Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: స్టార్ అవ్వాలన్న అర్ధాంగి ఆరాటమే అతడి ప్రాణాలు తీసిందా..? వెలుగులోకి కొత్త కోణాలు

ఓ నిండు ప్రాణం పోయింది. భార్యభర్తల మధ్య సఖ్యత కొరవడటం ఓ కారణమైతే. సోషల్ మీడియాలో పాపులర్ కావాలన్న తన అర్ధాంగి పిచ్చి కోరికలు....

Hyderabad: స్టార్ అవ్వాలన్న అర్ధాంగి ఆరాటమే అతడి ప్రాణాలు తీసిందా..? వెలుగులోకి కొత్త కోణాలు
Husband Suicide
Follow us
Ram Naramaneni

| Edited By: Rajeev Rayala

Updated on: Jul 12, 2021 | 7:48 AM

ఓ నిండు ప్రాణం పోయింది. భార్యభర్తల మధ్య సఖ్యత కొరవడటం ఓ కారణమైతే. సోషల్ మీడియాలో పాపులర్ కావాలన్న తన అర్ధాంగి పిచ్చి కోరికలు అతడ్ని ప్రశాంతంగా బతకనివ్వలేదు. వీటికి తోడు ఉద్యోగం, కుటుంబ కలహాలు.. మొత్తం కలిసి వైవాహిక జీవితంపైనే విరక్తి పుట్టించాయి. సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతేనగర్‌లో నివాసముంటున్న పవన్‌కి మౌలాలికి చెందిన ప్రియాంకతో 2015లో వివాహం జరిగింది. పెళ్ళి జరిగిన కొద్ది నెలల నుండి ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడం మొదలయ్యాయి. దీనికి తోడు పెళ్లై ఆరేళ్లైనా వీళ్లకు సంతానం కలగకపోవడంతో గొడవలు మరింత పెరిగాయి. వీటితో పాటు మౌనిక తరచూ సోషల్‌ మీడియాలో టిక్‌టాక్ వీడియోలు చేసి పోస్ట్ చేస్తుండేది. ఎప్పటికైనా తానో స్టార్‌ని అవుతానంటూ చెప్పుకోవడం పవన్‌కి అసలు ఇష్టం ఉండేది కాదు. ఈ విషయంలోనే వీళ్లిద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి.

మరోవైపు కరోనా కారణంగా పవన్‌కి ఉద్యోగం కూడా పోయింది. కుటుంబ పోషణకు ఆదాయం లేకపోవడంతో జీవితంపై విరక్తి చెందాడు. అంతే ఇంట్లోనే ఫ్యాన్‌కి ఉరివేసుకున్నాడు. పవన్ సూసైడ్ చేసుకోవడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. అప్పటికే పవన్ చనిపోవడంతో మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పవన్ బలవన్మరణం చేసుకుంటే అతని తల్లిదండ్రులు కోడలు ప్రియాంకనే తమ బిడ్డ చావుకి కారణమని బాలానగర్‌ డీసీపీ పద్మజారెడ్డికి ఫిర్యాదు చేసారు. ఇదే విషయంలో ప్రియాంక కూడా తన భర్త చావు విషయంలో అత్తమామలపై తనకు అనుమానం ఉందంటూ సనత్‌నగర్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. ఇలా ఒకే చావుపై రెండు కంప్లైంట్‌లు రావడంతో పోలీసులు అసలు పవన్ మృతికి కారణాలు ఏంటని రాబట్టే పనిలో ఉన్నారు.

Also Read: ప్రత్యేక రాష్ట్రం దిశగా “కొంగునాడు”.. ప్రణాళికలు సిద్ధం చేస్తున్న కేంద్ర సర్కార్..

మ్యాచ్ గెలిచింది.. తండ్రికి కోపొమొచ్చింది.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన కొడుకు టీజింగ్ వీడియో..