Sonu Sood: ముంబైకి వచ్చే ముందు ఫిల్మ్ ఫేర్ పుస్తకం కొన్నా.. 20 ఏళ్ల తర్వాత కల నెరవేరింది అంటున్న సోనూ సూద్
Sonu Sood: దేశంలో కరోనా వైరస్ కట్టడికోసం లాక్ డౌన్ విధించేంత వరకూ అతనొక నటుడు. కానీ ఇప్పుడు అమ్మ చెప్పిన మాటలని నిలట్టిన ముద్దుల తనయుడు .. తాను చేయాలనుకున్న..
Sonu Sood: దేశంలో కరోనా వైరస్ కట్టడికోసం లాక్ డౌన్ విధించేంత వరకూ అతనొక నటుడు. కానీ ఇప్పుడు అమ్మ చెప్పిన మాటలని నిలట్టిన ముద్దుల తనయుడు .. తాను చేయాలనుకున్న సేవకు రాజకీయ రంగులు అద్ధకుండా నిస్ఫక్షపాతంగా కుల, మత, వర్గ, బేధాల ప్రసక్తి తలెత్త కుండా అందర్నీ ఆకట్టుకుంటున్నారు సోనూ సూద్. ఈయన చేసే సాయంపై వస్తున్న వార్తలను వినకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంకా చెప్పాలంటే సాయం చేయడానికి ఉండాల్సి డబ్బు మాత్రమే కాదు అంతకంటే మనిషి కష్టంలో ఉన్నప్పుడు స్పందించే మనసని నిరూపించారు. కష్టాల్లో ఉన్న బాధితులకు అండగా నిలుస్తూ రియల్ హీరో అయ్యారు. ఈ వెండి తెర విలన్. అప్పటి నుంచి మొదలైన ఈ దాతృత్వం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. తాము బాధల్లో ఉన్నాం సాయం అందించండి అంటూ అడిగిన వారికీ … తనని సాయం అడగనివారికి సాయం చేస్తూ వారికి అండగా ఉంటూ దేశంలో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ఆయన దేశంలో ఎక్కడ ఏ ప్రాంతంలోకి వెళ్తే అక్కడ ఆ ప్రాంత ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారు.
తాజాగా సోను సూద్ కు ఫిల్మ్ ఫేర్ మ్యాగజైన్ అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. కవర్ పేజీపై ఆయన ఫోటోలను ముద్రించింది. ఈ విషయం పై స్పందించిన సోనూ సూద్ తన పాతరోజులు గుర్తు చేసుకున్నారు. తాను ముంబైలో దిగిన పాతరోజులు ఇంకా గుర్తున్నాయని.. లూథియానా నుంచి డీలక్స్ ఎక్స్ ప్రెస్ రైలును ఎక్కి ముంబై రైల్వే స్టేషన్ లో దిగానని సోనూ అన్నారు. అయితే లూథియానాలో రైలు ఎక్కే సమయంలో రైల్వే స్టేషన్ లో ఫిల్మ్ ఫేర్ మ్యాగజైన్ ను కొన్నానని 20 సంవత్సరాల తర్వాత ఆ మ్యాగజైన్ కవర్ పేజీపై తాను ఉన్నానని సోనూసూద్ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. అంతేకాదు.. తన కల నెరవేరడానికి సమయం పట్టినా.. తన కల నెరవేరినట్లు చెప్పారు. సోను ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలోనూ.. బాలీవుడ్ లో ఒక సినిమాలనూ నటిస్తున్నారు.
Also Read: ఈరోజు దేశంలో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు. దాదాపు 118 రోజుల తర్వాత 31,443 కేసులు నమోదు