Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken Starter Recipe: రుచికరమైన పెషావరీ చికెన్ కబాబ్ రెసిపీ.. రెస్టారెంట్ స్టైల్‌లో ఇంట్లో సులువుగా తయారు చేయండి

చికెన్ తో చేసే కూరలు, బిర్యానీ, పచ్చడి వంటివి మాత్రమే కాదు.. స్టార్టర్స్ ని కూడా ఎంతో ఇష్టంగా తింటారు. సీఖ్ కబాబ్‌లు, తంగ్డి కబాబ్, చికెన్ షామి నుంచి తందూరి చికెన్ టిక్కాల వరకు అనేక రకాల స్టార్టర్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని మాంసాహార ప్రియులు ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా చికెన్ తినడానికి ఇష్టపడితే, చికెన్ స్టార్టర్లను అది కూడా ఎంతో రుచికరమైన పెషావరీ చికెన్ కబాబ్ లను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. విందులో పసందుగా తినొచ్చు.

Chicken Starter Recipe: రుచికరమైన పెషావరీ చికెన్ కబాబ్ రెసిపీ.. రెస్టారెంట్ స్టైల్‌లో ఇంట్లో సులువుగా తయారు చేయండి
Peshawari Chicken Kebab
Follow us
Surya Kala

|

Updated on: Mar 10, 2025 | 3:17 PM

మాంసాహార ప్రియులలో చికెన్ ప్రియులు వేరయా.. ఎక్కువ మంది చికెన్ తినడానికి ఇష్టపడతారు. చికెన్ తో చేసే ఎటువంటి ఆహరాన్ని అయినా సరే నో చెప్పకుండా లాగించేస్తారు. అయితే కొన్ని రకాల చికెన్ ఐటమ్స్ ను ఇంట్లో తయారు చేసుకోవడం రాక రెస్టారెంట్ కు వెళ్లి తింటారు. ముఖ్యంగా చికెన్ తో స్టార్టర్స్ ను రెస్టారెంట్ లోనే తినడానికి ఇష్టపడతారు. మీకు కూడా చికెన్ తో చేసిన రుచికరమైన పెషావరీ చికెన్ కబాబ్ అనే చికెన్ స్టార్టర్ ఇష్టం అయితే.. ఇంట్లోనే తయారు చేసుకోండి. రుచికరమైన పెషావరీ చికెన్ కబాబ్‌లతో విందు పసందుగా మారుతుంది. పాకిస్తాన్ లోని పెషావర్ లో పుట్టిన ప్రసిద్ధ వంటకం పెషావరీ కబాబ్. దీనిని చిన్న చిన్న ముక్కలు చేసిన చికెన్ తో తయారు చేస్తారు. అందుకనే ఈ పెషావరీ కబాబ్‌లు తినడానికి చాలా ఈజీ. ఈ రోజు పెషావరీ చికెన్ కబాబ్ రెసిపీ గురించి తెలుసుకుందాం..

తయారుచేయడానికి కావాల్సిన పదార్ధాలు

  1. చికెన్ కీమా – అర కిలో
  2. గుడ్డు – 1
  3. శనగ పిండి – 3 టీస్పూన్లు
  4. ఉల్లిపాయ – 1 (చిన్నగా తరిగినది)
  5. ఇవి కూడా చదవండి
  6. టొమాటో – 1 (చిన్నగా తరిగినది)
  7. పచ్చిమిరపకాయలు – 2 (చిన్నగా తరిగినవి)
  8. అల్లం వెల్లుల్లి పేస్టు – 2 టీస్పూన్లు
  9. కారం – ఒక టీ స్పూన్
  10. పసుపు – కొంచెం
  11. ధనియాల పొడి – 2 టీస్పూన్లు
  12. జీలకర్ర – 2 టీస్పూన్లు
  13. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ – 1 టీస్పూన్
  14. గరం మసాలా పొడి – 1 టీస్పూన్
  15. దానిమ్మ గింజల పొడి – 1 1 / 2 టీస్పూన్లు
  16. కొత్తిమీర – ఒక కట్ట
  17. ఉప్పు – రుచికి సరిపడా
  18. ఉల్లికాడలు – 2 (ఆప్షనల్)
  19. నూనె- వేయించడానికి సరిపడా

తయారీ విధానం: ముందుగా తీసుకున్న చికెన్ ను కడిగి శుభ్రం చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు , ఉల్లి కాడల ముక్కలు, కొత్తిమీర , ఉప్పు, కొంచెం కారం , జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, దానిమ్మ గింజల పొడి వేసి కలపాలి. ఇప్పుడు శనగ పిండిని వేసి బాగా కలపాలి. తర్వాత ఒక గిన్నె తీసుకుని గుడ్డు సోనని అందులో వేసి బాగా గిలకొట్టాలి. తర్వాత ఈ గిలకొట్టిన ఎగ్ ను చికెన్ కీమా మసాలా మిశ్రమంలోకి వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ చికెన్ కీమా కబాబ్ మిశ్రమాన్ని ఒక అర గంట పాటు ఓ పక్కకు పెట్టాలి. అరగంట తర్వాత ఒక పాన్ తీసుకుని దానిలో వేయించడానికి నూనె పోసుకోవాలి. ఇప్పుడు రెడీ చేసుకున్న చికెన్ కీమా మిశ్రమాన్ని బాగా కలిపి, చిన్న టిక్కీలుగా చేసి వేయించాలి. వేగిన తర్వాత ఈ పెషావరీ చికెన్ కబాబ్ ను ఒక ప్లేట్ లో తీసుకోవాలి. పుదీనా చెట్నీతో వేడివేడిగా వీటిని అందించండి. ఎవరైనా సరే ఈ టేస్టీ టేస్టీ పెషావరీ చికెన్ కబాబ్ ను లోట్టలేసుకుంటూ తినేస్తారు. ఇంట్లో తయారుచేసిన ఈ కబాబ్‌లు రెస్టారెంట్ కంటే ఎంతో రుచికరంగా ఉంటాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి