అనుష్క, విరాట్‌ల ముద్దుల కూతురు వామికాకు 6 నెలలు.. ఇన్‌స్టాలో ఫొటోలు షేర్ చేస్తూ మురిసిపోతున్న దంపతులు..

Virat Kohli Anushka Sharma : బాలీవుడ్ నటి అనుష్క శర్మ, ఆమె భర్త విరాట్ కోహ్లీ ఉత్తమ తల్లిదండ్రులుగా పేరు పొందడానికి బిజీగా

అనుష్క, విరాట్‌ల ముద్దుల కూతురు వామికాకు 6 నెలలు.. ఇన్‌స్టాలో ఫొటోలు షేర్ చేస్తూ మురిసిపోతున్న దంపతులు..
Anushka Sharma
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: uppula Raju

Updated on: Jul 12, 2021 | 8:01 AM

Virat Kohli Anushka Sharma : బాలీవుడ్ నటి అనుష్క శర్మ, ఆమె భర్త విరాట్ కోహ్లీ ఉత్తమ తల్లిదండ్రులుగా పేరు పొందడానికి బిజీగా గడుపుతున్నారు. తమ కూతురు వామికాకు 6 నెలలు పూర్తికావడంతో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. తాజాగా అనుష్క శర్మ కూతురు వామికాకు ఆకాశంలో ఏదో చూపిస్తున్నట్లుగా ఉన్న ఫొటో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ముగ్గురు ఫొటోలు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి..

ఈ ఫొటోలలో అనుష్క శర్మ, వామికా, విరాట్ ముగ్గురినీ చూడవచ్చు. మొదటి ఫొటోలో అనుష్క శర్మ తన ఒడిలో వామికతో ముచ్చటిస్తూ ఉంటుంది. రెండో ఫొటోలో విరాట్ కోహ్లీ వామికను ఎత్తుకొని కనిపిస్తుంది. మూడో చిత్రంలో వామిక, విరాట్ పాదాలను చూడవచ్చు. నాలుగో చిత్రంలో అద్భుతమైన కేక్ చూడవచ్చు. ఈ చిత్రాలను చూసినప్పుడు విరాట్ అనుష్క దంపతులు ఒక పార్కులో పిక్నిక్ కోసం వెళ్ళినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ అనుష్క ఇలా రాసింది “ఆమె ఒక్క నవ్వు మన ప్రపంచాన్ని మొత్తం మార్చగలదు. మీరు మాపై చూపించే ప్రేమకు అనుగుణంగా జీవిస్తామని ఆశిస్తున్నాను ” అంటూ రాసింది. విరాట్, అనుష్క అభిమానులు ఈ చిత్రాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అంతేకాదు కలకాలం ఇలాగే ఉండాలని మనస్పూర్తిగా ఆశీర్వదిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.

రైలు ఎక్కిస్తా.. ఊరికి తీసుకెళ్తా అంటే.. అమ్మ చేయి పట్టుకు వెళ్లారు. కానీ వారితో రైలుకిందపడి ఆత్మహత్యకు పాల్పడిందా తల్లి

Kotia village: పొలిటికల్ టర్న్ తీసుకుంటున్న సరిహద్దు రచ్చ.. తెర మీదికి ఆలయ నిర్మాణ వివాదం..

Hyderabad: స్టార్ అవ్వాలన్న అర్ధాంగి ఆరాటమే అతడి ప్రాణాలు తీసిందా..? వెలుగులోకి కొత్త కోణాలు

R. Narayana Murthy: రైతు చట్టాలను రద్దు చేయాలనే రైతన్న తీశాను.. విడదలకు సిద్ధమైన ఆర్‌.నారాయమూర్తి కొత్త సినిమా.