Aamir Khan: అమీర్ ఖాన్‏పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ.. అలాంటి వ్యక్తులు దేశ జనాభాలో…

దేశంలో జనాభా అసమతుల్యతలో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ లాంటి వ్యక్తులు కారణమని భారతీయ జనతా పార్టీ నాయకుడు సుధీర్ గుప్తా అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం విలేకరుల సమావేశంలో

Aamir Khan: అమీర్ ఖాన్‏పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ.. అలాంటి వ్యక్తులు దేశ జనాభాలో...
Aamir Khan
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Rajitha Chanti

Updated on: Jul 12, 2021 | 8:06 PM

దేశంలో జనాభా అసమతుల్యతలో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ లాంటి వ్యక్తులు కారణమని భారతీయ జనతా పార్టీ నాయకుడు సుధీర్ గుప్తా అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం విలేకరుల సమావేశంలో మాండ్సౌర్ ఎంపీ సుధీర్ గుప్తా మాట్లాడుతూ.. “భారత భూభాగం ఒక అంగుళం కూడా పెరగలేదు. కానీ.. జనాభా మాత్రం 140 కోట్లకు చేరువైంది. విభజన సమయంలో పాకిస్తాన్‏కు చాలా ఎక్కువ భూమి వెళ్లిపోయింది. కానీ జనాలు తక్కువ సంఖ్యలో వెళ్లారు. అందులో కొందరు తిరిగి భారత్‏కే వచ్చారు. ఇందుకు అనుగుణంగా భారత భూభాగం మాత్రం పెరగలేదు ” అని అన్నారు.

అలాగే ఈ మధ్య తన రెండవ భార్య కిరణ్ రావు నుంచి విడాకులు తీసుకున్న బాలీవుడ్ స్టార్ నటుడి అమీర్ ఖాన్ గురించి ప్రస్తావిస్తూ.. “ప్రజల హీరో అయిన అమీర్ తన మొదటి భార్య రీనాతోపాటు.. వారి సంతానాన్ని , రెండో భార్య కిరణ్ రావుతోపాటు వారి కుమారుడిని వదిలేశాడు. ఇప్పుడు మూడో భార్య కోసం ఆరాటపడుతున్నాడు ” అని వ్యాఖ్యానించారు. దేశ జనాభా అసమానతల్లో అమీర్ ఖాన్ వంటి వ్యక్తులు పాత్ర పోషించడం విడ్డూరంగా ఉందని పేర్కోన్నారు.

జూలై 3న బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, కిరణ్ రావు తమ 15 సంవత్సరాల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకుంటున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వీరిద్దరు కలిసి ఈ ప్రకటన చేసిన తర్వాత సోషల్ మీడియాలో అమీర్ తీరుపై వ్యతిరేకంగా పోస్టులు వచ్చాయి. దంగల్ బ్యూటీ సనా కారణంగానే వీరిద్దరు వీడిపోయారని నెట్టింట్లో కథనాలు వెలువడ్డాయి. అంతకు ముందు అమీర్ తన మొదటి భార్య రీనా దత్తాకు విడాకులు ఇచ్చి.. కిరణ్ రావును వివాహం చేసుకున్నారు.

Also Read: ఈ ఫోటోలో ఉన్న టాప్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా ? టాలీవుడ్‏లో ఫుల్ బిజీ ఈ ముద్దుగుమ్మ..

Skylab Movie: ప్రపంచం నాశనం అవుతుందన్నారు.. కానీ వారి జీవితాల్లో ఏం జరిగింది.. ఆసక్తికరంగా ‘స్కైలాబ్’ ఫస్ట్‏లుక్ పోస్టర్..

Priyanka Chopra: పదేళ్లలో ప్రియాంక విడాకులు తీసుకుంటుంది.. బాలీవుడ్ నటుడు షాకింగ్ కామెంట్స్.. మండిపడుతున్న నెటిజన్లు..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే