AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priyanka: ఆస్పత్రికి వెళ్లి చెక్‌ చేయించుకుంటే సమస్యలన్నీ బయటపడ్డాయి.. శరీరంలో వచ్చిన మార్పులపై ఓపెన్‌ అయిన ప్రియాంక.

Priyanka Jawalkar: మోడల్‌గా కెరీర్‌ మొదలు పెట్టి నటిగా మారారు తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్‌. 2017లో వచ్చిన 'కలవరమాయే' సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చారు ప్రియాంక. అయితే ఈ సినిమాతో పెద్దగా గుర్తింపు...

Priyanka: ఆస్పత్రికి వెళ్లి చెక్‌ చేయించుకుంటే సమస్యలన్నీ బయటపడ్డాయి.. శరీరంలో వచ్చిన మార్పులపై ఓపెన్‌ అయిన ప్రియాంక.
Priyanka
Narender Vaitla
|

Updated on: Jul 12, 2021 | 9:44 AM

Share

Priyanka Jawalkar: మోడల్‌గా కెరీర్‌ మొదలు పెట్టి నటిగా మారారు తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్‌. 2017లో వచ్చిన ‘కలవరమాయే’ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చారు ప్రియాంక. అయితే ఈ సినిమాతో పెద్దగా గుర్తింపు రాకపోయినప్పటికీ విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘టాక్సీవాలా’తో నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తనదైన అందం, అభినయంతో రెండో చిత్రంతోనే యువతను ఆట్రాక్ట్‌ చేశారు ప్రియాంక. ప్రస్తుతం ఈ చిన్నది నటించిన ‘గమనం’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే చూడ చక్కని రూపంతో ఆకట్టుకునే ప్రియాంక కొద్ది రోజుల క్రితం మొటిమలతో ఉన్న ఫొటో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఆ ఫొటో ఫేక్‌ అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. దీనిపై ప్రియాంక కూడా ఎప్పుడూ బహిరంగంగా స్పందించలేరు.

అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక తన శరీరంలో వచ్చిన మార్పులపై స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టాక్సీవాలా సినిమా తర్వాత చాలా లావుగా మారానని చెప్పిన ప్రియాంక.. దీనికి కారణం థైరాయిడ్‌ సమస్యతో పాటు హార్మోన్ల అసమతౌల్యం అని గుర్తించలేకపోయానని తెలిపారు. ఒకనొక సమయంలో ముఖమంతా మొటిమలు విపరీతంగా వచ్చాయన్న ప్రియాంక. తీరా ఆస్పత్రికి చెక్‌ చేయించుకుంటే తనకున్న సమస్యలన్నీ బయటపడ్డాయని తెలిపారు. ఆ క్షణంలో చాలా భయటపడ్డానన్న ఈ అమ్మడు.. తర్వాత జీవన శైలిని పూర్తిగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారంట. అనుకున్నదే తడవుగా.. వ్యాయామాలు, యోగా చేయడంతోపాటు ప్రత్యేక డైట్‌ తీసుకున్నానని చెప్పుకొచ్చారు. ఇంట్లో ఉంటూనే రకరకాల కసరత్తులు చేసి మళ్లీ ఇలా ఫిట్‌గా మారానని తన ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ను చెప్పుకొచ్చారు ప్రియాంక. ఇలా తన జీవితంలో ఎదురైన ఇలాంటి అనుభవాన్ని కూడా ప్రియాంక ఎలాంటి సంశయం లేకుండా షేర్‌ చేసుకోవం విశేషం.

Also Read: అనుష్క, విరాట్‌ల ముద్దుల కూతురు వామికాకు 6 నెలలు.. ఇన్‌స్టాలో ఫొటోలు షేర్ చేస్తూ మురిసిపోతున్న దంపతులు..

Payal Rajput: అందం ఆరబోసిన ఈ అమ్మడికి అవకాశాలు మాత్రం అంతంతే..

Mehreen Pirzada: బ్రేకప్ ను లైట్ తీసుకున్న మెహరీన్.. బీచ్ లో చిల్ అవుతున్న చిన్నది..