Salman Khan: తారక్ సినిమాపై కన్నేసిన కండల వీరుడు.. త్వరలోనే హిందీలోకి ఆ బ్లాక్ బస్టర్ మూవీ

ఒక భాషలో హిట్ అయిన సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ అవ్వడం ఈ మధ్య సర్వసాధారణం అయ్యింది. ముఖ్యంగా తెలుగు సినిమాలు చాలా భాషల్లో రీమేక్ అవుతుంటాయి.

Salman Khan: తారక్ సినిమాపై కన్నేసిన కండల వీరుడు.. త్వరలోనే హిందీలోకి ఆ బ్లాక్ బస్టర్ మూవీ
Salman
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Rajeev Rayala

Updated on: Jul 12, 2021 | 6:05 AM

Salman Khan: ఒక భాషలో హిట్ అయిన సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ అవ్వడం ఈ మధ్య సర్వసాధారణం అయ్యింది. ముఖ్యంగా తెలుగు సినిమాలు చాలా భాషల్లో రీమేక్ అవుతుంటాయి. బాలీవుడ్ హీరోలంతా మన సినిమాల పై మనసు పారేసుకుంటూ ఉంటారు. వీరిలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ అయితే మరీనూ.. తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలను వెంటనే బాలీవుడ్ కు తీసుకెళ్లిపోతుంటారు. ఇప్పటికే పోకిరి, కిక్ వంటి సూపర్ హిట్ సినిమాలను అక్కడ రీమేక్ చేసి సాలిడ్ హిట్స్ అందుకున్నాడు. తాజాగా మరో తెలుగు సినిమా పై ఈ కండల వీరుడు కన్నేశాడని తెలుస్తుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ”జనతా గ్యారేజ్”. ఈ సినిమా మనదగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా బాలీవుడ్ కు వెళ్లనుందట.

టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్ మైత్రిమూవీ మేకర్స్ సల్మాన్ ఖాన్ తో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే సల్మాన్ కు అడ్వాన్స్ ఇచ్చి మరీ లాక్ చేసుకున్నారట. సల్మాన్ ఖాన్ తో మైత్రీ వారు చేయబోయేది ”జనతా గ్యారేజ్” సినిమా రీమేక్ అని టాక్ నడుస్తుంది.  మనదగ్గర మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో సమంత – నిత్యా మీనన్ హీరోయిన్ లుగా నటించారు. తారక్ కెరీర్ లో ఈ సినిమా ఓ మంచి హిట్ గా నిలిచింది. మైత్రీ టీమ్ సల్మాన్ తో రీమేక్ చేయాలని చూస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అలాగే దర్శకుడిని వెతికే పనిలో కూడా ఉన్నారట . ఇక సల్మాన్ ఖాన్ పార్టనర్ షిప్ లో ఈ సినిమా తెరకెక్కనుందని అంటున్నారు. మరి ఈవార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

నారప్ప నీదారెటప్పా… వెంకీ సినిమా పై వీడని కన్ఫ్యూజన్.. ఓటీటీనా..? లేక థియేటర్స్ లోనా .?

Vishal: పప్పులో కాలేసిన హీరో విశాల్ .. ఆడుకున్న నెటిజన్లు.. అసలు విషయం ఏంటంటే..

Nagarjuna OTT: ఓటీటీ వార్తలపై స్పందించిన నాగార్జున.. త్వరలోనే ఓ ప్రయోగత్మక సినిమాలో నటించనున్నట్లు.