Food Poisoning: నిల్వ ఉన్న ఆహారం తింటే పుడ్ పాయిజన్ అయ్యి వాంతులు అవుతుంటే ఈ సింపుల్ చిట్కాలు మీ కోసమే
Food Poisoning: మనం తీసుకునే ఆహారం విషంగా మారినట్లైతే వెంటనే వాంతులు అవుతాయి. మంచి ఆహారం ఎంత ఆరోగ్యకరమో.. ఆహారం విషపూరితమైతే అంత అనారోగ్యం కూడా. ఎక్కువ కాలం నిల్వ..
Food Poisoning: మనం తీసుకునే ఆహారం విషంగా మారినట్లైతే వెంటనే వాంతులు అవుతాయి. మంచి ఆహారం ఎంత ఆరోగ్యకరమో.. ఆహారం విషపూరితమైతే అంత అనారోగ్యం కూడా. ఎక్కువ కాలం నిల్వ ఉంచిన ఆహారంలో వైరస్, బ్యాక్టీరియా కలిసి ఆహారాన్ని విషపూరితం చేస్తాయి. అలాంటి ఆహారం తిన్నప్పుడు శరీరం దాన్ని ఇముడ్చుకోకుండా వీలయినంత త్వరగా వాంతులు, విరోచనాల రూపంలో బయటకు పంపించి వేస్తుంది. శరీరం తనకు తాను రిపేర్ చేసుకుంటుంది. కడుపులో చేరిన విషాలను తొలగించి జీర్ణవ్యవస్థను గాడిలో పెడుతుంది. ఇలా వాంతులవుతున్నప్పుడు కొన్ని చిట్కాలు పాటిస్తే శరీరం శక్తిని కోల్పోకుండా ఉంటుంది. అవి…
* కడుపులో వికారంగా అనిపిస్తే కొంచెం జీలకర్ర నోట్లో వేసుకుని, నమిలి ఆ రసాన్ని మింగాలి. లేదా ఒక కప్పు నీటీలో ఒక స్పూను జీలకర్ర వేసి కాస్త మరిగించాలి. అదులో చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. * వికారంగా అనిపించినప్పుడు మూడుపూటలా ఒక స్పూన్ తేనె తీసుకుంటే కూడా మంచిది. * ఈ సమయంలో వీలైనంత ఎక్కువగా ద్రవాహారం తీసుకోవాలి. * గంటకోసారి గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, ఒక స్పూను చక్కెర, చిటికెడు ఉప్పు కలుపుకుని తాగితే దేహం శక్తిని పుంజుకుంటుంది. * వాంతులవుతున్నప్పుడు కాఫీ, టీలను పూర్తిగా మానేయడం మంచిది. పాలను కూడా తీసుకోకపోవడం మంచిది. * వాంతులు పూర్తిగా నయమయ్యేంతవరకు బాగా పండిన అరటి పండ్లు, బియ్యం ఉడికించిన జావ, మజ్జిగన్నం తీసుకోవాలి. * ఈ సమయంలొ పచ్చి కూరగాయలు, హాఫ్ బాయిల్డ్ ఫుడ్, మాంసాహారం తీసుకోకూడదు. * తులసి ఆకుల రసం తీసుకుంటే, కడుపులో చేరిన విషాహారాన్ని తొలగించి జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి దోహదపడుతుంది. * పెరుగులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి పెరుగు తీసుకుంటే ఫుడ్ పాయిజనింగ్ ప్రభావం తగ్గుతుంది. మరీ ఎక్కువగా వాంతులు అయ్యి శరీరం నీరసించి పోతే వీలైనంత త్వరగా వైద్యుణ్ణి సంప్రదించడం మంచిది.
Also Read: Filmmaker: నిక్కరు వేసుకుంటే తమ ఊరిలో నవ్వుతారని ఆ సూపర్ హిట్ మూవీని రిజెక్ట్ చేసిన డైరెక్టర్