Mehreen Pirzada: బ్రేకప్ ను లైట్ తీసుకున్న మెహరీన్.. బీచ్ లో చిల్ అవుతున్న చిన్నది..

అందాల ముద్దుగుమ్మ మెహరీన్ కౌర్ ఇప్పుడు ఈ పేరు తెగ వినిపిస్తుంది. ఎంగేజ్ మెంట్ బ్రేక్ చేసుకొని హాట్ న్యూస్ అయ్యింది ఈ భామ.

Mehreen Pirzada:  బ్రేకప్ ను లైట్ తీసుకున్న మెహరీన్.. బీచ్ లో చిల్ అవుతున్న చిన్నది..
Mehreen Pirzada
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Rajeev Rayala

Updated on: Jul 12, 2021 | 6:06 AM

Mehreen Pirzada: అందాల ముద్దుగుమ్మ మెహరీన్ కౌర్ ఇప్పుడు ఈ పేరు తెగ వినిపిస్తుంది. ఎంగేజ్ మెంట్ బ్రేక్ చేసుకొని టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యింది ఈ భామ. హర్యానా మాజీ సీఎం భజన్ లాల్ మనవడు బిష్ణోయ్ కి నిశ్చితార్ధం అనంతరం మెహ్రీన్ బ్రేకప్ చెప్పిన సంగతి తెలిసిందే. సముద్రం అడుగున ప్రపోజ్‌ వీడియోతో నెట్టింట వైరల్ అయిన భవ్య, మెహరీన్‌ల ఎంగేజ్‌మెంట్‌ అలా గ్రాండ్ గా జరిగిందో లేదో… ఇలా మేం హ్యాపీగా విడిపోతున్నాం అంటూ రీసెంట్‌ గా ట్వీట్ చేశారు మెహ్రీన్‌. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అనౌన్స్‌ చేశారు కూడా. ఇక అప్పటి నుంచి వీళ్ల బ్రేకప్‌ న్యూస్‌ నెట్టింట సందడి చేస్తూనే ఉంది. మెహరీన్ ఎంత మాత్రం గతాన్ని తలుచుకోకుండా లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. మెహరీన్ బీచ్ లో చిలౌట్ అవుతోన్న కొత్త ఫోటోలను ఇన్ స్టా వేదికగా పంచుకుంది.

ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గతాన్ని తలుచుకొని ఏమాత్రం బాధపడకుండా ఈ అమ్మడు చాలా సంతోషం గా ఉండటం చూసి అందరు షాక్ అవుతున్నారు. మెహరీన్ సినిమాల విషయానికొస్తే  ప్రస్తుతం ఈ అమ్మడు అనీల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న ఎఫ్-3లో నటిస్తోంది. అలాగే మారుతి-సంతోష్ శోభన్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రంలోను చేస్తుంది మెహరీన్.

మరిన్ని ఇక్కడ చదవండి :

నారప్ప నీదారెటప్పా… వెంకీ సినిమా పై వీడని కన్ఫ్యూజన్.. ఓటీటీనా..? లేక థియేటర్స్ లోనా .?

Vishal: పప్పులో కాలేసిన హీరో విశాల్ .. ఆడుకున్న నెటిజన్లు.. అసలు విషయం ఏంటంటే..

Acor Suman: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న సీనియర్ హీరో సుమన్

Nagarjuna OTT: ఓటీటీ వార్తలపై స్పందించిన నాగార్జున.. త్వరలోనే ఓ ప్రయోగత్మక సినిమాలో నటించనున్నట్లు.