇతర వ్యాధులకు కారణమవుతుంది. ఈ ఫంగస్ ఎప్పుడూ నోటిలో ఉంటుంది. అంటే ఇది పూర్తిగా ప్రమాదకరం. శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం.. బలహీన పడడం వంటివి ఏర్పడతాయి.
* ల్యూకోప్లాకియ.. ఇది సాధారణంగా నోటిలోని శ్లేష్మ కణజాలలో ఉంటుంది. మందపాటి తెలుపు, లేదా బుడిద రంగు పాచెస్ ఏర్పడతాయి. ఇది అంత ప్రమాదకరం కాదు. కానీ ఇలా తెల్లగా మారిపోవడం వలన నోటి క్యాన్సర్, ఇతర వ్యాధుల భారిన పడే అవకాశం ఉంటుంది.
* ఓరల్ లైకెన్ ప్లానస్.. రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు నోటి లైకెన్ ప్లానస్కు కారణమవుతుంది. ఇది నోటిలోని శ్లేష్మ పొరను ప్రభావితం చేస్తుంది. నాలుకపై తెల్లని మచ్చలు, నాలుక దెబ్బతినడం జరుగుతుంది.
* ఎర్ర నాలుక.. ఎర్ర నాలుక ఉంటే పోషకాహర లోపం అని అర్థం.
* బి-12 లోపం… ఫోలిక్ ఆమ్లం లేదా విటమిన్ బి -12 లోపం వల్ల మీ నాలుక ఎర్రగా కనిపిస్తుంది. ఇందుకు సరైన పోషకాహరం తీసుకోవడమే కాకుండా.. విటమిన్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
* నాలుక పై మ్యాప్ లాంటి నమూనాలు కనిపిస్తుంటాయి. అలా ఉంటే.. అలెర్జీలు, లోపాలు, మధుమేహం లేదా ఒత్తిడి యొక్క ముఖ్యమైన లక్షణం.
* స్కార్లెట్ జ్వరము
మీ నాలుక ఎరుపు, ఎత్తుపల్లాలుగా కనిపించే బ్యాక్టీరియా అనారోగ్యానికి కారణం. హైలైట్ చేయడానికి, స్కార్లెట్ జ్వరం చికిత్స చేయకపోతే, గుండె, మూత్రపిండాలు, ఇతర అవయవాలను ప్రభావితం చేసే మరింత తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది.
* పిల్లలకు సాధారణంగా అధిక జ్వరం, రక్త నాళాల వాపు వలన నాలుక ఎర్రగా కనిపిస్తుంది.
మచ్చల నాలుక.. * నాలుక కండరాల ఎపిథీలియంపై ఉన్న పాపిల్లే జీవితకాలమంతా పెరుగుతాయి. సాధారణంగా నల్ల నాలుక క్యాన్సర్ రోగులలో ఎక్కువగా ఉంటుంది. అలాగే కీమోథెరపీ చేయించుకుంటున్నవారిలో డయాబెటిక్ వారిలో నల్ల నాలుక ఉంటుంది. పొక్కులు రావడం.. ఎప్పుడూ వేడిగా ఉండడం, ఎత్తు ఒంపులుగా ఉంటే వెంటనే డాక్టరును సంప్రదించాలి. నాలుకలో ఏదైనా పిగ్నెంటేషన్, పొక్కులు, నొప్పి ఉండడం వలన అనారోగ్యయ సమస్యలను అంచనా వేయాలి.
Also Read: Aamir Khan: అమీర్ ఖాన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ.. అలాంటి వ్యక్తులు దేశ జనాభాలో…
ఈ ఫోటోలో ఉన్న టాప్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా ? టాలీవుడ్లో ఫుల్ బిజీ ఈ ముద్దుగుమ్మ..