Renu Desai: అతను నా వెనకుంటే.. ఈ ప్రపంచంలో ఏదీ నన్ను బాధించదు. ఆసక్తికర పోస్ట్‌ చేసిన రేణు దేశాయ్‌.

Renu Desai: నటిగా, నిర్మాతగా, రైటర్‌గా ఇలా తన బహుముఖ ప్రతిభతో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు రేణు దేశాయ్‌. వృత్తి పరంగా వివిధ పనులతో బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు...

Renu Desai: అతను నా వెనకుంటే.. ఈ ప్రపంచంలో ఏదీ నన్ను బాధించదు. ఆసక్తికర పోస్ట్‌ చేసిన రేణు దేశాయ్‌.
Renu Desai
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 13, 2021 | 11:44 AM

Renu Desai: నటిగా, నిర్మాతగా, రైటర్‌గా ఇలా తన బహుముఖ ప్రతిభతో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు రేణు దేశాయ్‌. వృత్తి పరంగా వివిధ పనులతో బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు రేణు. ముఖ్యంగా పిల్లలే ప్రపంచంగా జీవిస్తోన్న రేణు దేశాయ్‌ తన చిన్నారులతో సరదాగా గడుపుతారు. కొన్ని సందర్భాల్లో రేణు చిన్నారులతో కలిసి విదేశాలకు కూడా వెళుతుంటారు. ఈ క్రమంలోనే కుమారుడు అకీరా నందన్‌, కూతురు ఆద్యాతో కలిసి దిగిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో అభిమానులతో షేర్‌ చేస్తుంటారు రేణు దేశాయ్‌. ఇక కవితలు ఎక్కువగా రాయడం అలవాటు ఉన్న ఒకప్పటి ఈ హీరోయిన్‌ తన భావాలకు అందమైన అక్షరాలను జోడిస్తూ పోస్టులు పెడుతుంటారు.

ఈ క్రమంలోనే తాజాగా కుమారుడు అకీరా నందన్‌తో దిగి ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు రేణు. అకీరా.. తన వెనకాల నిల్చొని ఉన్న సమయంలో సెల్ఫీ ఫొటో తీసుకున్న రేణు ఆ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ ఫొటోకు.. ‘ఈ అద్భుతమైన వ్యక్తి (అకీరాను ఉద్దేశిస్తూ)నా వెనకాల ఉన్నంత వరకు నన్ను ఈ ప్రపంచంలో ఏదీ బాధించలేదు’ అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్‌ జోడించారు. దీంతో ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక చాలా రోజుల తర్వాత అకీరాకు సంబంధించిన మరో ఫొటో బయటకు వచ్చింది. ఇందులో అకీరా మరింత ఆకట్టుకునేలా కనిపిస్తున్నారు. దీంతో అకీరా ఇండస్ట్రీ ఎంట్రీపై మరోసారి చర్చ జరుగుతోంది.

రేణు చేసిన పోస్టులు..

View this post on Instagram

A post shared by renu (@renuudesai)

ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల క్రితం రేణు కూతురు ఆద్యా ఫొటోను కూడా షేర్‌ చేశారు. మొహానికి పెట్టుకోవాల్సిన మాస్క్‌ను తలకు పెట్టుకున్న ఆద్య ఫన్నీ ఫొటోను రేణు షేర్‌ షేర్‌ చేశారు.

View this post on Instagram

A post shared by renu (@renuudesai)

Also Read: Filmmaker: నిక్కరు వేసుకుంటే తమ ఊరిలో నవ్వుతారని ఆ సూపర్ హిట్ మూవీని రిజెక్ట్ చేసిన డైరెక్టర్

Nani: మరో ప్రయోగం చేయనున్న నేచురల్‌ స్టార్‌.. రెండు కాళ్లు కోల్పోయిన సైనికుడిగా కనిపించనున్న నాని.

MAA Elections Vishnu: ఏకగ్రీవం చేస్తే పోటీ నుంచి తప్పుకుంటా.. మా ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మంచు విష్ణు.

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!