AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Narappa: అఫీషియల్ అనౌన్స్ వచ్చేసింది.. అమెజాన్ ప్రైమ్‏లోనే వెంకటేష్ “నారప్ప”… విడుదల ఎప్పుడంటే..

విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన లెటేస్ట్ చిత్రం "నారప్ప". ఇందులో వెంకీ సరసన ప్రియమణి హీరోయిన్‏గా నటించగా.. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. తమిళ సూపర్ హిట్ మూవీ "అసురన్ "కు రీమేక్‏గా తెరకెక్కుతున్న

Narappa: అఫీషియల్ అనౌన్స్ వచ్చేసింది.. అమెజాన్ ప్రైమ్‏లోనే వెంకటేష్ నారప్ప... విడుదల ఎప్పుడంటే..
Narappa
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 12, 2021 | 4:41 PM

Share

విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన లెటేస్ట్ చిత్రం “నారప్ప”. ఇందులో వెంకీ సరసన ప్రియమణి హీరోయిన్‏గా నటించగా.. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. తమిళ సూపర్ హిట్ మూవీ “అసురన్ “కు రీమేక్‏గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇందులో వెంకీ ఢిపరెంట్ లుక్‏లో కనిపించనున్నారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ కాగా.. విడుదలకు కరోనా అడ్డంకిగా నిలించింది. దీంతో సినిమాను విడుదలను వాయిదా వేసుకుంది చిత్రయూనిట్. ఇక అప్పటినుంచి ఈ సినిమా రిలీజ్ విషయంలో కన్ఫ్యూజన్ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తారా ? లేకా నేరుగా థియేటర్లలో రిలీజ్ చేస్తారా ? అన్నది ఇప్పటికీ తెలియలేదు. అయితే గత కొన్ని రోజులుగా నారప్ప సినిమాను అమెజాన్ ప్రైమ్‏లో విడుదల కాబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. మరోవైపు నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీలకు అమ్మవద్దని తెలంగాణ ఫిలింఛాంబర్ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా “నారప్ప” సినిమా విడుదలపై కన్ఫ్యూజన్ రివీల్ అయ్యింది.

తాజాగా వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించిన “నారప్ప” సినిమా అమెజాన్ ప్రైమ్‏లో జూలై 20న స్ట్రీమింగ్ కానున్నట్లుగా… సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‏లోని ఒక గ్రామానికి చెందిన రైతు జీవితంలో జరిగిన ఒడిదుడుకుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు శ్రీకాంత్ అడ్డాల. తమిళ్‍లో బ్లాక్ బస్టర్ అందుకున్న అసురన్ సినిమా తెలుగులో కూడా అదే రేంజ్‏లో హిట్ అవుతుందా లేదా అనేది చూడాలి. మొత్తానికి గత కొద్ది రోజులుగా నారప్ప విడుదల విషయంలో నెలకొన్న కన్ఫ్యూజన్‏ను తొలగించింది అమెజాన్ ప్రైమ్.

ట్వీట్..

Also Read: Ram Gopal Varma: వర్మ-నాగార్జున సినిమాపై సిరా శ్రీ కామెంట్.. రచయిత మాటల గారడీకి దండం పెట్టిన ఆర్జీవి..

Anaya Soni: కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న బుల్లితెర నటి.. సాయం చేయాలంటూ కన్నీటి పర్యంతం..

Follow Us
IND vs ENG: ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌కు ముందు గంభీర్ సంచలన నిర్ణయం..
IND vs ENG: ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌కు ముందు గంభీర్ సంచలన నిర్ణయం..
ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం
ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం
‘ఉపాధి హామీ’ రద్దు.. నేటి నుంచి కొత్త చట్టం!
‘ఉపాధి హామీ’ రద్దు.. నేటి నుంచి కొత్త చట్టం!
ఇకపై ప్రతీ నెల సన్న బియ్యం పంపిణీ.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు..
ఇకపై ప్రతీ నెల సన్న బియ్యం పంపిణీ.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు..
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?