Happy Life Tips: పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి.. వయసు ప్రకారం పగలు ఎంత సేపు నిద్రపోవాలో తెలుసా
మనిషి ఆరోగ్యకరమైన జీవనశైలిలో తగినంత నిద్ర తప్పని సరి. పిల్లల నుంచి పెద్దల వరకూ రోజూ తగినంత నిద్ర పట్టాలి. అయితే పిల్లలు రాత్రి మాత్రమే కాదు పగలు కూడా నిద్ర పోతారు. ప్రతి బిడ్డ నిద్ర అవసరం భిన్నంగా ఉంటుంది. అయితే సరైన సమయంలో నిద్రపోవడం పిల్లల ఆరోగ్యానికి చాలా ముఖ్యం. పిల్లలకు తగినంత నిద్రపోకపోతే లేదా నిద్ర పట్టడంలో ఇబ్బంది పడుతుంటే.. అప్పుడు వైద్యుడిని సంప్రదించాలి

పిల్లల మానసిక, శారీరక అభివృద్ధికి మంచి నిద్ర చాలా ముఖ్యం. పిల్లలు సరిగ్గా నిద్రపోతే.. మెదడు పని తీరు మెరుగుగా ఉంటుంది, రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది. చురుగ్గా ఉంటాడు. అయితే చాలా మంది తల్లిదండ్రులకు తమ చిన్నారులు పగటి సమయంలో ఎంతసేపు నిద్రపోవాలో తెలియదు. ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఎక్కువసేపు లేదా తక్కువసేపు నిద్రించేలా చూస్తారు. అటువంటి పరిస్థితిలో పిల్లలు తమ వయస్సు ప్రకారం ఎంతసేపు నిద్రపోవాలో తెలుసుకోవడం ముఖ్యం. పిల్లలు నిద్రపోయే సమయం గురించి ఈ రోజు తెలుసుకుందాం..
- నవజాత శిశువులు (0-3 నెలలు): నవజాత శిశువులకు ఎక్కువ నిద్ర అవసరం. వీరు రోజులో 14 నుంచి 17 గంటలు నిద్రపోవాలి. ఈ నిద్ర పగలు, రాత్రి రెండు సమయాల్లో మాత్రమే.. స్వల్ప కాలాలు మాత్రమే ఉంటుంది. నవజాత శిశువులు ఎంత ఎక్కువగా నిద్రపోతే.. వారు అంత ఆరోగ్యంగా ఉంటారు.
- శిశువులు (4-12 నెలలు): ఈ వయస్సులో చిన్నారులకు 12 నుంచి 16 గంటల పాటు నిద్రపోవాలి. రోజుకు 2 నుంచి 3 సార్లు చిన్న కునుకు తీయడం ముఖ్యం. మంచి నిద్ర పిల్లలు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది.
- చిన్నపిల్లలు (1-2 సంవత్సరాలు): పసిపిల్లలు ప్రతిరోజూ 11 నుంచి 14 గంటల పాటు నిద్రపోవాలి. ఈ వయస్సులో పగటి సమయంలో తప్పని సరిగా నిద్ర అవసరం. ఈ వయసు పిల్లలకు కూడా ఎక్కువ నిద్ర అవసరం.
- ప్రీ స్కూలర్లు (3-5 సంవత్సరాలు): ఈ వయసు పిల్లలకు 10 నుంచి 13 గంటల నిద్ర అవసరం. ఈ వయస్సులో చాలా మంది పిల్లలు పగటి సమయంలో నిద్రపోవడం తగ్గిస్తారు. అయితే తప్పని సరిగా తగినంత నిద్ర పొందడం ముఖ్యం.
- పాఠశాలకు వెళ్ళే పిల్లలు (6-12 సంవత్సరాలు): ఈ పిల్లలు రోజుకు 9 నుంచి 12 గంటలు నిద్రపోవాలి. రాత్రి త్వరగా పడుకోవడం, ఉదయం సమయానికి నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. ఇది పిల్లల మానసిక ఆరోగ్యాన్ని బాగా ఉంచుతుంది.
- టీనేజర్లు (13-18 సంవత్సరాలు): టీనేజర్లకు కనీసం 8-10 గంటలు నిద్ర అవసరం. ఈ వయస్సులో చదువు, మొబైల్ ఫోన్ల వల్ల నిద్ర ప్రభావితం అవుతుంది. కనుక స్క్రీన్ చూసే సమయాన్ని నియంత్రించాలి. ఈ వయసు పిల్లలు టీవీ, మొబైల్, ట్యాబ్ లేదా ల్యాప్‌టాప్‌లతో ఎక్కువ సమయం గడపకూడదు.
పిల్లలకు మంచి నిద్ర కోసం ముఖ్యమైన చిట్కాలు
- నిద్రపోవడానికి, మేల్కొనడానికి ఒక నిర్దిష్ట సమయాన్ని నిర్దేశించుకోండి.
- పడుకునే ముందు మొబైల్, టీవీ , వీడియో గేమ్‌లకు దూరంగా ఉండండి.
- రాత్రి సమయంలో తేలికైన, పోషకమైన ఆహారం ఇవ్వండి.
- నిద్రపోయే ముందు ఒక కథ చెప్పండి లేదా విశ్రాంతినిచ్చే కార్యకలాపం చేయండి.
- గది వాతావరణాన్ని ప్రశాంతంగా .. సౌకర్యవంతంగా చేయండి.
- చాలా సార్లు పిల్లలు అంతర్గత సమస్యల కారణంగా సరిగ్గా నిద్రపోరు. నవజాత శిశువు నిద్రపోలేక బిగ్గరగా అరుస్తుంటే.. తల్లిదండ్రులు వెంటనే పిల్లల్ని వైద్యుడి వద్దకు తీసుకెళ్ళండి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని జీవనశైలి వార్తలు చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి