నా మెడలో తాళి ఉండగా నీ మెడలో తాళి పడనివ్వను అంటున్న దీప.. తనకు న్యాయం చేయమని జ్యోతిరెడ్డిని ఆశ్రయించిన మోనిత

Karthiak deepam: కార్తీక దీపం సీరియల్ ఈరోజు 1089 వ ఎపిసోడ్ లోకి అడుగు పెట్టింది. ఈరోజు హైలెట్స్ ఏమిటో చూద్దాం.. ఇంక ఊరుకోను.. కడుపులో ఉన్నవాడికోసం మనసులో ఉన్నవాడికోసం నేను క్షమిస్తూ రావడమే..

నా మెడలో తాళి ఉండగా నీ మెడలో తాళి పడనివ్వను అంటున్న దీప.. తనకు న్యాయం చేయమని జ్యోతిరెడ్డిని ఆశ్రయించిన మోనిత
Karthika Deepam
Follow us

| Edited By: Surya Kala

Updated on: Jul 12, 2021 | 10:20 AM

Karthiak deepam: కార్తీక దీపం సీరియల్ ఈరోజు 1089 వ ఎపిసోడ్ లోకి అడుగు పెట్టింది. ఈరోజు హైలెట్స్ ఏమిటో చూద్దాం.. ఇంక ఊరుకోను.. కడుపులో ఉన్నవాడికోసం మనసులో ఉన్నవాడికోసం నేను క్షమిస్తూ రావడమే నేను చేసిన తప్పు.. ప్రియమణి ని కూడా ఎంక్వైరీ చేశాడంటే.. నేను ఊరుకోకూడదు.. మోనిత వాయిస్ ఒక్కటే సరిపోదు.. ఇంకోవాయిస్ కావాలి.. అనుకుంటుంది.

శ్రావ్య బావగారు మా అమ్మదగ్గరకి వెళ్లి క్షమించమని అడిగారట.. నన్ను నమ్మి సపోర్ట్ చేసినందుకు బావగారు మా అమ్మని అమ్మలా కనిపిస్తున్నారు అని అన్నారట.. మా అమ్మ మీ కాపురం ఎలాగైనా నిలబెడతాను అన్నాడట అంటే.. ఆదిత్య వాళ్ళ అన్నయ్యతో వచ్చిన మార్పుకి సంతోష పడతాడు. నేను మొదట నమ్మలేదు.. మా అమ్మమ్మ మీద ఒట్టు వేసేసరికి నమ్మను అంటే… ఈ విషయం మా వదినకు చెప్పాలి అంటాడు ఆదిత్య.

థాంక్స్ దీప ఆ గీతలను చెరిపివేసినందుకు థాంక్స్ ఆలాగే నా తలరాతను మార్చు దీప అంటే.. నేను దేవతను కాను అంటుంది దీప.. నాకు ఇంకా అర్ధంకాని విషయం ఒకటి ఉంది.. అడగొచ్చా అంటే.. నా పర్మిషన్ అడుగు దీప. అంటాడు.. ఒకప్పుడు నా కడుపులో పెరుగుతున్న పిల్లలకు నేను తండ్రిని కాను అంత గట్టిగా అరిచారు.. మరి ఇప్పుడు మోనిత విషయంలో అలా ఎందుకు చేయలేకపోతున్నారు.. అంటే న మీదకంటే.. మీకు మోనిత మీదనే ఎక్కువ నమ్మకం ఉందా .. లేక మీ మీద మీకు నమ్మకం లేదనా ఇదే నాకు అర్ధం కావడం లేదు. దీప సంగతి గతం.. మోనిత సంగతి వాస్తవం.. నేను కాపురం కోసం ఆరాటపడ్డాను. మోనిత మిమ్మల్ని ఎలాగైనా దక్కించుకోవాలని పోరాటం చేస్తుంది. నా ఇంట్లో మోనిత గీతలే భరించలేని నేను.. మోనిత ను నా సవతిగా తెస్తే ఎలా భరిస్తాను.. నిస్తారంగా నా జీవితం ఇలా గడిచిపోయింది. ఇంకా ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను.. అంటే.. నేను ఆ జీవితం నీకు రానివ్వను అంటే.. అది మీ వల్లకాదని..మీ ముఖమే చెబుతుంది. మీ చాలా సార్లు మోనిత మనిద్దరిని విడదీయడానికి కుట్రలు చేస్తుందని చెప్పి చూశాను.. అప్పుడు మీరు నమ్మలేయూద్.. ఇప్పటికి మీరు మోనిత చెప్పింది నమ్ముతూనే ఉన్నారు. కారణం ఇది నమ్మితీరాల్సిన విషయం అని మీ మనసు చెబుతుంది. విలువ ఉన్న మనిషితో కాదు.. విలువలున్న మనిషితో సావాసం చేయాలని అందుకే పెద్దలు చెబుతారు. మోనిత తో మీరు హద్దులు మీరు చేసిన స్నేహమే గుణపాఠం చెబుతుంది. తప్పు ఒప్పులను కాలం నిర్ణయిస్తుంది. కాలం జవాబు చెప్పే రోజు దగ్గరకు వచ్చింది. అది కాలానికే వదిలేద్దాం.. పిల్లలతో సరిగ్గా ఉండడంలేదు.. ఈరోజు ఉన్నట్లు పిల్లలతో సంతోషంగా ఉండండి.. అంటుంది దీప.

మోనిత రెడీ అయ్యి బయటకు వెళ్తుంటే.. ప్రియమణి కాఫీ తాగమని అడుగుతుంది.. అక్కా అంటూ కన్నీరు పెడుతుంది. ఆవేశం వద్దు నా మాట విను అంటూ మోనిత ని కౌగలించుకుని కన్నీరు పెడుతుంది. మనం ఏమి తప్పు చేశామని ఏడవలి..మనం ఏడవడం కాదు.. వాళ్ళని ఏడిపిద్దాం.. ఇప్పుడు ఏమిటి కాఫీ తాగి వెళ్ళాలి.. అంటే.. అవును అని ప్రియమణి కాఫీ తేవడానికి వెళ్తుంది.

కార్తీక్ పిల్లలని తీసుకుని బయటకు వెళ్తాడు.. మనం సంతోషంగా ఎప్పుడూ ఇలాగె ఉండాలి డాడీ అంటారు పిల్లలు. ఇప్పుడున్నాను కదా ఇదే నిజం.. ఇలాగె ఉంటాం.. వంటలక్క భర్త డాక్టర్ బాబుని.. అంటే.. నాకు మళ్ళీ అర్ధం కాలేదు అంటుంది హిమ.. అన్ని మనకు అనుకూలంగా జరిగితే.. అందరం ఇంకా సంతోషంగా ఉంటాం.. అంటే.. నాన్నమ్మ లేదుగా డాడీ మరి ఎందుకు వెళ్తున్నాం అంటే.. నా కోసం కాదు మీ కోసం..మీరు దీపు గాడితో ఆడుకోండి.. నేను మధ్యాహ్నం వచ్చి లంచ్ కి రెస్టారెంట్ కు తీసుకుని వెళ్తా అంటాడు.. అవును నాన్న అమ్మ గోడమీద గీతలను చెరిపివేసింది ఎందుకు నాన్నా అంటుంది శౌర్య. గోడమీద గీతలు మరకల్లా కనిపిస్తున్నాయని… మన భవిష్యత్ లో ఆ మరకల్లాంటివి ఉండకూడనే మీ అమ్మ చెరిపివేసింది అంటే..హిమ ఇది నాకు అర్ధం కాలేదు.. అంటే.. మీరు చిన్నపిల్లలు.. మీకు అర్ధం కాదు.. మన భవిష్యత్ బాగుండేలా చేయడానికి నేను మీ అమ్మ ఉన్నాం అంటాడు.

దీప ఇంట్లో పనిచేసుకుంటుంటే.. మోనిత వస్తుంది.. అప్పటికి పిల్లలకి చెబుతూనే ఉన్నా తలుపులు తీసి ఉంచితే వీధి కుక్కలు ఇంట్లోకి వస్తాయి అని ..అంటూ… అటు తిరిగి ఉన్నా నువ్వు ఎలా వచ్చావని నాకు తెలిసిందఅని ఆశ్చర్య పోస్తున్నావా ..నాకు వళ్ళంతా కళ్ళే.. నువ్వు వేసే అడుగుల్ని నేను గమనిస్తూనే ఉంటా అంటే.. మోనిత లోపలి వచ్చి.. అరే నేను గీసిన గీతల్ని చెరిపేసినా.. అవి ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. మన కార్తీక్ అంటూ నేను సాయం చేయనా.. తప్పేముందు మనపని కదా.. ఏదైనా సరే సగం సంగం పంచుకోవాల్సిన వాళ్ళం కదా.. అని మోనిత అంటే.. నీ బాడీలో సగం మాత్రమే బయటకు వెళ్లాలని ఉంటె.. ఇలాగె వాగుతూ ఉండు.. అంటే అదేంటి దీప అలా అంటావు.. నా మొగుడు నాకే సొంతం అన్నది పాత మాట.. ఇప్పడు ట్రెండ్ మార్చా.. నీ మొగుడు నాకు సొంతం అంటూ మార్చాను నేను.. అంటే.. నీ మాటల్లో తెగింపు ధ్వనించినా నీ కళ్ళలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మోనిత మాట అంటే గజగజగా వణికిపోవాలి.. అంటే.. మా ఇంట్లో కూర్చోవడానికి కూడా అర్హత లేనిదానివి.. అలాంటిది మా ఇంటికి కోడలుగా వస్తా అంటే ఎలా చూస్తూ ఉరుకుంటాను.. ఈ చేతి దెబ్బ తింటే.. పట్టపగలు నక్షత్రాలు కనిపిస్తాయి అంటుంది. నాకు నక్షత్రాలు కనిపిస్తాయి… నేను కార్తీక్ పెళ్లి చేసుకుంటే.. నీకు జీవితం చీకటే అంటుంది.. అదా నీ దైర్యం.. సరే సరే అలాగే కానివ్వు.. వెళ్లి పెళ్ళికి మట్టెలు మంగళసూత్రాలు కొనుక్కో.. దండాలు కొన్నుకోకు.. వాడిపోతాయి.. జీలకర్ర బెల్లం అవసరం లేదు.. ఎందుకంటే రిజిస్టర్ పెళ్లి కదా..అయితే నీ పెళ్ళికి మా అయన నీ పక్కన లేకపోతె.. గుండెపోటు వస్తే.. మా అయన నీకు ఫ్రీగా వైద్యం చేస్తాడు లే.. అనాధలకు, పేదవారికి ఉచితంగా వైద్యం చేసే దేశోద్ధారకుడు కదా.. ఎన్నో ఆశలు పెట్టుకున్నావు పెళ్లి కోసం.. అయినా సరే నీ పెళ్లి జరగదు. ఒకవేళ నా మొగుడుతో నీ పెళ్లి జరుగుతుందని నేను నమ్మితే.. ఇలా నేను ఇంట్లో డబ్బాలు అవి తుడుచుకుంటూ ఉంటానా.. నీ అంతు చూడడానికి బయలు దేరేదానిని కదా అంటే.. మోనిత ఏమి చూసుకుని నీ దైర్యం అని ప్రశ్నిస్తుంది. ఈ తాళి.. ఈ తాళి నామెడలో ఉండగా నేను నీ మేడలో ఎలా తాళి పడనిస్తాను అంటుంది దీప. అంటే మీ ఆయన ఏ తప్పు చేయలేదని అమ్ముతున్నావా అంటే..నువ్వు తప్పుల మీద తప్పులు చేయగలిగే అసమర్ధురాలివని నమ్ముతున్నా అంటుంది.. నా భర్త సంస్కారవంత, మర్యాదస్తుల, గౌరవనీయమైన కుటుంబంలో పుట్టినవాడు.. తల్లిదండ్రి, చెల్లి తమ్ముడు ఇలా ఒక గౌరవంతో పుట్టినవాడు.. నీలా చిత్తుకాగిమలా పెరిగిన వాడు కాదు..నీకు తలవచాల్సిన ఖర్మ నా భర్తకు లేదు అంటుంది.. మోనిత నాకు న్యాయం చేయండి అంటూ.. ఓ సరికొత్త (జ్యోతిరెడ్డి) క్యారెక్టర్ ని ఆశ్రయించింది.

Also Read:

దేశంలో కొత్తగా 37,154 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా

Latest Articles
వృద్దాప్య పెన్షన్లు, కూటమి మేనిఫెస్టోపై వైఎస్ భారతి స్పందన..
వృద్దాప్య పెన్షన్లు, కూటమి మేనిఫెస్టోపై వైఎస్ భారతి స్పందన..
షూటింగ్ చూద్దామని వెళ్తే చిరంజీవిగారు నాతో ఆ పని చేయించారు..
షూటింగ్ చూద్దామని వెళ్తే చిరంజీవిగారు నాతో ఆ పని చేయించారు..
గర్భిణీలు మామిడి పండ్లు తినొచ్చా.? నిపుణులు ఏమంటున్నారంటే..
గర్భిణీలు మామిడి పండ్లు తినొచ్చా.? నిపుణులు ఏమంటున్నారంటే..
ఈ టిప్స్ పాటించారంటే.. తెల్లదుస్తులు ఎప్పుడూ కొత్తవాటిలా ఉంటాయి..
ఈ టిప్స్ పాటించారంటే.. తెల్లదుస్తులు ఎప్పుడూ కొత్తవాటిలా ఉంటాయి..
మీ వాట్సాప్ రంగు మారిందా? కారణమిదే..
మీ వాట్సాప్ రంగు మారిందా? కారణమిదే..
'ఏంటీ దారుణం! వీళ్లను మనుషుల్లా ఇంకెప్పటికి చూస్తారు..?' వీడియో
'ఏంటీ దారుణం! వీళ్లను మనుషుల్లా ఇంకెప్పటికి చూస్తారు..?' వీడియో
సవాల్... ఇక్కడ ఎన్ని పప్పీస్ ఉన్నాయో చెప్పలగలరా..?
సవాల్... ఇక్కడ ఎన్ని పప్పీస్ ఉన్నాయో చెప్పలగలరా..?
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హన్సిక హరర్ మూవీ..ఎక్కడ చూడొచ్చంటే?
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హన్సిక హరర్ మూవీ..ఎక్కడ చూడొచ్చంటే?
బీజేపీ అభ్యర్థిని భయపెడుతున్న ఓటింగ్ మెషీన్.. అసలు విషయం తెలిస్తే
బీజేపీ అభ్యర్థిని భయపెడుతున్న ఓటింగ్ మెషీన్.. అసలు విషయం తెలిస్తే
ఈ నెలలో స్మార్ట్ ఫోన్ల జాతర.. అందుబాటు ధరలో.. టాప్ బ్రాండ్లు..
ఈ నెలలో స్మార్ట్ ఫోన్ల జాతర.. అందుబాటు ధరలో.. టాప్ బ్రాండ్లు..
వృద్దాప్య పెన్షన్లు, కూటమి మేనిఫెస్టోపై వైఎస్ భారతి స్పందన..
వృద్దాప్య పెన్షన్లు, కూటమి మేనిఫెస్టోపై వైఎస్ భారతి స్పందన..
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..