Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చియా సీడ్స్‌లో ఏ విటమిన్‌ ఎక్కువగా ఉంటుందో తెలుసా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..

చాలా మంది బరువు తగ్గడానికి చియా సీడ్స్ తింటారు. చియా గింజలు విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లకు శక్తివంతమైన వనరు. ఇవి కాకుండా, ఒమేగా-3, ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, యాంటీఆక్సిడెంట్లు వంటి అనేక పోషకాలు కూడా పుష్కలంగా నిండివున్నాయి. అటువంటి పరిస్థితిలో చియా విత్తనాలలో ఏ విటమిన్ ఎక్కువగా ఉందో తెలుసుకుందాం.

Jyothi Gadda

|

Updated on: Mar 10, 2025 | 8:23 AM

చియా గింజల్లో విటమిన్ బీ, యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సహా చాలా పోషకాలు ఉంటాయి. ఇవి రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. 
చియా గింజలను మీ డైట్‍లో రెగ్యులర్‌గా తీసుకుంటే బరువు తగ్గేందుకు మీకు ప్రభావవంతంగా తోడ్పడతాయి. చాలా రకాలుగా వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడతాయి.

చియా గింజల్లో విటమిన్ బీ, యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సహా చాలా పోషకాలు ఉంటాయి. ఇవి రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. చియా గింజలను మీ డైట్‍లో రెగ్యులర్‌గా తీసుకుంటే బరువు తగ్గేందుకు మీకు ప్రభావవంతంగా తోడ్పడతాయి. చాలా రకాలుగా వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడతాయి.

1 / 5
చియా విత్తనాలలో బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. చియా గింజలు వివిధ రకాల బి విటమిన్లతో సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ బి3 (నియాసిన్) అత్యంత సమృద్ధిగా ఉంటుంది.
దీనితో పాటు, విటమిన్లు బి1, బి2, బి9 కూడా ఇందులో మంచి పరిమాణంలో ఉంటాయి.

చియా విత్తనాలలో బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. చియా గింజలు వివిధ రకాల బి విటమిన్లతో సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ బి3 (నియాసిన్) అత్యంత సమృద్ధిగా ఉంటుంది. దీనితో పాటు, విటమిన్లు బి1, బి2, బి9 కూడా ఇందులో మంచి పరిమాణంలో ఉంటాయి.

2 / 5
ఇన్ని రకాల విటమిన్లు అధికంగా ఉండే చియా విత్తనాలను తినడం వల్ల మీ కడుపు ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. ఇది బరువు నిర్వహణకు సహాయపడుతుంది. వీటితో పాటు చియా విత్తనాలలో అధిక మొత్తంలో ఫైబర్ కూడా ఉంటుంది. చియా విత్తనాలను క్రమం తప్పకుండా తినడం వల్ల అనేక వ్యాధులకు ప్రయోజనకరంగా ఉంటుంది.

ఇన్ని రకాల విటమిన్లు అధికంగా ఉండే చియా విత్తనాలను తినడం వల్ల మీ కడుపు ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. ఇది బరువు నిర్వహణకు సహాయపడుతుంది. వీటితో పాటు చియా విత్తనాలలో అధిక మొత్తంలో ఫైబర్ కూడా ఉంటుంది. చియా విత్తనాలను క్రమం తప్పకుండా తినడం వల్ల అనేక వ్యాధులకు ప్రయోజనకరంగా ఉంటుంది.

3 / 5
చియా సీడ్స్‌లో సోలబుల్ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి తింటే కడుపు నిండిన ఫీలింగ్ ఎక్కువగా సేపు ఉంటుంది. దీనివల్ల ఇతర ఆహారాలు ఎక్కువగా తినకుండా ఉంటూ క్యాలరీలు తక్కువ తీసుకుంటారు. ఇలా బరువు తగ్గేందుకు ఉపకరిస్తుంది.

చియా సీడ్స్‌లో సోలబుల్ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి తింటే కడుపు నిండిన ఫీలింగ్ ఎక్కువగా సేపు ఉంటుంది. దీనివల్ల ఇతర ఆహారాలు ఎక్కువగా తినకుండా ఉంటూ క్యాలరీలు తక్కువ తీసుకుంటారు. ఇలా బరువు తగ్గేందుకు ఉపకరిస్తుంది.

4 / 5
చియా గింజల్లో ఉండే ప్రోటీన్ వల్ల జీవక్రియ మెరుగ్గా ఉంటుంది. జీవక్రియ బాగుంటే క్యాలరీలు ఎక్కువగా బర్న్ అయ్యే అకాశం ఉంటుంది. దీనివల్ల బరువు తగ్గేందుకు తోడ్పాటు దక్కుతుంది. 
జీర్ణక్రియను, పేగుల ఆరోగ్యాన్ని కూడా చియా సీడ్స్ మెరుగుపరుస్తాయి. చియా గింజలను నీటిలో నానబెట్టుకొని తీసుకోవచ్చు. పెరుగులో, సూత్మీల్లో,  ఓట్ మీల్‍లో, ఇతర వంటకాల్లో వేసుకొని తినొచ్చు.

చియా గింజల్లో ఉండే ప్రోటీన్ వల్ల జీవక్రియ మెరుగ్గా ఉంటుంది. జీవక్రియ బాగుంటే క్యాలరీలు ఎక్కువగా బర్న్ అయ్యే అకాశం ఉంటుంది. దీనివల్ల బరువు తగ్గేందుకు తోడ్పాటు దక్కుతుంది. జీర్ణక్రియను, పేగుల ఆరోగ్యాన్ని కూడా చియా సీడ్స్ మెరుగుపరుస్తాయి. చియా గింజలను నీటిలో నానబెట్టుకొని తీసుకోవచ్చు. పెరుగులో, సూత్మీల్లో, ఓట్ మీల్‍లో, ఇతర వంటకాల్లో వేసుకొని తినొచ్చు.

5 / 5
Follow us