AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shruti Haasan: బాయ్‏ఫ్రెండ్‏తో కలిసి వంటగదిలో శ్రుతిహాసన్ రచ్చ.. కలిసి తినేవారే కలిసుంటారు అంటూ..

శ్రుతి హాసన్.. కమల్ హాసన్ వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తక్కువ సమయంలోనే బడా హీరోలతో నటించే ఛాన్స్ అందుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలతో టాలీవుడ్ హీరోయిన్‏గా కొనసాగిన శ్రుతి హాసన్..

Shruti Haasan: బాయ్‏ఫ్రెండ్‏తో కలిసి వంటగదిలో శ్రుతిహాసన్ రచ్చ.. కలిసి తినేవారే కలిసుంటారు అంటూ..
Shruti Haasan
Rajitha Chanti
| Edited By: Rajeev Rayala|

Updated on: Jul 12, 2021 | 3:12 PM

Share

శ్రుతి హాసన్.. కమల్ హాసన్ వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తక్కువ సమయంలోనే బడా హీరోలతో నటించే ఛాన్స్ అందుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలతో టాలీవుడ్ హీరోయిన్‏గా కొనసాగిన శ్రుతి హాసన్.. గత కొంత కాలంగా తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చింది. కెరీర్ మంచి పిక్స్‏లో ఉన్న సమయంలోనే ఇంగ్లాండ్ సింగర్ మైకేల్ కోర్సలేతో ప్రేమలో పడి సినిమాలను వదిలేసింది. ఆ తర్వాత అతనికి బ్రేకప్ చెప్పి తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రుతి… ఇటీవల రవితేజా సరసన “క్రాక్” సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఆ వెంటనే మరోసారి “వకీల్ సాబ్” సినిమాతో స్క్రీన్ షేర్ చేసుకుంది. దీంతో శ్రుతి హాసన్ మరోసారి వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా మారిపోయింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన “కేజీఎఫ్” ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న “సలార్” సినిమాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం శ్రుతి హాసన్.. శంతను హజరికా అనే చిత్రకారుడుతో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. గత కొద్ది కాలంగా వీరిద్దరి ఫోటోలో సోషల్ మీడియాలో తెగ హల్‏చల్ చేస్తున్నాయి. తాజాగా శ్రుతి హాసన్ తన ఇన్‏స్టాగ్రామ్‏లో ఓ వీడియో షేర్ చేసింది. ఇందులో ఇద్దరూ కలిసి తింటున్నారు. చికెన్ ఫ్రైడ్ ఆర్డర్ ఇచ్చి.. వంటగదిలోనే కూర్చుని ఫుల్‏గా కుమ్మెస్తూ కనిపిస్తున్నారు. అయితే అందులో శ్రుతి చేసిన కామెంట్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. కలిసి తినగలిగిన వాళ్లే కలిసి ఉంటారు. ఇదో సాధారణమైన సాయంకాలం, ఫ్రీగా ఫుడ్ దొరికింది. మా ఇద్దరికీ కూడా ఫ్రైడ్ చికెన్ చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది శ్రుతి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.

ట్వీట్..

Aslo Read:  Priyanka: ఆస్పత్రికి వెళ్లి చెక్‌ చేయించుకుంటే సమస్యలన్నీ బయటపడ్డాయి.. శరీరంలో వచ్చిన మార్పులపై ఓపెన్‌ అయిన ప్రియాంక.\

నా మెడలో తాళి ఉండగా నీ మెడలో తాళి పడనివ్వను అంటున్న దీప.. తనకు న్యాయం చేయమని జ్యోతిరెడ్డిని ఆశ్రయించిన మోనిత