R. Narayana Murthy: రైతు చట్టాలను రద్దు చేయాలనే రైతన్న తీశాను.. విడదలకు సిద్ధమైన ఆర్‌.నారాయమూర్తి కొత్త సినిమా.

R. Narayana Murthy: రైతులకు ఇబ్బందిగా మారే కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలను వెంటనే రద్దు చేయాలనే ఉద్దేశంతోనే తాను 'రైతన్న' సినిమా తీశానని చెప్పారు నటుడు, దర్శకుడు ఆర్‌. నారాయణ మూర్తి. ఆయన స్వీయ దర్శకత్వంలో..

R. Narayana Murthy: రైతు చట్టాలను రద్దు చేయాలనే రైతన్న తీశాను.. విడదలకు సిద్ధమైన ఆర్‌.నారాయమూర్తి కొత్త సినిమా.
R. Narayan Murthy Raithanna
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 12, 2021 | 7:26 AM

R. Narayana Murthy: రైతులకు ఇబ్బందిగా మారే కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలను వెంటనే రద్దు చేయాలనే ఉద్దేశంతోనే తాను ‘రైతన్న’ సినిమా తీశానని చెప్పారు నటుడు, దర్శకుడు ఆర్‌. నారాయణ మూర్తి. ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం రైతన్న.. సెన్సార్‌ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం పలు రైతు నాయకుల కోసం ఈ సినిమాను ప్రసాద్‌ ల్యాబ్‌లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాద్రి శ్వరరావు, కాంగ్రెస్ పార్టీ లీడర్ కోదండ రెడ్డి, సీ పి ఐ నాయకులు చాడా వెంకట్ రెడ్డి, సి పీ ఎం నాయకులు మధు, టీఆర్‌ఎస్‌ నాయకులు శ్రీనివాసరెడ్డి, ప్రజాకవి గద్దర్ , ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, కవి అందే శ్రీ, రైతు నాయకులు వెంకట రామయ్య, మల్లారెడ్డి , గోవర్ధన్ , రైతు సంఘం సాగర్, శ్రీమతి పద్మ, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ.. ‘సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి త్వరలోనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాను. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు చట్టాలను వెంటనే రద్దు చెయ్యాలి అని రైతన్న సినిమా తీశాను. ఈ చిత్రం ద్వారా నేటి రైతుల పరిస్థితి గురించి చెప్పనున్నాం. భారత దేశంలో సామాజికంగా వెనకబడిన కులం ఏదైనా వుంది అంటే అది రైతు కుటుంబమే. వ్యవసాయం దండుగ కాదు పండుగనే రోజు రావాలని, అన్నం పెట్టే అన్నదాత సుఖ సంతోషంతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను తీసిన చిత్రమే ఈ రైతన్న’ అని మూర్తి చెప్పుకొచ్చారు.

ఆయన నిస్వార్థపరుడు: గోరటి వెంకన్న

ఇక ప్రజా వాగ్గేయ కారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న మాట్లాడుతూ.. ‘ఆర్ నారాయణ మూర్తి ప్రతి పాత్ర కన్నీళ్లు తెప్పించే విధంగా ఉంటుంది. చట్టాలు, రైతాంగ వ్యవస్థను సినిమాగా తీశారు. సినిమా చాలా బాగుంది. చాలా మందికి నారాయణ మూర్తి గురించి తెలియదు. ఈ సినిమాకి సబ్సిడీలు ఇవ్వాలి అన్నారు కానీ ఆయనకు భూమి ఇస్తాను అంటేనే తీసుకోలేదు అలాంటి నిస్వార్థ పరుడు ఆర్ నారాయణ మూర్తి’ అని కొనియాడారు.

ఈ సినిమాను పౌర సమాజంలోకి తీసుకెళ్లాలి: గద్దర్‌

ఇక ప్రజాకవి గద్దర్ మాట్లాడుతూ..’తత్వ వేత్తలు ప్రపంచం గురించి భాష్యం చెప్పారు. వాటిని నేను తప్పు పట్టను. ఈ రైతన్న సినిమాని పౌర సమాజం లోకి తీసుకొని వెళ్లాలి. సొంత ఆశ లేని వాడు ఆర్ నారాయణ మూర్తి. ఇల్లు లేదు, భార్య లేదు, అలు లేదు శులు లేదు, తను నమ్మిన సిద్ధాంతం కోసం రక్తాన్ని చిందించే వ్యక్తి ఆర్ నారాయణ మూర్తి . ఈ సినిమా కార్పొరేట్ రంగాలకు క్వాచన్ పేపర్ లాంటిది. ఈ సినిమాలో రైతుల బాధల గురించి స్పష్టంగా తెలిపాడు. కమిట్ మెంట్ వున్న వ్యక్తి ఆర్ నారాయణ మూర్తి.. వ్యవసాయం దండుగ కాదు వ్యవసాయం పండుగ. ఆ పండుగలో పాల్గొంటాము అని చెపుతున్నాను. గౌరవ ప్రధాని గారు మీరు తెచ్చిన వ్యవసాయ విద్యుత్ చట్టాలు రద్దు చేయండి.. అందరికీ అప్పీల్ చేస్తున్న పెద్దవాళ్లు అందరూ ఆలోచన చేయండి. రైతాంగం తప్పకుండా గెలుస్తుంది’ అని అన్నారు.

Also Read: Oldcity Fight: పాతబస్తీలో అర్ధరాత్రి ఇంటి ముందు లొల్లి, 16 మందికి పైగా వీరంగం, 12 మందికి తీవ్ర గాయాలు

జోరుమీద మెగాస్టార్.. వరుస సినిమాలతో ఫుల్ బిజీ.. బాబీ సినిమా కూడా ఆన్ ద వే..

Kongu Nadu: ప్రత్యేక రాష్ట్రం దిశగా “కొంగునాడు”.. ప్రణాళికలు సిద్ధం చేస్తున్న కేంద్ర సర్కార్..