AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Filmmaker: నిక్కరు వేసుకుంటే తమ ఊరిలో నవ్వుతారని ఆ సూపర్ హిట్ మూవీని రిజెక్ట్ చేసిన డైరెక్టర్

Filmmaker: సినీ పరిశ్రమలో డాక్టర్ కాబోయి యాక్టర్ అయిన సౌదర్యం వంటి వారున్నారు. రచయితగా అడుగు పెట్టి.. డైరెక్టర్ మారి సక్సెస్ అందుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ వంటివారు..

Filmmaker: నిక్కరు వేసుకుంటే తమ ఊరిలో నవ్వుతారని ఆ సూపర్ హిట్ మూవీని రిజెక్ట్ చేసిన డైరెక్టర్
Director Bobby
TV9 Telugu Digital Desk
| Edited By: Surya Kala|

Updated on: Jul 12, 2021 | 5:47 PM

Share

Filmmaker: సినీ పరిశ్రమలో డాక్టర్ కాబోయి యాక్టర్ అయిన సౌదర్యం వంటి వారున్నారు. రచయితగా అడుగు పెట్టి.. డైరెక్టర్ మారి సక్సెస్ అందుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ వంటివారున్నారు. ముందు సినిమాలకు దర్శకత్వం వహించి తర్వాత నటులుగా రాణించిన దాసరి, కోడి రామకృష్ణ వంటి వారు ఉన్నారు. అయితే ఈ దర్శకుడికి ముందుగా వెండి తెరపై నటించే అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమాలో నిక్కర్ వేసుకోవాలి ఎందుకనే తమ ఊరిలో ఏడిపిస్తారు అంటూ ఆ సినిమాను రిజెక్ట్ చేశాడు.. ఆయనేమి.. ఈరోజు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా టాలీవుడ్ లో కొనసాగుతున్నాడు.. అతనే పవర్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కె.ఎస్.రవీంద్ర అలియాస్ బాబీ.

బాబీ పవర్ సినిమాతో మెగా పట్టుకుని డైరెక్టర్ గా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టాడు. అయితే బాబీ ముందు రచయిత. రవితేజ ‘బలుపు’ సహా కొన్ని సూపర్ హిట్ సినిమాలకు రచయితగా పనిచేశాడు. ఇండస్ట్రీలో రచయితగా గుర్తింపు తెచ్చుకున్నాడు. నిజానికి సినీ పరిశ్రమలో ఒక్క సినిమాకైనా దర్శకత్వం వహించాలని లక్ష్యంతోనే చాలామంది ఇండస్ట్రీలో అడుగు పెడతారు. కానీ అందుకు మినహాయింపు బాబీ, అసలు తాను ఏమి కావాలో తెలియకుండానే చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టాడట నిజానికి అల్లు అర్జున్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘గంగోత్రి’తో .. బాబీ కూడా నటుడిగా పరిచయం కావాల్సిందట. కానీ ఆ సినిమా కోసం నిక్కర్ వేసుకోవాలని చెప్పడంతో తాను అందులో నటించలేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. బాబీ మెగా స్టార్ చిరంజీవి వీరాభిమాని అన్నసంగతి తెలిసిందే.. అంతేకాదు. బాబీ ఒకప్పుడు గుంటూరులో చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు. అప్పుడు ‘ఇంద్ర’ సినిమా రిలీజ్ సమయంలో బాబీ ఊరికి రచయిత చిన్నికృష్ణ వెళ్ళాడు. అక్కడే బాబీ చిన్నక్రిష్ణకు పరిచయం అయ్యింది. చిన్ని కృష్ణ మాట వరసకు హైదరాబాద్‌కు వచ్చినపుడు కలవమని అన్నారట. ఆ మాటను మనసులో పెట్టుకున్న బాబీ నిజంగానే హైదరాబాద్ రావడం.. చిన్ని కృష్ణ వెళ్లడం జరిగింది.. అప్పుడు చిన్ని కృష్ణ ‘గంగోత్రి’ సినిమా చేస్తున్నారట..

తనకు సినిమాల్లో నటించే ఛాన్స్ ఇప్పించమని చిన్ని కృష్ణ వెంట పడటంతో తనని రాఘవేంద్రరావు దగ్గరికి పంపిచారని బాబీ అప్పటి సంగతిని గుర్తు చేసుకున్నాడు.రాఘవేంద్రరావు వద్దకు వెళ్లిన తనను చూసి.. ఓ అసిస్టెంట్‌ను పిలిచి హీరో పక్కన ఉండే పాత్ర కోసం నిక్కర్ కొలతలు తీసుకోమన్నారని.. ఐతే నిక్కర్ వేసుకుని నటిస్తే గుంటూరులో తన పరువు పోతుందన్న ఉద్దేశంతో ఆ సినిమా చేయలేదని చెప్పాడు.

దీంతో మళ్ళీ చిన్ని కృష్ణ దగ్గరకు వెళ్లడంతో.. ఏమి చేస్తావని చిన్ని కృష్ణ అడిగితె కథలు రాస్తానని బాబీ చెప్పాడు.. అంతే గంగోత్రి మూవీ కోసం ఓ సన్నివేశం రాసుకుని రమ్మనడం.. మధ్యాహ్నానికే బాబీ ఆ సీన్ రాసి ఇచ్చేయడంతో నటుడు కావాల్సిన బాబీ రచయితగా మారాడు. బలుపు సినిమా చేస్తున్న సమయంలో ఆ సినిమా హిట్ అయితే రవితేజ నెక్స్ట్ మూవీకి డైరెక్షన్ చేసే అవకాశం ఇస్తానని అన్నాడు.. అలా రవితేజ తో పవర్ సినిమా కు దర్శకత్వం వహించే అవకాశం దక్కించుకున్నాడు. రచయిత నుంచి దర్శకుడిగా లైఫ్ ఇచ్చింది రవితేజ అంటూ.. తన సినీ జర్నీని గుర్తు చేసుకున్నాడు బాబీ

Also Read: కరోనా నిబంధనల నడుమ సాగుతున్న పూరి రథ యాత్ర.. ఏ దేవాలయాలకు లేని స్పెషల్ ఈ యాత్ర సొంతం.. (photo gallery)