Priyanka Chopra: పదేళ్లలో ప్రియాంక విడాకులు తీసుకుంటుంది.. బాలీవుడ్ నటుడు షాకింగ్ కామెంట్స్.. మండిపడుతున్న నెటిజన్లు..

Priyanka Chopra: ఒకిరికి ఒకరు నచ్చకపోయినా.. వైవాహిక జీవితంలో చిన్న ఒడిదుడుకులు ఎదురైనా.. నేరుగా విడాకులు తీసుకుంటున్నారు ఇప్పటి తారలు. అడ్జస్ట్ అవ్వడం కంటే.. ఎవరి దారి వారు చూసుకోవడం బెటర్ అనే సిద్ధాంతాన్ని

Priyanka Chopra:  పదేళ్లలో ప్రియాంక విడాకులు తీసుకుంటుంది.. బాలీవుడ్ నటుడు షాకింగ్ కామెంట్స్.. మండిపడుతున్న నెటిజన్లు..
Priyanka Chopra
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Rajitha Chanti

Updated on: Jul 12, 2021 | 5:57 PM

Priyanka Chopra: ఒకిరికి ఒకరు నచ్చకపోయినా.. వైవాహిక జీవితంలో చిన్న ఒడిదుడుకులు ఎదురైనా.. నేరుగా విడాకులు తీసుకుంటున్నారు ఇప్పటి తారలు. అడ్జస్ట్ అవ్వడం కంటే.. ఎవరి దారి వారు చూసుకోవడం బెటర్ అనే సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారు సినీ ప్రముఖులు. భాషతో సంబంధం లేకుండా.. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ఇలా ప్రతి పరిశ్రమలోనూ విడాకులు తీసుకోవడం సర్వ సాధరణంగా మారిపోయింది. ఇక విడాకుల తంతు ఇతర ఫిల్మ్ ఇండస్ట్రీల కంటే బాలీవుడ్‏లో కాస్తా ఎక్కువగా జరుగుతుంటుంది. ఇప్పటికే అక్కడ హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్, సంజయ్ దత్, మలైకా అరోరా, అమీర్ ఖాన్ ఇలా ఎంతోమంది సెలబ్రెటీలు విడాకులు తీసుకున్న వాళ్లే. ఇక ఇటీవల అమీర్ తన రెండవ భార్య కిరణ్ రావుకు 15 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత విడాకులు ఇస్తున్నట్లుగా ప్రకటించడంతో బాలీవుడ్‏లో తీవ్ర దూమారం రేపిన సంగతి తెలిసిందే. ఇక వీరి విడాకుల అంశంపై బాలీవుడ్ తారలు సైతం తమదైన స్టైల్లో స్పందించిన సంగతి తెలిసిందే. తన భార్య కళ్లజోడు మొహం బోర్ కొట్టిందని.. అందుకే అమీర్ ఖాన్ విడాకులిచ్చాడని సినీ క్రిటిక్, బాలీవుడ్ నటుడు కమల్ ఆర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా కమల్ ఆర్ ఖాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. “ప్రియాంకకు ఆమె భర్త నిక్‌ జోనస్‌ మరో 10 ఏళ్లలో విడాకులు ఇవ్వడం తథ్యం” అంటూ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశాడు కేఆర్‏కే. అంతేకాదు.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్‏ల సంతానానికి సరైన పేరు పెట్టనందున వాళ్లు భవిష్యత్తులో మంచి నటులుగా రామించలేరని జోస్యం చెప్పాడు. బాలీవుడ్‏లో ఓ నటుడికి అతడి తండ్రి మరణించాకే సరైన గుర్తింపు దక్కుతుందని తెలిపాడు. అయితే ఆ నటుడెవరనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ఈ నటుడు చేసిన ట్వీట్స్ పై సోషల్ మీడియా వేదికగా మండి పడుతున్నారు నెటిజన్లు.. వాళ్లు విడిపోవాలని కోరుకునే హక్కు నీకెక్కడిదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టార్ల వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడకపోతేనే మంచిదని సూచిస్తున్నారు. ‘ప్రిడిక్షన్‌: అందరి గురించి నోటికొచ్చినట్లు మాట్లాడే కేఆర్‌కేను పబ్లిక్‌లో చితక్కొడుతారు’, ‘మంచి కోరుకోకున్నా పర్లేదు కానీ చెడుగా మాట్లాడకు’, ‘మీరు ప్రతిదాంట్లో తలదూర్చడం మానేస్తే బెటర్‌’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ట్వీట్స్..

Also Read: Ariyana Glory: నువ్వు ప్రేమలో ఉన్నావా ? ఆసక్తికర సమాధానమిచ్చిన అరియానా.. ఇప్పుడే ఎక్కువ ఇష్టమంటూ..

Narappa: అఫీషియల్ అనౌన్స్ వచ్చేసింది.. అమెజాన్ ప్రైమ్‏లోనే వెంకటేష్ “నారప్ప”… విడుదల ఎప్పుడంటే..