Anaya Soni: కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న బుల్లితెర నటి.. సాయం చేయాలంటూ కన్నీటి పర్యంతం..

బుల్లితెర నటి ఆయన సోని కొంతకాలంగా కిడ్ని సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. హిందీలో ప్రసారమైన "నామ్‏కరన్" సీరియల్ ద్వారా అయన గుర్తింపు పొందింది. ప్రస్తుతం తనకు రెండు కిడ్నీలు పనిచేయడం లేదని..

Anaya Soni: కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న బుల్లితెర నటి.. సాయం చేయాలంటూ కన్నీటి పర్యంతం..
Namakaran Anaya Soni
Follow us

| Edited By: Rajeev Rayala

Updated on: Jul 12, 2021 | 3:12 PM

బుల్లితెర నటి ఆయన సోని కొంతకాలంగా కిడ్ని సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. హిందీలో ప్రసారమైన “నామ్‏కరన్” సీరియల్ ద్వారా అయన గుర్తింపు పొందింది. ప్రస్తుతం తనకు రెండు కిడ్నీలు పనిచేయడం లేదని.. సాయం చేయాలని కోరుతూ కన్నీటి పర్వంతం అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతవారం ఆమె తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు ఆమెను ముంబైలోని హూలీ స్పిరిట్ ఆసుపత్రిలో చెర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే ట్రీట్‏మెంట్ చేయించుకోవడానికి కూడా డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలిపింది అనయ.

ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనయ మాట్లాడుతూ.. “2015 నుంచి నేను ఒక్క కిడ్నీతో మాత్రమే జీవిస్తున్నాను. నా రెండు కిడ్నీలు 6 సంవత్సరాల క్రితం ఫెయిల్ అయ్యాయి. ఆ సమయంలో మా నాన్న నాకు తన కిడ్నీని దానం చేశారు. కానీ ఇప్పుడు ఈ కిడ్నీ పనిచేయడం లేదు. నాకు ఇప్పుడు కిడ్నీ మార్పిడి చేయాల్సిందే. నేను నామ్‏కరన్, క్రైమ్ పెట్రోల్ వంటి సీరియల్స్ చేస్తున్న సమయంలో ఇలాంటి పరిస్థితులు వస్తాయనుకోలేదు. ప్రస్తుం మా దగ్గర ఉన్న డబ్బులన్ని అయిపోయాయి. మా అమ్మకు క్లాత్ స్టోర్ ఉండేది. కానీ అది ఇప్పుడు కాలిపోయింది. బట్టలు, మెషీన్లు ఇలా అన్నీ బూడిదయ్యాయి. నిజం చెప్పాలంటే మేము ఇప్పుడు తినడానికి కూడా తిండి లేని దయనీయ పరిస్థితిలో ఉన్నాము. ఆలాగే నాకింకా డయాలిసిస్‌ కూడా మొదలు పెట్టలేదు. కిడ్నీ దాత కోసం ఎదురు చూస్తున్నాం. దయచేసి మాకు సాయం చేయండంటూ” కోరింది అనయ.

గతవారం అనయ సాయం కోరుతూ.. తన ఆరోగ్య పరిస్థితికి గురించి చెబుతూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఆమె ఎవరైనా సాయం చేయాలంటూ.. Name :- Sheetal t . soni Bank name :- Axis bank Branch:- malad west Ac no. 915010026602327 IFS code:- UTIB0000062 Pan no . :- EJYPS7926A upi I’d :- sheetal.soni2@axisbank వివరాలను పోస్ట్ చేసింది. నామ్‏కరన్ సీరియల్‏తోపాటు… ఇష్క్ మెయిన్, మార్జావన్, అదాలత్ వంటి సీరియల్స్ ద్వారా గుర్తింపు పొందింది. టేక్ ఇట్ ఈజ్, హై అప్నా దిల్ తోహ్ అవారా వంటి సినిమాల్లోని నటించింది అనయ.

ట్వీట్..

View this post on Instagram

A post shared by ANAYA T SONI (@theanayasoni)

Also Read: Shruti Haasan: బాయ్‏ఫ్రెండ్‏తో కలిసి వంటగదిలో శ్రుతిహాసన్ రచ్చ.. కలిసి తినేవారే కలిసుంటారు అంటూ..

Post Office: సొంతూరులో వ్యాపారం చేయాలనుకుంటున్నారా? పోస్టాఫీస్‌ ఫ్రాంచైజ్‌ గురించి తెలుసుకోండి. తక్కువ పెట్టుబడితో.

అదిరిపోయిన ట్రైలర్‌ ఒక్కొక్కరికీ గూస్‌ బంప్సే | వావ్! వాటే సినిమా
అదిరిపోయిన ట్రైలర్‌ ఒక్కొక్కరికీ గూస్‌ బంప్సే | వావ్! వాటే సినిమా
ఏపీకి తుఫాను ముప్పు.. ఐఎండీ హెచ్చరిక.! నాలుగు రోజుల పాటు వర్షాలు.
ఏపీకి తుఫాను ముప్పు.. ఐఎండీ హెచ్చరిక.! నాలుగు రోజుల పాటు వర్షాలు.
నయనతారకు అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్‌ ఇచ్చిన విఘ్నేష్‌ శివన్‌.
నయనతారకు అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్‌ ఇచ్చిన విఘ్నేష్‌ శివన్‌.
చేపల వేటకు వెళ్ళిన బోటులో అగ్నిప్రమాదం.! బోటులో 11 మంది..
చేపల వేటకు వెళ్ళిన బోటులో అగ్నిప్రమాదం.! బోటులో 11 మంది..
వర్షాల ధాటికి మూతబడ్డ సబ్ వేలు.. పలు రైళ్లు రద్దు.
వర్షాల ధాటికి మూతబడ్డ సబ్ వేలు.. పలు రైళ్లు రద్దు.
మళ్లీ పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. సిలిండర్‌పై రూ.21లు పెంపు.
మళ్లీ పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. సిలిండర్‌పై రూ.21లు పెంపు.
హమాస్‌ను అంతం చేయాలని ప్రమాణం చేశాను..: ఇజ్రాయెల్ పీఎం.
హమాస్‌ను అంతం చేయాలని ప్రమాణం చేశాను..: ఇజ్రాయెల్ పీఎం.
Telangana: మందుపాతరను నిర్వీర్యం చేసిన భద్రతా బలగాలు
Telangana: మందుపాతరను నిర్వీర్యం చేసిన భద్రతా బలగాలు
తన టీ షర్ట్‌తో అభిమాని బైక్‌ తుడిచి ఆటోగ్రాఫ్‌ ఇచ్చిన ధోనీ.
తన టీ షర్ట్‌తో అభిమాని బైక్‌ తుడిచి ఆటోగ్రాఫ్‌ ఇచ్చిన ధోనీ.
వైరల్‌ అవుతున్న కట్నకానుకల వీడియో. కారు నుంచి కిచెన్ సామాన్ల వరకు
వైరల్‌ అవుతున్న కట్నకానుకల వీడియో. కారు నుంచి కిచెన్ సామాన్ల వరకు