Ram Gopal Varma: వర్మ-నాగార్జున సినిమాపై సిరా శ్రీ కామెంట్.. రచయిత మాటల గారడీకి దండం పెట్టిన ఆర్జీవి..

రామ్ గోపాల్ వర్మ.. ఎప్పుడు ఏ కామెంట్ చేస్తారు.. ఏ వివాదాన్ని తెర పైకి తెస్తారో అస్సలు అర్థంకాదు.. సినిమాల నుంచి రాజకీయ విషయాలపై తనదైన స్ట్రైల్లో కామెంట్స్ చేస్తూ.. కాంట్రావర్సీకి దారి తీస్తుంటారు.

Ram Gopal Varma: వర్మ-నాగార్జున సినిమాపై సిరా శ్రీ కామెంట్.. రచయిత మాటల గారడీకి దండం పెట్టిన ఆర్జీవి..
Ram Gopal Varma
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 12, 2021 | 3:41 PM

రామ్ గోపాల్ వర్మ.. ఎప్పుడు ఏ కామెంట్ చేస్తారు.. ఏ వివాదాన్ని తెర పైకి తెస్తారో అస్సలు అర్థంకాదు.. సినిమాల నుంచి రాజకీయ విషయాలపై తనదైన స్ట్రైల్లో కామెంట్స్ చేస్తూ.. కాంట్రావర్సీకి దారి తీస్తుంటారు. ఇక వర్మ ఎక్కువగా అమ్మాయిల గురించి చేసే కామెంట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడూ సోషల్ మీడియాలో ఆక్టివ్‏గా ఉండే వర్మ.. తాజాగా తన చిన్నతనంకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతేకాదు.. తన చిన్నతనం నుంచి యవ్వనంలో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ.. తనపై తనే సెటైర్లు వేసుకున్నారు. అయితే ఈ ఫోటోలపై పాటల రచయిత, మాటల గారడి సృష్టించడంలో దిట్ట అియన సిరా శ్రీ కామెంట్ చేశారు..

ఆర్జీవి సినిమాలకు సిరా శ్రీ ఎక్కువగానే పనిచేశారు. ఇక పాటలు, మాటల్లో సిరా శ్రీ తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అయిత వర్మ తన గతానికి సంబంధించిన పాత ఫోటోలను షేర్ చేయగా.. అందులో చిన్నతనంలో సైకిల్ ఎక్కి దిగిన ఫోటో కూడా ఉంది. అలాగే అది పంజాగుట్టు కాలనీ అని చెప్పుకొచ్చారు వర్మ. అయితే సైకిల్ ఎక్కి దిగిన వర్మ ఫోటోపై సిరా శ్రీ కామెంట్ చేశారు. “మీరు సైకిల్ మీద కూర్చుంటే అది పిక్ అయింది.. అదే నాగార్జునతో సైకిల్ చైన్ లాగిస్తే ఎపిక్ అయింది” అని తన మాటల గారడీని ప్రయోగించారు. ఇక ఎప్పుడూ నెట్టింట్లో యాక్టివ్‏గా ఉండే వర్మ సిరా శ్రీ కామెంట్‏పై స్పందించారు. పదాలను అల్లడం, ఇలా కూర్చడంలో నువ్ మాస్టర్‏వి సిరా శ్రీ అని దండం పెడుతున్న ఎమోజినీ వర్మ షేర్ చేశారు. ఇక వీరిద్దరికి సంబంధించిన ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. వర్మ సినిమాలు ఇప్పుడు స్పార్క్ ఓటీటీ సంస్థలో విడుదల కానున్నాయి.

ట్వీట్..

Also Read: Damodara Rajanarsimha: కాంగ్రెస్ పార్టీ నిరసన ప్రదర్శనలో అపశృతి.. ఎడ్లబండిపై నుంచి కిందపడ్డ మాజీ డిఫ్యూటీ సీఎం

Anaya Soni: కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న బుల్లితెర నటి.. సాయం చేయాలంటూ కన్నీటి పర్యంతం..

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..