AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nani: మరో ప్రయోగం చేయనున్న నేచురల్‌ స్టార్‌.. రెండు కాళ్లు కోల్పోయిన సైనికుడిగా కనిపించనున్న నాని.

Nani: కెరీర్‌ తొలి నాళ్ల నుంచి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు యాక్టర్‌ నాని. తన సహజ నటనతో అభిమానులను ఆకట్టుకునే నాని నేచురల్ స్టార్‌...

Nani: మరో ప్రయోగం చేయనున్న నేచురల్‌ స్టార్‌.. రెండు కాళ్లు కోల్పోయిన సైనికుడిగా కనిపించనున్న నాని.
Nani
Narender Vaitla
|

Updated on: Jul 13, 2021 | 9:24 AM

Share

Nani: కెరీర్‌ తొలి నాళ్ల నుంచి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు యాక్టర్‌ నాని. తన సహజ నటనతో అభిమానులను ఆకట్టుకునే నాని నేచురల్ స్టార్‌ అనే ట్యాగ్‌కు సరిగ్గా సరిపోతారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నానిని స్క్రీన్‌పై చూస్తున్నంత సేపు. మనల్ని మనం తెరపై చూసుకుంటున్న భావన కలుగుతుందనడంలో అతిశయోక్తి ఉండదేమో. ఈ క్రమంలోనే నాని హీరోగా వచ్చిన ‘జర్సీ’ చిత్రం ఎంతటి సంచలనం సృస్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఇటీవల ఈ సినిమా చూసిన ఓ ఆస్ట్రేలియన్‌ జర్నలిస్ట్‌. నానిని పొగుడుతూ ట్వీట్‌ చేశారంటేనే నాని యాక్టింగ్‌ స్కిల్‌ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ‘జర్సీ’లో నానిలోని ట్యలెంట్‌ను పూర్తిగా బయటకు తీసిన దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి తాజాగా మరో సారి నానితో చేతులు కలిపినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. గౌతమ్‌ ఈసారి నానితో బయోపిక్‌ను తెరకెక్కించే పనిలో పడ్డట్లు సమాచారం. ‘జర్సీ’లో నానిని క్రికెటర్‌గా చూపించిన గౌతమ్‌.. ఈసారి సైనికుడిగా చూపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. యుద్ధంలో రెండు కాళ్లు కోల్పోయిన ఓ సైనికుడి నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని ప్రచారం జరుగుతోంది. పాన్‌ ఇండియా నేపథ్యంలో తెరకెక్కించనున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే బ్యాగ్రౌండ్‌ వర్క్‌ కూడా ప్రారంభమైనట్లు టాక్‌. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే నాని ప్రస్తుతం.. ‘టక్‌ జగదీశ్‌’, ‘శ్యామ్‌ సింగరాయర్‌’ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలు పూర్తికాగానే గౌతమ్‌తో సినిమా మొదలు కానుంది. మరి ఈ ప్రయోగాత్మక పాత్రలో నాని ఏ స్థాయికి చేరుకుంటారో చూడాలి.

Also Read: MAA Elections Vishnu: ఏకగ్రీవం చేస్తే పోటీ నుంచి తప్పుకుంటా.. మా ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మంచు విష్ణు.

Shruthi Haasan: భాయ్‌ఫ్రెండ్ శంతను హజరికా తో వంటిట్లో ఎంజాయ్ కమల్ డాటర్.. వీడియో వైరల్

క్లామాక్స్ కు చేరిన గని మూవీ షూటింగ్…మరో హిట్ కన్ఫామ్ అంటున్న అభిమానులు