Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రికి రాత్రే ఆసియాలో అత్యంత ధనవంతురాలైన భారతీయురాలు.. రోష్ని నాడార్ ఎవరో తెలుసా

రాత్రి నిద్రపోయిన వ్యక్తి తెల్లవారిన తర్వాత నిద్ర లేచే సరికి బోలెడు డబ్బులు కనిపిస్తే షాక్ తింటారు. ఇలాంటివి కలలోనే జరుగుతాయి. నిజ జీవితంలో జరుగుతాయా అని కూడా ఆలోచిస్తారు. ఇప్పుడు ఓ మహిళ రాత్రికి రాత్రే అత్యంత ధనవంతురాలైంది. అది కూడా ఆసియా దేశంలోనే అత్యంత ధనవంతురాలైన వ్యాపారవేత్తగా నిలిచింది. ఆమె రోష్ని నాడార్.. తమ కంపెనీలో అతిపెద్ద వాటాదారుగా మారడం ద్వారా రోష్ని నాడార్ మల్హోత్రా భారతదేశంలోని మూడవ ధనవంతురాలైన భారతీయురాలు అయ్యింది. అంతేకాదు ఆసియాలోనే అత్యంత ధనిక వ్యాపారవేత్తగా కూడా మారింది. బ్లూమ్‌బెర్గ్ డేటా ప్రకారం రోష్ని ప్రపంచంలోని 5వ ధనవంతురాలైన మహిళ.

రాత్రికి రాత్రే ఆసియాలో అత్యంత ధనవంతురాలైన భారతీయురాలు.. రోష్ని నాడార్ ఎవరో తెలుసా
Roshni Nadar Malhotra
Follow us
Surya Kala

|

Updated on: Mar 10, 2025 | 11:08 AM

ప్రఖ్యాత వ్యాపారవేత్త రోష్ని నాడార్ హెచ్‌సిఎల్ టెక్నాలజీ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ కుమార్తె. రాత్రికి రాత్రే భారతదేశంలో మాత్రమే కాదు ఆసియాలోనే అత్యంత ధనవంతురాలైన వ్యాపారవేత్తగా ఆమె మారింది. అయితే ఈ ఘనత రోష్ని తండ్రి వల్లే దక్కింది. రోష్ని తండ్రి వ్యాపార సంస్థలో తన 47 శాతం వాటాను తన కుమార్తె రోష్ని నాదర్ మల్హోత్రాకు బహుమతిగా అప్పగించారు. తన తండ్రి నుంచి బహుమతిగా కంపెనీలో భారీ వాటాను అందుకున్న తర్వాత రోష్ని నాడార్ నికర విలువ ఓ రేంజ్ లో పెరిగింది. ఎంతగా అంటే ప్రపంచం కుబేర మహిళలలో ఒకరుగా నిలిచింది.

ఆసియాలోనే అత్యంత ధనిక వ్యాపారవేత్త

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ డేటా ప్రకారం రోష్ని నాడార్ మల్హోత్రా ఇటీవల HCL గ్రూప్ వ్యవస్థాపకులు శివ్ నాడార్ నుంచి 47 శాతం వాటాను కొనుగోలు చేసిన తర్వాత కంపెనీలో అతిపెద్ద వాటాదారుగా మారారు. అంతేకాదు ఆమె భారతదేశంలో మూడవ ధనవంతురాలైన భారతీయురాలిగానే కాదు.. ఆసియాలో కూడా అత్యంత ధనిక వ్యాపారవేత్తగా కూడా మారింది. బ్లూమ్‌బెర్గ్ డేటా ప్రకారం అంతేకాదు రోష్ని ప్రపంచంలోని 5వ ధనవంతురాలైన మహిళ. తన తండ్రి నుంచి కంపెనీలలో పెద్ద వాటాను వారసత్వంగా పొందిన తర్వాత.. రోష్ని నాడర్ బిలియనీర్ల ప్రపంచంలోకి అడుగు పెట్టింది.

అతిపెద్ద వాటాదారు

వారసత్వ ప్రణాళికలో భాగంగా HCL టెక్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్, HCL కార్పొరేషన్, వామా ఢిల్లీ వంటి ప్రమోటర్ సంస్థలలో తన 47 శాతం వాటాను తన కుమార్తెకు బహుమతిగా ఇచ్చారు. గిఫ్ట్ డీడ్ బదిలీ పూర్తయిన తర్వాత.. ఆమె HCL కార్ప్ , వామాపై మెజారిటీ నియంత్రణను పొందనున్నారు. దీని కారణంగా రోష్న HCL ఇన్ఫోసిస్టమ్స్, HCLTech లలో అతిపెద్ద వాటాదారుగా మారారు. ప్రస్తుతం, రెండు కంపెనీలలో రోష్ని నాడార్ మొత్తం వాటా 57 శాతానికి పైగా పెరిగింది.

ఇవి కూడా చదవండి

అంబానీ.. అదానీ తర్వాత రోష్నీ

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ముఖేష్ అంబానీ 88.1 బిలియన్ డాలర్ల నికర విలువతో భారతదేశంలో మాత్రంమే కాదు ఆసియాలో అత్యంత ధనవంతుడైన భారతీయుడిగా కొనసాగుతున్నారు. అంబానీ తర్వాత గౌతమ్ అదానీ 68.9 బిలియన్ డాలర్లతో రెండవ స్థానంలో ఉన్నారు. శివ్ నాడార్ తన వాటాను రోష్ని నాడార్ మల్హోత్రాకు బదిలీ చేయడానికి ముందు $35.9 బిలియన్లతో మూడవ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు తండ్రి స్థానంలో రోష్ని ఈ స్థానాన్ని పొందనున్నారు.

హెచ్‌సిఎల్ కార్ప్‌లో 49.94% వాటా

దీనితో పాటు రోష్ని నాడర్ మల్హోత్రాకు హెచ్‌సిఎల్ ఇన్ఫోసిస్టమ్స్‌లోని వామా ఢిల్లీకి 12.94 శాతం వాటా, హెచ్‌సిఎల్ కార్ప్‌లో 49.94 శాతం వాటాపై ఓటు హక్కులు లభించాయి. ప్రస్తుతం వామా ఢిల్లీ ఇన్వెస్ట్‌మెంట్స్ హెచ్‌సిఎల్ టెక్‌లో 44.71 శాతం వాటాను కలిగి ఉంది. దీని విలువ రూ.186,782 కోట్లు. 2020 నుంచి HCL టెక్ చైర్‌పర్సన్‌గా ఉన్న రోష్ని నాడర్ మల్హోత్రా తన తండ్రి నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఆమె నార్త్ వెస్ట్రన్ విశ్వవిద్యాలయం నుంచి కమ్యూనికేషన్స్‌లో గ్రాడ్యుయేట్ డిగ్రీ, కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి MBA పట్టా తీసుకున్నారు.

వెనుకబడిన అజీమ్ ప్రేమ్‌జీ

ప్రత్యేకత ఏమిటంటే హోల్డింగ్ విలువ పరంగా రోష్ని నాడార్ విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌జీని అధిగమించారు. రోష్ని నాడార్ విలువ పరంగా కంపెనీలో అతిపెద్ద వాటాను కలిగి ఉన్న ప్రమోటర్‌గా మారారు. నివేదిక ప్రకారం రోష్నికి HCL టెక్‌లో రూ.2.57 లక్షలకు పైగా వాటా ఉంది. కాగా విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌జీకి హోల్డింగ్ కంపెనీలో దాదాపు రూ.2.19 లక్షల కోట్ల వాటా ఉంది. ఎల్ అండ్ టి మైండ్ ట్రీలో ఎల్ అండ్ టికి రూ.95 వేల కోట్లకు పైగా వాటా ఉంది. ఇన్ఫోసిస్‌లో ప్రైవేట్ వ్యక్తులు రూ.91 వేల కోట్లకు పైగా వాటాలను కలిగి ఉన్నారు. టెక్ మహీంద్రాలో మహీంద్రా గ్రూప్ కు రూ.51,000 కోట్లకు పైగా వాటా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..